BigTV English

EPFO Interest Rates Hiked: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. పెరిగిన వడ్డీరేటు..!

EPFO Interest Rates Hiked: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. పెరిగిన వడ్డీరేటు..!
EPFO Hikes Interest Rates

EPFO Hiked Interest Rates on PF:


పీఎఫ్ ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో ఉన్న నిల్వలపై తాజాగా వడ్డీరేట్లను ఖరారు చేసింది. 2023-24 సంవత్సరానికి గానూ.. 8.25 శాతం వడ్డీరేటును నిర్ణయించారు. శనివారం జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(CBT) సమావేశంలో.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఈపీఎఫ్ఓ వర్గాలు వెల్లడించాయి. గడిచిన మూడేళ్లలో పీఎఫ్ పై ప్రకటించిన వడ్డీరేట్లలో ఇదే అత్యధికం.

2022-23 ఆర్థిక సంవత్సరంలో 8.15 శాతం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 8.10 శాతం వడ్డీని చెల్లించారు. గతేడాదికంటే ఈ ఏడాది పీఎఫ్ ఖాతాదారులు 0.10 శాతం ఎక్కువ వడ్డీని పొందనున్నారు. పీఎఫ్ వడ్డీరేటుపై తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని సీబీటీ కేంద్ర ఆర్థిక శాఖకు పంపనుంది. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత వడ్డీరేటును EPFO అధికారికంగా ప్రకటించనుంది. ఆ తర్వాత.. 6 కోట్ల పీఎఫ్ ఖాతాదారుల ఖాతాల్లో వడ్డీలను జమ చేస్తుంది. తాజాగా సీబీటీ చేసిన ఈ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థికశాఖ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.


ఈపీఎఫ్ఓ ట్రస్టీల బోర్డు 235వ సమావేశంలో.. వడ్డీరేట్లను సీబీటీ సమావేశం అజెండాలో చేర్చాలని చర్చించింది. ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లను పరిగణలోకి తీసుకుని ఈపీఎఫ్ఓ పీఎఫ్ పై వడ్డీరేటును కొంతమేర పెంచవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే మాత్రం.. లక్షలాదిమంది ఉపాధి కూలీలు లబ్ధి పొందనున్నారు. ముఖ్యంగా ప్రైవేటు రంగ ఉద్యోగులకు పీఎఫ్ చాలా ముఖ్యం. ఏ కారణం చేత ఉద్యోగం కోల్పోయినా, అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు, పదవీ విరమణ జరిగినపుడు ఉద్యోగులు పీఎఫ్ డబ్బును వాడుకునే అవకాశం ఉంటుంది.

గడిచిన పదేళ్లలో ఈపీఎఫ్ వడ్డీరేట్లు ఇలా ఉన్నాయి

2013-14 ఆర్థిక సంవత్సరంలో 8.75 శాతం, 2014-15 ఆర్థిక సంవత్సరంలో 8.75 శాతం, 2015-16 ఆర్థిక సంవత్సరంలో 8.8 శాతం, 2016-17 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతం, 2017-18 ఆర్థిక సంవత్సరంలో 8.55 శాతం, 2018-19 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతం, 2019-20 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 8.1 శాతం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 8.15 శాతం ఈపీఎఫ్ పై వడ్డీరేట్లు అందించింది. 2013-19 వరకూ ఉన్న వడ్డీరేట్లతో పోలిస్తే.. ప్రస్తుతం ఉన్న వడ్డీరేటు సుమారుగా 45-50 శాతం తక్కువగా ఉంది.

ఆన్‌లైన్‌లో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలా?

PF చందాదారులు తమ PF బ్యాలెన్స్‌ను వివిధ పద్ధతుల ద్వారా చెక్ చేసుకోవచ్చు.

9966044425 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలి.

7738299899కి SMS పంపొచ్చు.

EPFO ఆన్‌లైన్ పోర్టల్‌ని ఉపయోగించడం.

UMANG మొబైల్ అప్లికేషన్‌ని ఉపయోగించడం ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.

UAN నంబర్‌తో PF బ్యాలెన్స్‌ని ఎలా చెక్ చేసుకోవాలి

UAN నంబర్‌తో PF బ్యాలెన్స్‌ని తనిఖీ చేయడానికి, మీరు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అందించిన సభ్యుల పాస్‌బుక్ సౌకర్యాన్ని ఉపయోగించవచ్చు. యునిఫైడ్ మెంబర్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న తర్వాత, మీ పాస్‌బుక్ బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి 6 గంటల తర్వాత ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది.

EPFO పోర్టల్‌లో PF బ్యాలెన్స్‌ని ఎలా తనిఖీ చేయాలి

ముందుగా మీరు EPFO ​​పోర్టల్‌ని సందర్శించి, “Our Services” ట్యాబ్ క్రింద “For Employees” ఆప్షన్ పై క్లిక్ చేయాలి

ఆపై హోమ్ పేజీలో, “Services” విభాగంలో “Member Passbook” పై క్లిక్ చేయండి.

దీని తర్వాత.. మీరు మీ యాక్టివేట్ చేయబడిన UAN నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.

సంబంధిత “Member ID”ని ఎంచుకుని, “View Passbook [Old:Full]”పై క్లిక్ చేయండి.

మీ PF వివరాలు స్క్రీన్‌పై ప్రదర్శించబడతాయి.

రికార్డును నిలుపుకోవడానికి, పాస్‌బుక్‌ను ప్రింట్ చేయడానికి “Download Passbook” ఎంపికను ఉపయోగించండి.

Related News

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Big Stories

×