BigTV English

LIC New Plan For Children: ఎల్‌ఐసీ కొత్త ప్లాన్‌.. పిల్లల భవిష్యత్తు విద్యాకు ప్రయోజనాలు

LIC New Plan For Children: ఎల్‌ఐసీ కొత్త ప్లాన్‌.. పిల్లల భవిష్యత్తు విద్యాకు ప్రయోజనాలు

LIC New Plan Benefits to Children: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి) ఇటీవల ‘అమృతబాల్’ అనే సాంప్రదాయిక ఎండోమెంట్ పాలసీని కొత్తగా ప్రారంభించింది. ఇది తమ పిల్లల ఉన్నత విద్య ఖర్చులను దీర్ఘకాలికంగా భద్రపరచాలని కోరుకునే తల్లిదండ్రులకు బాగా ఉపయోగ పడుతుంది. దీనిని ఈ నాన్-లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ పాలసీ ఆర్థిక స్థిరత్వాన్ని అందించడానికి, వారి పిల్లల భవిష్యత్తు విద్యా అవసరాల కోసం ప్రణాళిక వేసే తల్లిదండ్రులకు మద్దతునిచ్చేలా రూపొందించారు.


Read More: పన్నుల సీజన్ వచ్చేసింది.. ఆదాయపు పన్ను, రిటర్న్ మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోండి

అమృత్‌బాల్ 30 రోజుల నుంచి 13 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు వర్తిస్తుంది. మెచ్యూరిటీ వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల వరకు ఉంటుంది. పాలసీ టర్మ్‌లో కార్పస్‌ని సేకరిస్తూ, ప్రతి ఏడది బేసిక్‌ మొత్తం రూ. 80కి మరో రూ. 80 చొప్పున పాలసీ అందనంగా జమ చేస్తుంది. ప్రీమియం చెల్లింపు నిబంధనలు ఐదు నుంచి ఏడు సంవత్సరాల వరకు ఉంటుంది. దీనికి కనీస హామీ మొత్తం రూ. 2 లక్షల నుంచి గరిష్ట ఎంతైన జమ చేసుకోవచ్చు.


అమృత్‌బాల్ ప్లాన్ పాలసీ కాలపరిమితి, మెచ్యూరిటీ ఎంపికలు
పరిమిత ప్రీమియం చెల్లింపు పాలసీల కోసం కనీస పదవీకాలం 10 సంవత్సరాలు ఉండాలి. సింగిల్ ప్రీమియం పాలసీలకు కనిష్ట కాలవ్యవధి ఐదు సంవత్సరాలు ఉండాలి. సింగిల్, పరిమిత ప్రీమియం చెల్లింపు పాలసీల కోసం గరిష్ట పాలసీ వ్యవధి 25 సంవత్సరాలు ఉండాలి. మెచ్యూరిటీ తర్వాత హామీగా జమ చేసిన మొత్తని చెల్లిస్తుంది. పాలసీదారులు 5, 10 లేదా 15 సంవత్సరాలలో వాయిదాల సెటిల్‌మెంట్ల ద్వారా మెచ్యూరిటీ మొత్తాన్ని తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.

Tags

Related News

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Big Stories

×