Jwala Gutta : భారత మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల మంచి మనస్సు చాటుకున్నారు. తల్లిపాలకు దూరమైన శిశువులు అనారోగ్యం బారిన పడకుండా ఆమె తన పాలను దానం చేశారు. ఏప్రిల్ లో బిడ్డను కన్న గుత్తా జ్వాల ఇప్పటివరకు దాదాపు 30 లీటర్ల పాలను మిల్క్ బ్యాంకు కి అందించారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇది చూసిన నెటిజన్లు జ్వాల విశాల హృదయానికి ఫిదా అవుతున్నారు. ఆమె అందరికీ స్పూర్తిగా నిలుస్తున్నారంటూ ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లిపాలను దానం చేస్తూ.. ఎందరో నవజాత శిశువుల జీవితాలకు భరోసా ఇస్తోంది.
Also Read : IND Vs PAK : పాకిస్థాన్ కు మరో అవమానం…జాతీయ గీతం కాకుండా డీజే పాటలు
గుత్త జ్వాల, తన భర్త నటుడు, నిర్మాత విష్ణు విశాల్ తో కలిసి ఈ పనికి శ్రీకారం చుట్టింది. తల్లిపాలు అకాలంగా పుట్టినా.. తీవ్ర అనారోగ్యంతో ఉన్న పిల్లలకు ఎంత ముఖ్యమో తెలియజేస్తూ.. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకుంది. గత నాలుగు నెలలుగా ఆమె క్రమం తప్పకుండా పాలను దానం చేయడం విశేషం. ఇటీవలే గుత్వా జ్వాల తన ట్విట్టర్ ఖాతాలో తన లక్ష్యం గురించి ఓ పోస్ట్ చేసింది. తల్లి పాలు ప్రాణాలను కాపాడుతాయి. అకాలంగా పుట్టిన, అనారోగ్యంతో ఉన్న శిశువులకు దాత పాలు ఒక కొత్త జీవితాన్ని ఇవ్వగలవు. మీరు పాలదానం చేయగలిగితే.. మీరు ఓ కుటుంబానికి హీరో కాగలరు. దీనికి గురించి మరింత తెలుసుకోండి.. ఈ విషయాన్ని పంచుకోండి. మిల్క్ బ్యాంకులకు మద్దతు ఇవ్వండి అంటూ రాసుకొచ్చింది. దీంతో అప్పట్లో ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
గుత్తా జ్వాల అద్భుతమైన చొరవ..
గుత్తా జ్వాల చేపట్టిన ఈ కార్యక్రమానికి ఆన్ లైన్ లో విస్తృతంగా ప్రశంసలు లభించాయి. ఓ నెటిజన్ అయితే “ఆమె చాలా మంది శిశువులకు తల్లి” అంటూ వ్యాఖ్యానించారు. మరొకరూ ఇది చాలా గొప్ప సహకారం అని.. చాలా మంది ఇలాంటి మంచి పనులకు ముందుకు రారు. గుత్తా జ్వాల సహకారం చాలా మంది శిశువులకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. మరో వ్యక్తి.. “తల్లి పాలలో DHA ఉంటుంది. అయితే ఇది మాత్రం పౌడర్ లేదా ఆవు, గేదే పాలల్లో ఎందులో కూడా లభించదు. ముఖ్యంగా DHA పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి చాలా ముఖ్యమైనది. ఈ గొప్ప ని చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు” అంటూ మరో వ్యక్తి ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరిస్తూ పోస్టు చేశారు. గుత్తా జ్వాల ఒక ఛాంపియన్ అయినప్పటికీ ఆమె స్పూర్తి.. “స్వర్ణ హృదయం” ఉన్న క్రీడాకారిణి అంటూ పోస్టు చేశారు. గుత్తా జ్వాల చేపట్టే ఈ కార్యక్రమానికి సోషల్ మీడియాలో ప్రశంసలు లభించడం విశేషం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయం.