PM Kisan 24th Installment: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 24వ విడత నిధుల విడుదలకు అంతా రెడీ. ఈ నెల 30న ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిధులను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 9.34 కోట్ల రైతు కుటుంబాల ఖాతాల్లో డబ్బులు జమకానున్నాయి.
దేశ వ్యాప్తంగా రైతులకు అండగా నిలిచేందుకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ తీసుకొచ్చింది మోదీ సర్కార్. ఈ పథకంలో భాగంగా అక్టోబర్ 30న అంటే శుక్రవారం మరో విడత నిధులు విడుదల అవుతున్నాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.అర్హులైన ప్రతి రైతు ఖాతాలో రూ.2,000 జమ కానున్నాయి.
గుజరాత్‌లోని బనస్కంతా జిల్లా భిల్ది పట్టణంలో పీఎం కిసాన్ ఉత్సవ్ దివస్ కార్యక్రమానికి ప్రధాని హాజరవుతున్నారు. ఈ సందర్భంగా నిధులను విడుదల చేయనున్నారు. పీఎం కిసాన్ పథకంలో భాగంగా అర్హులైన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.6 వేలు ఆర్థిక సహాయం ఇవ్వనుంది కేంద్రం. నిధుల మొత్తాన్ని ఒకేసారి కాకుండా మూడు విడతలుగా అన్నదాతల బ్యాంకు అకౌంట్లలో వేయనున్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్- DBT పద్దతిలో నిధులు జమకానున్నాయి.
పీఎం కిసాన్ పథకం ప్రారంభమైన నుంచి ఇప్పటి వరకు 23వ విడత వరకు దాదాపు రూ.4.47 లక్షల కోట్లకు నిధులు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వ్యవసాయానికి పెట్టుబడి, విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు అవసరాలకు కొంత ఆర్థిక సాయం అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. కేంద్రం ఇస్తున్న నిధుల సాయం పొందాలంటే రైతులు కొన్ని నిబంధనలను పాటించాలి. ఈ పథకం కింద నమోదు చేసుకున్న అన్నదాతలు తమ అర్హతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి.
ఈ పథకం కింద నమోదు చేసుకున్న అన్నదాతలు తమ అర్హతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి. లబ్ధిదారులకు e-KYC తప్పని సరిగా పూర్తి చేయకుంటే నిధులు రావు. ఆధార్ సీడింగ్ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయని అన్నదాతలు ఒకసారి చెక్ చేసుకోవాలి. పిఎం-కిసాన్ పోర్టల్ ద్వారా రైతులు ఆధార్ ఓటీపీని ఉపయోగించి ఈ-కేవైసీని పూర్తి చేసుకోవచ్చు. పిఎం-కిసాన్ మొబైల్ యాప్ తో ఫేస్ గుర్తింపు ద్వారా సదుపాయాన్ని పొందవచ్చు. చివరగా కామన్ సర్వీస్ సెంటర్-సిఎస్‌సిని సందర్శించి వివరాలు పూర్తి చేసుకోవచ్చు.