BigTV English

Paytm Payments Bank: మనీలాండరింగ్ నిబంధనల ఉల్లంఘన.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు రూ. 5.49 కోట్ల జరిమానా..

Paytm Payments Bank: మనీలాండరింగ్ నిబంధనల ఉల్లంఘన.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు రూ. 5.49 కోట్ల జరిమానా..

Paytm Payments BankPaytm Payments Bank: ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్-ఇండియా (FIU-IND) మనీలాండరింగ్ నిరోధక నిబంధనలను ఉల్లంఘించినందుకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై రూ. 5.49 కోట్ల జరిమానా విధించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.


ఆన్ లైన్ గ్యాంబ్లింగ్, ఇతర చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు నిర్వహించే కొన్ని సంస్థలు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ ద్వారా నగదు లావాదేవీలు చేసినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థల నివేదికను ఇచ్చాయి. దీంతో FIU-IND పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై సమీక్ష నిర్వహించింది.

ఈ చట్టవిరుద్ధ కార్యకలాపాల నుంచి వచ్చిన డబ్బు, అంటే నేరాల ద్వారా వచ్చే డబ్బును ఈ సంస్థలు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌తో నిర్వహిస్తున్న బ్యాంక్ ఖాతాల ద్వారా మళ్లించాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.


Read More: ఆర్బీఐ డెడ్‌లైన్‌, డీలింగ్స్‌కి నో చెప్పిన పేటీఎం

ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్-ఇండియా (FIU-IND) Paytm పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌పై రూ. 5.49 కోట్ల పెనాల్టీని విధించిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద తమ బాధ్యతల ఉల్లంఘనలకు సంబంధించి FIU-IND ఈ నిర్ణయం తీసుకుంది.

మార్చి 1న పెనాల్టీ విధిస్తూ FIU-IND ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా ఆర్బీఐ కొత్త లావాదేవీలను జరపకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌‌పై నిషేదం విధించిన సంగతి తెలిసిందే. ముందుగా ఈ నిషేదాన్ని ఫిబ్రవరి 29 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపింది. తాజాగా ఆ నిషేదాన్ని మార్చి 15 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేసింది.

Related News

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Big Stories

×