మత్తెక్కించే కళ్లు, తేనెలూరే పెదాలు, ఒంట్లోని అణువణువును నటింపజేసే సత్తా ఉన్న అలనాటి అందాల తార మోహిని. 90వ దశకంలోని కుర్రకారు ఇప్పటికీ ఆమెను మర్చిపోలేరు. దక్షిణాదిలోని అన్ని సినిమా పరిశ్రమలలో ఎన్నో అద్భుత సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీ చిత్ర పరిశ్రమలోనూ సత్తా చాటింది. ఆమె కెరీర్ లో సుమారు 100 సినిమాల్లో నటించింది. బాలకృష్ణ, చిరంజీవి, శివాజీ గణేషన్, మోహన్ లాల్ టాంటి దిగ్గజ నటులతో జతకట్టింది. వీరితో కలిసి పలు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది. 2011లో ఓ సినిమాలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత వెండితెరకు దూరంగా ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, తన కెరీర్ లో అత్యంత ఇబ్బంది పడ్డ సినిమా, ఇబ్బంది పెట్టిన దర్శకుడి గురించి చెప్పుకొచ్చింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎవరా వ్యక్తి? అంటే..
ఇక తమిళ దర్శకుడు, రోజా భర్త ఆర్ కే సెల్వమణి డైరెక్షన్ లో ‘కన్మణి’ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో మోహిని హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా తను ఎదుర్కొన్న ఇబ్బంది జీవితంలో మర్చిపోలేనని చెప్పింది. “ఈ సినిమాలో ఓ పాట కోసం స్విమ్ సూట్ ధరించాలని దర్శకుడు సెల్వమణి చెప్పాడు. కానీ, నాకు ఆ దుస్తులు ధరించడం అస్సలు ఇష్టం లేదు. గ్లామర్ సన్నివేశాలు చేయడం కూడా నాకు నచ్చలేదు. సెట్ లో అందరి స్విమ్ సూట్ కనిపించాలంటే చాలా సిగ్గనిపించింది. నాకు ఆ దుస్తులు సౌకర్యంగా ఉండవు అని దర్శకుడికి చెప్పాను. కానీ, ఆయన వినలేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నేను స్విమ్ సూట్ వేసుకోనని పట్టుబట్టాను. కానీ, నాపై ఒత్తిడి తెస్తూనే ఉన్నాడు. చివరికి ఆయన ఒత్తిడితో అస్సలు ఇష్టం లేకపోయినా, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ దుస్తులు ధరించాల్సి వచ్చింది. నా అభిప్రాయానికి పూర్తిగా విరుద్ధంగా ఆ సీన్ లో నటించాల్సి వచ్చింది. అది నాకు ఎంతో అసౌకర్యంగా అనిపించింది. కొన్నిసార్లు ఇండస్ట్రీలో మహిళలు మగాళ్ల ఒత్తిళ్లకు లొంగాల్సి వస్తుంది. ఈ రంగంలో ఇష్టం ఉన్న పని చేయడం కుదరదు” అని మోహని చెప్పుకొచ్చింది.
మోహిని తెలుగులో చిరంజీవి, బాలకృష్ణతో కలిసి బ్లాక్ బస్టర్ సినిమాలు చేసింది. అందులో ఒకటి ‘హిట్లర్’ కాగా, మరొకకటి ‘ఆదిత్య 369’. 1991లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘ఆదిత్య 369’ మోహిని మెయిన్ హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా ఆమె కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత ఆమెకు బోలెడు అవకాశాలు వచ్చాయి. అటు అక్షయ్ కుమార్ తో కలిసి బాలీవుడ్ లో ‘డాన్సర్’(1991) అనే సినిమా చేసింది.
Read Also: నేను హీరోయిన్ అని నా భర్తకు తెలీదు.. ఆ మూవీ చూసి భయపడ్డారు – శ్రియా