E-Paper
Advertisement

Ban on cotton candy: పీచు మిఠాయి విక్రయాలపై తమిళనాడులో నిషేధం.. ఎందుకంటే..?

Ban on cotton candy: పీచు మిఠాయి విక్రయాలపై తమిళనాడులో నిషేధం.. ఎందుకంటే..?
Advertisement

Ban on Cotton Candy: పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతోమంది అమితంగా ఇష్టపడే కాటన్‌ క్యాండీ (పీచు మిఠాయి)పై తమిళనాడ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాటి విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్‌ వెల్లడించారు. వీటిల్లో క్యాన్సర్‌ కారక రసాయనాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

పీచు మిఠాయి నాణ్యతను పరీక్షించేందుకు ఇటీవల ఫుడ్‌ సేఫ్టీ విభాగ అధికారులు చెన్నై వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో స్వాధీనం చేసుకున్న నమూనాలను అధ్యయనం చేయగా.. కాటన్‌ క్యాండీల్లో రోడమైన్‌-బి అనే కెమికల్‌ను వారు గుర్తించారు. కృత్రిమ రంగుల కోసం దీన్ని పీచు మిఠాయిల్లో వినియోగించినట్లు ఆయన తెలియజేశారు.

Advertisement

సాధారణంగా పీజు మిఠాయిని ఈ రోడమైన్‌-బిని ‘ఇండస్ట్రియల్‌ డై’గా పిలుస్తారు. అంటే దుస్తుల కలరింగ్‌, పేపర్‌ ప్రింటింగ్‌లో ఎక్కువగా వినియోగిస్తారు. ఫుడ్‌ కలరింగ్‌ కోసం దీన్ని ఉపయోగించే అవకాశం లేదు. దీనివల్ల దీర్ఘకాలంలో సమస్యలు తలెత్తే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. ఇది ఎక్కువ మొత్తంలో మన శరీరంలోకి వెళ్తే.. కిడ్నీ, లివర్‌ పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. అల్సర్‌ వంటి సమస్యలతో పాటు క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

పీజు మిఠాయి తయారీ, విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్‌ హెచ్చరించారు. ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. ఇప్పటికే కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కాటన్‌ క్యాండీపై నిషేధం అమల్లో ఉంది.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×