E-Paper
Advertisement

నువ్వు స్లాగ‌ర్ కాదు, రియ‌ల్ హీరో…అభిషేక్ శ‌ర్మ‌కు పాక్ బౌల‌ర్ క్ష‌మాప‌ణ‌లు

నువ్వు స్లాగ‌ర్ కాదు, రియ‌ల్ హీరో…అభిషేక్ శ‌ర్మ‌కు పాక్ బౌల‌ర్ క్ష‌మాప‌ణ‌లు
Advertisement

Mohammad Amir On Abhishek Sharma: టీమిండియా టి20 డేంజర్ ఆటగాడు అభిషేక్ శర్మపై ( Abhishek Sharma) పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ అమీర్ (Mohammad Amir ) మరో కీలక వ్యాఖ్యలు చేశాడు. గతంలో అభిషేక్ శర్మను అవమానించేలా మాట్లాడిన మహమ్మద్ అమీర్… ఇప్పుడు క్షమాపణలు చెప్పాడు. అతడు కళ్ళు మూసుకుని కాదు.. ప్రత్యర్థి బౌలర్ల గుండెలు అదిరేలా సిక్సర్లు కొడుతున్నాడని మెచ్చుకున్నాడు. న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగిన మూడవ టి20 సందర్భంగా అభిషేక్ శర్మ 35 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు.

ఈ ఇన్నింగ్స్ పై మహమ్మద్ అమీర్ స్పందిస్తూ… అభిషేక్ శర్మ (Abhishek Sharma Slogger) స్లాగర్ కాదని.. రియల్ హీరో అంటూ వ్యాఖ్యానించాడు. గతంలో స్లాగర్ అంటూ చేసిన కామెంట్లకు క్షమాపణలు చెప్పాడు. ఇకపై అభిషేక్ శర్మ జోలికి తాను రానని స్పష్టం చేశాడు. టీమిండియాలో అభిషేక్ శర్మ ఉండడం వల్ల అదృష్టం అంటూ వ్యాఖ్యానించాడు. భార‌త్ పిచ్ ల‌పైనే కాకుండా న్యూజిలాండ్ గ‌డ్డ‌పై ఇర‌గ‌దీయ‌డంతో అభిషేక్ శ‌ర్మ శ‌క్తి, సామ‌ర్థ్యాలు బ‌య‌ట‌ప‌డ్డాయ్నాడు. దీంతో అభిషేక్ శర్మ పై మహమ్మద్ అమీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

అభిషేక్ శర్మ వర్సెస్ మహమ్మద్ అమీర్ వివాదం ఏంటి?

Advertisement

టీమిండియా టి20 శర్మ పై గతంలో మహమ్మద్ అమీర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మ పెద్ద స్లాగరని… కళ్ళు మూసుకుని బ్యాటింగ్ చేస్తాడని మండిపడ్డాడు. భారత గడ్డపై సింహంలా గాండ్రిస్తాడని.. విదేశీ పిచ్చలపై తేలిపోతాడు అంటూ పరువు తీశాడు. అయితే న్యూజిలాండ్ పై తాజాగా సెంచరీ చేసిన నేపథ్యంలో మహమ్మద్ అమీర్ మాట మార్చాడు. అభిషేక్ శర్మకు క్షమాపణలు చెబుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్లాగర్ అన్నందుకు తప్పైందని పేర్కొన్నాడు.

Faf du Plessis talks about Suryakumar Yadav catch of David Miller in T20 World Cup final: టీమిండియా ఛీటింగ్ చేసే గెలిచింది…సూర్య‌కుమార్ క్యాచ్ పై డుప్లెసిస్ సంచ‌ల‌నం!

Advertisement

అప్పుడప్పుడు తాను పరిధులు దాటానని… అభిషేక్ శర్మ ( Abhishek Sharma) విషయంలో కూడా అలాగే జరిగిందని గుర్తు చేశాడు. అభిషేక్ శర్మను తక్కువగా అంచనా వేసి టెక్నిక్ లేదని పరువు తీశానని.. ఇందులో 100% తనది తప్పంటూ వ్యాఖ్యానించాడు. అందుకే తప్పు తెలుసుకుని ఇప్పుడు క్షమాపణలు చెబుతున్నట్టు మహమ్మద్ అమీర్ స్పష్టం చేశాడు. ఇక నుంచి తన మాటల ను అదుపులో పెట్టుకుంటానని వెల్లడించాడు. ఇష్టం వచ్చినట్లుగా తాను మాట్లాడాలని.. ప్రతి ఒక్కరికి గౌరవం ఇస్తానని స్పష్టం చేశాడు. క‌ళ్లు మూసుకుని కాదు, గుండెలు అదిరిపోయేలా సిక్సులు కొడుతున్న అభిషేక్ శ‌ర్మ ఇక‌పై త‌న ఫేవరేట్ క్రికెట‌ర్ అన్నాడు. ఈ క్రమంలో మహమ్మద్ అమీర్ ( MD AMIR) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Tilak Varma and Nitish Kumar Reddy Telugu conversation: తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, షాకింగ్ వీడియో వైర‌ల్

Related News

టెస్ట్ క్రికెట్ కు బుమ్రా ప‌నికిరాడు..గాయాలే అత‌డి కొంప‌ముంచుతున్నాయ్!

అభిషేక్, తిల‌క్ డేంజ‌ర‌స్ బ్యాట‌ర్లు..వాళ్లే లేక‌పోతే, టీమిండియా చిత్తుగా ఓడిపోతుంది

2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

శుభమాన్ గిల్ త‌ల‌కు ఏమైంది? ఆ ఎల‌క్ట్రిక్ డివైజ్ ఎందుకు పెట్టుకున్నాడు

బంతులు వేస్తే, బ్యాట‌ర్ల ముక్కు, ద‌వ‌డ‌ల‌ నుంచి ర‌క్తం రావాలి…షోయ‌బ్ అక్తర్ సంచ‌ల‌నం !

కాళ్లు మొక్కినా ఆ జ‌ట్టులోకి వెళ్ల‌ను…హార్ధిక్ పాండ్యా సంచ‌ల‌నం !

పాకిస్తాన్ తిక్క కుదిర్చిన ఇంగ్లాండ్..ఐపీఎల్ ఆడేందుకు జై కొట్టిన ప్లేయ‌ర్లు

Big Stories

Advertisement
×