E-Paper
Advertisement

రాత్రంతా తరుచూ మూత్రవిసర్జన వెళ్తున్నారా? ఇది తీవ్ర ఆరోగ్య సమస్యకు సంకేతం

రాత్రంతా తరుచూ మూత్రవిసర్జన వెళ్తున్నారా? ఇది తీవ్ర ఆరోగ్య సమస్యకు సంకేతం
Advertisement

రాత్రి ఒకటి లేదా రెండు సార్లు మూత్రానికి వెళ్లడం సాధారణమే. అయితే తరచూ నిద్రలో లేచి బాత్రూమ్‌కు వెళ్లాల్సి వస్తే ఆ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. వైద్య పరిభాషలో ఈ సమస్యను ‘నాక్టూరియా’ అని అంటారు. ఈ సమస్య వల్ల రాత్రి సరైన నిద్ర లభించదు. ఈ కారణంగానే రోజువారీ జీవితంపై కూడా ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలంగా ఈ సమస్య ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.

మధుమేహం కారణంగా రాత్రిళ్లు ఎక్కువసార్లు మూత్రవిసర్జన

రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం ఎక్కువ మూత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. మధుమేహం ఉన్నవారిలో దాహం ఎక్కువగా ఉండటం, తరచూ మూత్రానికి వెళ్లడం సాధారణంగా కనిపించే లక్షణాలు. అలసట, చూపు మసకబారడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. ప్రారంభ దశలోనే పరీక్షలు చేయించుకుంటే సమస్యను నియంత్రించడం సులభమవుతుంది.

గుండె సంబంధిత సమస్యలు కూడా కారణం కావచ్చు

Advertisement

గుండె పనితీరు సరిగా లేకపోతే రాత్రి సమయంలో మూత్ర విసర్జన ఎక్కువగా జరగవచ్చు. పగటిపూట శరీరంలో నిల్వ అయిన ద్రవాలు పడుకున్న తర్వాత కిడ్నీల ద్వారా బయటకు వెళ్లడం ప్రారంభమవుతుంది. దీనివల్ల రాత్రిళ్లు తరచూ బాత్రూమ్‌కు వెళ్లాల్సి వస్తుంది. దీంతో పాటు కాళ్లు వాపు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కూడా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

కిడ్నీ వ్యాధి కూడా మూత్ర అలవాట్లను మార్చవచ్చు

కిడ్నీలు శరీరంలోని ద్రవ సమతుల్యతను నియంత్రిస్తాయి. కిడ్నీల పనితీరు దెబ్బతింటే మూత్ర విసర్జనలో మార్పులు కనిపించవచ్చు. కొందరిలో రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లడం ప్రారంభ లక్షణంగా కనిపిస్తుంది. అలసట, వాపు, మూత్ర రంగులో మార్పులు వంటి లక్షణాలు కూడా ఉండవచ్చు. అవసరమైతే వైద్యులు రక్తం, మూత్ర పరీక్షలు సూచిస్తారు.

రాత్రి సమయంలో ఎక్కువ ద్రవాలు తాగడం

Advertisement

నిద్రపోయే ముందు ఎక్కువ నీరు తాగితే మూత్ర ఉత్పత్తి పెరుగుతుంది. టీ, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్‌లో ఉండే కెఫిన్ మూత్రాశయాన్ని ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల రాత్రి సమయంలో ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి రావచ్చు. కాబట్టి సాయంత్రం తర్వాత కెఫిన్ ఉన్న డ్రింక్స్ తగ్గించడం మంచిది.

యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్

యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడు మూత్రాశయం చికాకు చెందుతుంది. తరచూ మూత్రానికి వెళ్లాలనే భావన కలుగుతుంది. మూత్ర విసర్జన సమయంలో మంట, కడుపు దిగువ భాగంలో నొప్పి వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ఇన్‌ఫెక్షన్ మరింత తీవ్రమవుతుంది.

వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి?

రాత్రిళ్లు తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తే వైద్యులను సంప్రదించడం అవసరం. మూత్రంలో రక్తం కనిపించడం, జ్వరం, నొప్పి, శరీరంలో వాపు వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే సమస్యను త్వరగా నియంత్రించవచ్చు.

Also Read: రోజూ తినే ఈ ఫుడ్స్ వల్లే లివర్ డ్యామేజ్.. సమయం ఉండగానే ఫ్యాటీలివర్ ప్రమాదాన్ని గుర్తించండి

ఈ అలవాట్లు సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి

నిద్రకు ముందు ఎక్కువ ద్రవాలు తీసుకోవడం తగ్గించాలి. సాయంత్రం తర్వాత టీ, కాఫీ వంటి కెఫిన్ పానీయాలను తగ్గించాలి. మధుమేహం ఉన్నవారు రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచాలి. సమతుల్య ఆహారం తీసుకోవడం, శారీరక వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలి.

రాత్రిళ్లు తరచూ మూత్రానికి వెళ్లడం సాధారణ సమస్యే. అయితే ఈ సమస్య దీర్ఘకాలం ఉంటే అది మధుమేహం, గుండె లేదా కిడ్నీ సంబంధిత సమస్యలకు సంకేతం కావచ్చు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం ద్వారా సరైన చికిత్స పొందవచ్చు. ఇది మంచి నిద్రతో పాటు మొత్తం ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

Related News

15 నుంచి 18 ఏళ్ల టీనేజ్ పిలల్లను తల్లిదండ్రులు ప్రతిరోజు ఈ 5 ప్రశ్నలు అడగాలి..

సిబిఎస్ఈ సప్లిమెంటరీ పరీక్ష 2026.. మంచి మార్కులు సాధించాలంటే ఈ 7 తప్పులు అసలు చేయకూడదు

లైంగిక నేర బాధితురాలికి అండగా హైకోర్టు న్యాయవాది.. 200కు పైగా వీడియోలు!

బిర్యానీ అసలు ఏ దేశంలో పుట్టింది? భారత్, అఫ్ఘనిస్తాన్ లేదా ఇరాన్.. చరిత్రలో భిన్నాభిప్రాయాలు

శరీరానికి బలం కోసం రోజూ మల్టీవిటమిన్లు తీసుకుంటున్నారా? ఈ సమస్యలు దాని వల్లే

వానాకాలంలో ఇల్లు చెమ్మ వాసన వస్తోందా? నిమిషాల్లో దుర్వాసనకు చెక్

ఆ గుడిలో పులిహోర కాదు.. ప్రసాదంగా బంగారమే ఇస్తారు!

మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారా? ఈ ఫుడ్స్ తింటే సూపర్ ఫాస్ట్ జ్ఞాపకశక్తి

Big Stories

Advertisement
×