E-Paper
Advertisement

హ్యుందాయ్ కొత్త SUV పేరు ఇదే.. త్వరలో మార్కెట్లోకి ఎంట్రీ!

హ్యుందాయ్ కొత్త SUV పేరు ఇదే.. త్వరలో మార్కెట్లోకి ఎంట్రీ!
Advertisement

Hyundai Bayon India Launch: భారత కార్ల మార్కెట్లో హ్యుందాయ్ మరో కొత్త SUVతో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.  భారత్ లోకి త్వరలో ఎంట్రీ ఇవ్వబోతున్న కొత్త SUV పేరును కంపెనీ అధికారికంగా ‘బేయాన్’ (Bayon) అని ప్రకటించింది. ఇప్పటికే ఈ వాహనానికి సంబంధించిన టెస్ట్ మోడళ్లు రోడ్లపై కనిపించడంతో కొత్త SUVపై ఆసక్తి పెరిగింది. ఇప్పుడు పేరు కూడా ఖరారు కావడంతో లాంచ్‌పై అంచనాలు మరింత పెరిగాయి.

వెన్యూ, క్రెటా మధ్యలో స్థానం!

హ్యుందాయ్ ఇండియా SUV లైనప్‌ లో బేయాన్‌కు ప్రత్యేక స్థానం ఉండనుంది. ఇది వెన్యూ, క్రెటా మధ్యలో ఉండే SUVగా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సెగ్మెంట్‌లో ఇప్పటికే మారుతి గ్రాండ్ విటారా, మారుతి విక్టోరిస్, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, కియా సెల్టోస్ లాంటి మోడళ్లు పోటీపడుతున్నాయి. కొత్త మోడల్ ద్వారా హ్యుందాయ్ ఈ విభాగంలో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. మిడ్ సైజ్ SUV సెగ్మెంట్ గత కొన్ని సంవత్సరాల్లో వేగంగా విస్తరించడంతో బేయాన్‌పై కంపెనీ భారీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

పేరును మాత్రమే వెల్లడించిన హ్యుందాయ్!

Advertisement

ప్రస్తుతం హ్యుందాయ్ బేయాన్ పేరు, SUVపై కొన్ని ప్రాథమిక వివరాలను మాత్రమే వెల్లడించింది. ఇంజిన్, గేర్‌బాక్స్, ఫీచర్లు, ధర వంటి పూర్తి వివరాలను మాత్రం కంపెనీ ఇంకా ప్రకటించలేదు. రాబోయే రోజుల్లో ఒక్కొక్కటిగా మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. కొత్త SUVలో ఆధునిక టెక్నాలజీ, ఇంటెలిజెంట్ మొబిలిటీ, భారతీయ కస్టమర్ల అవసరాలకు తగ్గ డిజైన్‌పై దృష్టి పెట్టనున్నట్లు హ్యుందాయ్ చెబుతోంది.

ఇంజిన్ విషయంలోనూ నో క్లారిటీ

బేయాన్ పవర్‌ ట్రెయిన్‌పై హ్యుందాయ్ నుంచి అధికారిక సమాచారం ఇంకా రాలేదు. అయితే ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం ఇందులో నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ ఆప్షన్లు కూడా వచ్చే అవకాశం ఉందని ఆటో రంగంలో చర్చ జరుగుతోంది. అదే సమయంలో భారత మార్కెట్లో CNG కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని CNG వెర్షన్‌ను కూడా తీసుకురావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఇవన్నీ ప్రస్తుతానికి అంచనాలు మాత్రమే. కంపెనీ అధికారికంగా ఎలాంటి పవర్‌ట్రెయిన్ వివరాలను కన్ఫార్మ్ చేయలేదు.

ఇండియా కోసం డిజైన్‌ లో మార్పులు?

Advertisement

గ్లోబల్ మార్కెట్లలో ఇప్పటికే ‘Bayon’ పేరుతో హ్యుందాయ్ ఓ SUVని అమ్ముతోంది. అయితే, భారత మార్కెట్ కోసం రాబోయే మోడల్‌లో డిజైన్, బాడీ స్టైల్ విషయంలో కీలక మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. భారత్‌ లో పరీక్షిస్తున్న మోడళ్లను బట్టి ఇది మరింత బాక్సీ, SUV తరహా డిజైన్‌ ను పొందే అవకాశం ఉందని ఆటో నిపుణులు భావిస్తున్నారు. కొత్త SUVకి సంబంధించిన కొన్ని రెండర్లు కూడా ఇప్పటికే బయటకు వచ్చాయి. అయితే, అవి అధికారిక ఫోటోలు కావు. కాబట్టి ప్రొడక్షన్ మోడల్ ఆవిష్కరణ సమయంలో తుది డిజైన్‌లో మార్పులు కనిపించే అవకాశం ఉంది.

Read Also: మరోసారి పెరిగిన అమేజ్ ధర.. ఆటోమేటిక్ వేరియంట్‌పై భారీ పెంపు!

Tags

Related News

మరోసారి పెరిగిన అమేజ్ ధర.. ఆటోమేటిక్ వేరియంట్‌పై భారీ పెంపు!

స్విఫ్ట్ ధర మళ్లీ పెరిగింది.. ఇప్పుడు రేటు ఎంతంటే?

ఒకటి పెట్రోల్, మరొకటి ఫుల్ ఎలక్ట్రిక్.. హోండా నుంచి 2 కొత్త SUVలు వచ్చేస్తున్నాయి!

బైక్ లవర్స్ కు పండగే.. 3 నెలల్లో ఎంట్రీ ఇవ్వబోతున్న 10 క్రేజీ టూ వీలర్స్ ఇవే!

JSW కాంబ్యాట్ SUV వచ్చేస్తోంది.. టయోటా ఫార్చ్యూనర్‌ కు ఇక చుక్కలేనా?

టాటా పంచ్ ధరల షాక్.. పెట్రోల్, EV మోడళ్లపై ఏకంగా రూ.20 వేల పెంపు!

ఫాస్టాగ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక బ్యాంక్ మారితే కొత్త ట్యాగ్ అవసరం లేదు!

Big Stories

Advertisement
×