BigTV English

Sam Altman: శామ్ ప్రాజెక్టు.. అమెరికా బడ్జెట్ అంత !

Sam Altman: శామ్ ప్రాజెక్టు.. అమెరికా బడ్జెట్ అంత !
Sam Altman Chip Making

Sam Altman Chip Making (india today news):


చిన్నా, చితకా మొత్తం కాదది.. ఏకంగా 7 ట్రిలియన్ డాలర్లు. మన కరెన్సీలో చెప్పాల్సి వస్తే 5.81 లక్షల కోట్లు. అమెరికా ఫెడరల్ బడ్జెట్ కన్నా ఎంతో ఎక్కువ. ఓపెన్ ఏఐ సంస్థ సీఈవో శామ్ ఆల్ట్‌మన్‌కు ఇంత భారీ మొత్తంలో నిధులు అర్జంట్‌గా కావాలి. ఇంతకీ ఎందుకీ నిధుల వేట అనుకుంటున్నారా?

ఇప్పుడు ఓపెన్ ఏఐకి మరింత కంప్యూటింగ్ పవర్ అవసరం. ప్రస్తుతమైతే మైక్రోసాఫ్ట్‌పై ఆధారపడింది. కానీ ఆ సంస్థకు మరిన్ని సిలికాన్ చిప్ ఫ్యాక్టరీలు కావాలి. ఎందుకంటే కృత్రిమ మేధ(ఏఐ) అప్లికేషన్ల ప్రాధాన్యం పెరుగుతున్న క్రమంలో సెమీకండక్టర్ చిప్‌లకు విపరీతమైన కొరత ఏర్పడనుంది. రానున్న 3-5 ఏళ్ల వరకు చిప్‌లకు డిమాండ్ విపరీతంగా ఉంటుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.


కొరత భయంతో చిప్ తయారీ రంగంలోకి ఓపెన్ ఏఐ సంస్థ స్వయంగా కాలు మోపాలనే ఆలోచనకు వచ్చింది. చిప్ తయారీ ప్లాంట్ నెలకొల్పడమంటే మాటలు కాదు. భారీ మొత్తంలో నిధులు కావాలి. శామ్ ఆల్ట్‌మన్‌కే కాదు.. ప్రపంచం మొత్తానికి సిలికాన్ చిప్‌లు అవసరం ఎంతో ఉంది. ఈ డిమాండ్ పెరుగుతూనే ఉంది.

Read More: EPFO Interest Rates: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. పెరగనున్న వడ్డీరేటు

చిప్ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు అమెరికా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది. 52 బిలియన్ డాలర్ల మేర సబ్సిడీలను అందించేందుకు సైతం సిద్ధమైంది. దీనికి సంబంధించిన చిప్ యాక్ట్‌పై అధ్యక్షుడు జో బైడెన్ఇటీవల సంతకం కూడా చేశారు. ఏఐ చిప్‌లకు భవిష్యత్తులో ఎంత డిమాండ్ ఉంటుందో.. చిప్ తయారీ బిజినెస్ ఎంత లాభసాటిగా ఉంటుందో శామ్ ఆల్ట్‌మన్ ఊహించాడు. అందుకు తగ్గట్టుగా భారీ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాడు.

శామ్ ఆల్ట్‌మన్ ప్రాజెక్టు కార్యరూపం దాల్చాలంటే 5-7 ట్రిలియన్ డాలర్లు అవసరం. వేరొకరైతే అంత భారీగా పెట్టుబడులను సేకరించేందుకు వెనుకాడతారు. కానీ శామ్ ఆల్ట్‌మన్ ఏ ప్రాజెక్టు చేపట్టినా ప్రతిష్ఠాత్మకంగా నేతీసుకుంటారు. ఇప్పుడు చేపట్టబోయే సెమీకండక్టర్ తయారీ పరిశ్రమపైనా అంతే సీరియస్‌గా సమాలోచనలు చేస్తున్నారు.

తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ(TSMC) తయారు చేసే చిప్‌లను యాపిల్ లాప్‌టాప్‌లు, ఫోన్లలో వినియోగిస్తున్నారు. ఇక సీపీయూ చిప్‌లను తయారు చేసే రెండు ప్రధాన కంపెనీలు ఏఎండీ, ఇంటెల్.. డిమాండ్తగ్గట్టుగా చిప్‌లను సరఫరా చేయడంలో సతమతమవుతున్నాయి.

చిప్ మార్కెట్‌లో డిమాండ్-సరఫరా మధ్య లోటును భర్తీ చేయాలనేది ఆల్ట్‌మన్ లక్ష్యం. తద్వారా ఓపెన్ ఏఐకి భారీ ఎత్తున లాభాలను ఆర్జించిపెట్టొచ్చు. అందుకే తన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును పట్టాలు ఎక్కించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) అధికారులతో శామ్ ఆల్ట్‌మన్ సంప్రదింపులు జరుపుతున్నారు ఆల్ట్‌మన్. 7 ట్రిలియన్ డాలర్ల సేకరణలో ఆయన ఏ మాత్రం సక్సెస్కాగలుగుతాడో వేచి చూడాల్సిందే. అయినా అది ఎంత భారీ మొత్తమో ఈ కింది అంశాలను మీరో సారి గమనిస్తే అర్థమైపోతుంది.

23.36 ట్రిలియన్ డాలర్లు – అమెరికా జీడీపీ

6.3 ట్రిలియన్ డాలర్లు – 2022లో అమెరికా ఫెడరల్ బడ్జెట్ విలువ

2.31 ట్రిలియన్ డాలర్లు – 2022లో అఫ్ఘనిస్థాన్‌లో యుద్ధం కోసం అమెరికా వెచ్చించిన మొత్తం

4 ట్రిలియన్ డాలర్లు – రెండో ప్రపంచ యుద్ధానికి అమెరికా ఖర్చు చేసిన మొత్తం (ద్రవ్యోల్బణాన్ని కడా పరిగణనలోకి తీసుకుంటే.. )

330 బిలియన్ డాలర్లు – 2030 నాటికి ప్రపంచంలో ఆకలి అన్నదే లేకుండా చేసేందుకు వెచ్చించాల్సిన మొత్తం

964.4 బిలియన్ డాలర్లు – నిరుడు హాలీడే షాపింగ్‌కు ఆవిరైన మొత్తం

4.23ట్రిలియన్ డాలర్లు – జపాన్ జీడీపీ

3.08 ట్రిలియన్ డాలర్లు – మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ

Related News

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Big Stories

×