BigTV English

RBI deadline: ఆర్బీఐ డెడ్‌లైన్‌, డీలింగ్స్‌కి నో చెప్పిన పేటీఎం

RBI deadline: ఆర్బీఐ డెడ్‌లైన్‌, డీలింగ్స్‌కి నో చెప్పిన పేటీఎం


రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పేటీఎంకి కొన్ని ఆంక్షలను విధించింది. ఈ ఆంక్షలకు చివరి ఘడియలు సమీపిస్తున్న వేళ ప్రముఖ ఆన్‌లైన్‌ పేమెంట్ కంపెనీ పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌తో అంతర్గతంగా కుదుర్చుకున్న ఒప్పందాలను అన్నింటిని క్యాన్సిల్‌ చేసుకునేందుకు ఓ నిర్ణయం తీసుకుంటున్నట్లు శుక్రవారం తమ నిర్ణయాన్ని తెలిపింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యక్రమాలన్ని మార్చి 15 లోపు ముగించాలన్న ఆర్బీఐ డెడ్‌లైన్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేటీఎం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ వెల్లడించింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) భారతదేశపు కేంద్ర బ్యాంకు. ఈ బ్యాంకును 1935 ఏప్రిల్ 1న భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934 ప్రకారం స్థాపించారు. స్థాపించబడినప్పటి నుంచి దీని ప్రధాన స్థావరం కోల్‌కతలో ఉండేది. తర్వాత ముంబాయి నగరానికి మార్చబడింది. ప్రారంభంలో ఇది ప్రైవేటు అజమాయిషిలో ఉండేది. అనంతరం 1949లో జాతీయం చేయబడిన తర్వాత భారత ప్రభుత్వం అధీనంలోకి వచ్చింది. రిజర్వ్ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 22 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ పేటీఎం పేమెంట్స్ మాతృసంస్థకి కొన్ని కండీషన్స్‌ పెట్టడంతో తమతో కుదుర్చుకున్న ఒప్పందాలన్నింటికి నో చెప్పినట్లు తెలుస్తోంది. దీని కారణంగా మార్చి లోపే తన డెసీషన్‌ని తెలపాలని అనడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


Read More: ఎమర్జెన్సీ ఆర్థిక అవసరాలకు ఎఫ్‌డీ లోన్..!

ఇక పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలను విధించిన కారణంగా పేటీఎం సంస్థ సైతం ఒక్కసారిగా ఇబ్బందుల్లో పడిన విషయం మనందరికి తెలిసిందే కదా. పేటీఎం పర్యవేక్షణ లోపాలు, నిబంధనల అతిక్రమణ తదితర కారణాలతో.. పేటీఎం పేమెంట్ బ్యాంకు కార్యకలాపాలు శాశ్వతంగా ముగించేయాలని ఆర్బీఐ పేమెంట్ మాతృ సంస్థ అయినటువంటి వన్‌97 కమ్యూనికేషన్‌ని ఆదేశించింది. ఇందుకు సంబంధించి తొలుత ఫిబ్రవరి 29ని డెడ్‌లైన్‌గా విధించగా.. ఆ తరువాత ఆ తరువాత కస్టమర్ల సౌకర్యార్థం తుది తేదీని మార్చి 15 వరకూ ఆర్‌బీఐ పొడిగించింది.

ఈ సంక్షోభం నేపథ్యంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చైర్మన్ విజయ్‌ శేఖర్ శర్మ తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో సంస్థ బోర్డును పునర్‌వ్యవస్థీకరించారు. బోర్డు డైరెక్టర్లుగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ శ్రీనివాసన్ శ్రీధర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవేంద్రనాథ్ సారంగి, బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ కుమార్ గార్గ్, మాజీ ఐఏఎస్ అధికారి రజనీ శేఖ్రీ సిబల్ నియమితులయ్యారు. ఇక పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో విజయ్‌శేఖర్ శర్మకు 51 శాతం వాటా ఉండగగా, మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌కు 41 శాతం వాటా ఉంది. అందుకే వీరిని నియమించినట్లు తెలుస్తోంది. తాజాగా పేటీఎం సంచలన నిర్ణయం తీసుకొని ఈ డీల్‌ నుంచి తప్పుకోవడంపై పలువురు వ్యాపారవేత్తలు మల్లగుల్లాలు పడుతున్నారు.

Tags

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×