E-Paper
Advertisement

Jio Payments Bank: జియో పేమెంట్స్ బ్యాంక్ మరో అడుగు.. ఏటీఎం లేకుండా డబ్బులు తీసుకోవచ్చు, అదెలా?

Jio Payments Bank:  జియో పేమెంట్స్ బ్యాంక్ మరో అడుగు.. ఏటీఎం లేకుండా డబ్బులు తీసుకోవచ్చు, అదెలా?
Advertisement

Jio Payments Bank: భారతదేశంలో డిజిటల్ చెల్లింపులను బలోపేతం చేయడానికి వేగంగా అడుగులు వేస్తోంది జియో పేమెంట్స్ బ్యాంక్. తాజాగా దీని ద్వారా వినియోగదారులకు కొత్త సేవను ప్రారంభించింది. ఏటీఎం కార్డులతో ఎలాంటి సంబంధం లేకుండా యూపీఐ ద్వారా నేరుగా డబ్బులు విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. తన బిజినెస్ కరస్పాండెంట్ నెట్‌వర్క్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది.

జియో పేమెంట్స్ బ్యాంక్ మరో అడుగు

Advertisement

జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనుబంధ సంస్థ జియో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ దూసుకుపోతోంది. దేశంలో కీలకమైన కొత్త డిజిటల్ సర్వీసు ప్రారంభించింది. వినియోగదారులు ఏటీఎం కార్డుతో సంబంధం లేకుండా యూపీఐ ద్వారా డబ్బులు విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని తెచ్చింది. తన బిజినెస్ కరస్పాండెంట్ నెట్‌వర్క్ ద్వారా ఈ సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఆ తరహా సేవను వినియోగించుకునేవారు సమీపంలోని జియో బిజినెస్ కరస్పాండెంట్ వద్దకు వెళ్లాలి. వారి వద్ద యూపీఐ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసిన తర్వాత యూపీఐ యాప్ ద్వారా లావాదేవీని ఆమోదించాలి. కస్టమర్లకు కావాల్సిన నగదును కరస్పాండెంట్ అందజేస్తారు. దీనికి ఎలాంటి ఏటీఎం కార్డు అవసరం లేదు.

Advertisement

ఏటీఎం లేకుండా డబ్బులు తీసుకోవచ్చు

ఆ తరహా పద్దతిని గ్రామీణ ప్రాంతాలు, మేజర్ పంచాయితీల్లో కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ఈ సర్వీసు ప్రవేశపెట్టింది ఆ సంస్థ. డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడుతున్నవారు, కార్డు లేకుండా డబ్బులు అందుబాటులోకి తీసుకురావడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ విషయాన్ని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్-జేఎఫ్‌ఎస్‌ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.

దీనివల్ల డిజిటల్ చెల్లింపులు-భౌతిక నగదుకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని ఆ సంస్థ భావిస్తోంది. 2016 నవంబర్‌లో జియో పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా వ్యక్తులు, వ్యాపారాలకు అనుగుణంగా డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తున్న విషయం తెల్సిందే.

ALSO READ: పండుగ వేళ పసిడి ఘాటు.. ఉగాది పచ్చడిలో తీపి కంటే బంగారం ధర చేదే ఎక్కువ!

Related News

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

Big Stories

Advertisement
×