Gold Rate Today: అయ్య బాబోయ్.. బంగారం ధరలు మళ్లీ ఇంతలా పెరుగుతున్నాయ్.. ఎంటీ..? మళ్లీ ముందులా బంగారం ధరలు వేయిలలో పెరిగిపోతుంది. అసలు బంగారం తగ్గుతది అని చెప్పిన నిపుణులు మళ్లీ ఎందుకు పెరుగుతుంది అని పసిడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు. రికార్డు స్థాయిలో బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. నిన్నమొన్న తగ్గినట్లే తగ్గి మళ్లీ నేడు భారీగా పెరిగిపోయింది.
నేటి బంగారం ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు భారీ షాక్ ఇచ్చాయి. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,820 కాగా.. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,26,280 వద్ద ఉంది. అలాగే సోమవారం 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.1,13,500 ఉండగా.. నేడు మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,750 వద్ద పలుకుతోంది. నేడు 10 గ్రాముల బంగారం పై రూ.2,460 పెరిగింది. ..
బంగారం ఎందుకు పెరుగుతుంది..
బంగారం ధరలు అస్సలు ఆగడం లేదు.. పండుగ సీజన్, డాలర్ విలువ తగ్గడం, స్టాక్ మార్కెట్లు కుప్పకూలడం వంటి కారణాల వల్ల బంగారం ధరలు మళ్లీ పెరిగిపోతున్నాయి. అయితే డిసెంబర్ నెలలో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది అని నిపుణులు చెబుతున్నారు.
రాష్ట్రంలో బంగారు ధరలు..
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,26,280 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,15,750 వద్ద ఉంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,26,280 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,15,750 వద్ద పలుకుతోంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,26,280 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,15,750 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,26,430 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,15,900 వద్ద ఉంది.
Also Read: దారుణం.. సుపారీ గ్యాంగ్‌తో కన్నకొడుకుని హత్య చేయించిన తల్లి
నేటి సిల్వర్ ధరలు ఇలా..
సిల్వర్ ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ ఆగకుండా పెరిగిపోతుంది. ఎంత తొందరగా ధరలు దిగిపోయాయో అంతే తొందరగా మళ్లీ పెరిగిపోతున్నాయి. సోమవారం కేజీ సిల్వర్ ధర రూ. 1,69,000 కాగా.. నేడు మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ. 1,70,000 వద్ద పలుకుతోంది. నేడు కేజీ సిల్వర్ పై రూ.1,000 పెరిగింది.. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 1,60,000 వద్ద కొనసాగుతోంది.