E-Paper
Advertisement

LIC GDP: మరో ఘనత సాధించిన LIC.. పాకిస్థాన్, నేపాల్, శ్రీలంక జీడీపీని కలిపినా ఎల్ఐసీతో సరిపోలడంలే..!

LIC GDP: మరో ఘనత సాధించిన LIC.. పాకిస్థాన్, నేపాల్, శ్రీలంక జీడీపీని కలిపినా ఎల్ఐసీతో సరిపోలడంలే..!
Advertisement

LIC Assets is More than Pakistan, Sri Lanka and Nepal GDP: భారతదేశంలోని పురాతన మరియు అతిపెద్ద బీమా కంపెనీ అయిన లైఫ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) మరో పెద్ద విజయాన్ని సాధించింది. ఏఎంయూ నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులు పాకిస్థాన్ జీడీపీ కంటే రెట్టింపు అయ్యాయి. భారత్ తో సమానంగా ఉండాలని ఆకాంక్షించిన పాకిస్థాన్.. భారత కంపెనీ కంటే వెనుకబడిపోయింది. గతంలో టాటా కూడా పాకిస్థాన్ ను ఓడించింది. టాటా మొత్తం వాల్యుయేషన్ పాకిస్థాన్ జీడీపీని మించిపోయింది. అంతేకాదు.. నేపాల్, శ్రీలంక, పాకిస్థాన్ జీడీపీలు కలిపినా ఎల్ఐసీ కంటే తక్కువగా ఉంది.

పాకిస్థాన్ ఆర్థిక స్థితి భారత్ లోని ఏ ప్రభుత్వ కంపెనీతోనూ పోటీపడేంతగా లేదు. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ చాలా అప్పులో ఉంది. కారణమేమంటే.. ఒక భారతీయ కంపెనీ పాకిస్థాన్ జీడీపీ కంటే రెట్టింపు పరిణామంలో ఉంది. భారతదేశపు అతిపెద్ద బీమా కంపెనీ ఎల్ఐసీ వద్ద పాకిస్థాన్ జీడీపీ కంటే రెండు రెట్లు డబ్బు ఉంది. పాకిస్థాన్ జీడీపీ 338 బిలియన్ డాలర్లు.

Advertisement

ఎల్ఐసీ ఏయూఎం పెరుగుతోంది..

మార్చి చివరి నాటికి ఎల్ఐసీ ఏయూఎం రూ. 50 లక్షల కోట్లు దాటింది. మార్చి చివరి నాటికి ఎల్ఐసీ ఏయూఎం సంవత్సరానికి 16.48 శాతం పెరిగి రూ. 51,21,887 కోట్లకు అంటే $616 బిలియన్లకు చేరింది. కాగా, గత ఆర్థిక సంవత్సరం అంటే 2023లో ఇది రూ. 43,97,205 కోట్లు. మరోవైపు ఐఎంఎఫ్ ప్రకారం.. పాకిస్థాన్ జీడీపీ $338.24 బిలియన్లు మాత్రమే.

Advertisement

Also Read: టయోటా లాండ్ క్రూయిజర్ కొత్త ఎడిషన్ లాంచ్.. ఆకట్టుకుంటున్న డిజైన్!

మూడు దేశాల జీడీపీ కలిపినా..

పాకిస్థాన్ మాత్రమే కాకుండా శ్రీలంక, నేపాల్ జీడీపీని కలిపినా కూడా ఎల్ఐసీ ఇప్పటికీ వాటిని మించిపోయింది. పాకిస్థాన్ జీడీపీ 338.24 బిలియన్ డాలర్లు. శ్రీలంక జీడీపీ 74.85 బిలియన్ డాలర్లు. నేపాల్ జీడీపీ 44.18 బిలియన్ డాలర్లు మాత్రమే. ఈ మూడింటిని కలిపినా ఎల్ఐసీతో పోటీ పడడం కష్టం. ఈ మూడింటిది కలిపితే 457.27 బిలియన్ డాలర్లు. ఇది ఎల్ఐసీ యొక్క ఏయూఎం $616 బిలియన్ డాలర్ల కంటే తక్కువ.

కాగా, ఎల్ఐసీ తన వ్యాపారాన్ని నిరంతరం విస్తరిస్తోంది. ఆరోగ్య బీమా రంగంలో ఈ మొత్తాన్ని నిన్ననే కంపెనీ ప్రకటించింది. ఎల్ఐసీ ఇప్పుడు ఆరోగ్యబీమా రంగంలోకి ప్రవేశించబోతుంది. ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించడంతో ఎల్ఐసీ భారీగా షేర్లు పెరిగాయి.

Tags

Related News

స్టాక్‌మార్కెట్‌లో బ్లాక్ మండే.. కొంప ముంచిన ఆ రంగాల షేర్లు, 4 లక్షల కోట్ల సంపద ఆవిరి

భారీ ఖర్చు చేశాక పెళ్లి వాయిదా లేదా రద్దు అయిందా.. ఆర్థిక భద్రత కోసం ఇన్సూరెన్స్ ఉందిగా

ఆస్తులు బోలెడున్నా చేతిలో నగదు ఉండదు.. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక కష్టాలను నివారించడానికి ఇలా చేయండి

పెళ్లిలో లభించిన బహుమతులుపై ట్యాక్స్ కట్టాలా? ఆదాయపు పన్ను నిబంధనలు ఇవే..

ఎన్ని ఈఎంఐలు చెల్లించకపోతే ఇల్లు సీజ్ చేస్తారు? బ్యాంకు రూల్స్ ఏం చెబుతున్నాయ్!

అమ్మమ్మ వంటతో అద్భుతం.. రూ.5 లక్షలతో మెుదలై రూ.కోట్లల్లో వ్యాపారం.. ఈ సిస్టర్స్ అదరగొట్టేశారు!

అవినీతి ఆరోపణలపై ఉద్యోగి తొలగింపు.. పెన్షన్ కోసం 37 ఏళ్ల పోరాటం.. మరణం తరువాత న్యాయం

జీతం చేతికి రాగానే ఖర్చయిపోతోందా? ఈ 9 చిన్న మార్పులతో.. భారీగా డబ్బులు ఆదా!

Big Stories

Advertisement
×