E-Paper
Advertisement

2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు
Advertisement

Harbhajan Singh On 2003 World Cup:  2003 వరల్డ్ కప్ ఫైన‌ల్ సందర్భంగా టీమిండియా ఓటమికి గల కారణాలను మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ బహిర్గతం చేశారు. ఫైనల్స్ సందర్భంగా ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ ను త్వరగా ఔట్ చేసి ఉంటే టీమిండియా కచ్చితంగా ఛాంపియన్ అయ్యేది అంటూ వ్యాఖ్యానించారు. కానీ తనకు సరైన సమయంలో సౌరవ్ గంగూలీ బౌలింగ్ ఇవ్వలేదని హర్భజన్ సింగ్ ఆరోపించారు. రికీ పాంటింగ్ బ్యాటింగ్ చేసిన సందర్భంగా తనకు బౌలింగ్ ఇచ్చి ఉంటే…అత‌డిని క్లీన్ బౌల్డ్ చేసి టీమిండియాను గెలిపించే వాడినంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. సరిగ్గా తనను వినియోగించుకోకపోవడంతో టీమిండియా ఫైనల్స్ లో ఓడిపోయిందన్నారు. దీనంతటికీ దాదానే కారణం అంటూ పరోక్షంగా విమర్శలు చేశారు. ఈ క్రమంలో దాదా కెప్టెన్సీ పై హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

2003 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో టీమిండియా అలాగే ఆస్ట్రేలియా రెండు జట్లు ఫైనల్స్ కు దూసుకువెళ్లాయి. జోహన్నెస్ బర్గ్ వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా 125 పరుగుల తేడాతో టీమిడియాపై ఆస్ట్రేలియా విజయం సాధించి వరల్డ్ కప్ గెలుచుకుంది. ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు ఎవరు సరిగ్గా రాణించలేదు. హర్భజన్ సింగ్ ఒక్కడే 2 వికెట్లు పడగొట్టాడు. అయినప్పటికీ ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించి విజయం సాధించింది. అయితే దీనిపై తాజాగా హ‌ర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2003 ఫైనల్స్ సందర్భంగా రికీ పాంటింగ్ బ్యాటింగ్ కు వచ్చినప్పుడు తనకు బౌలింగ్ ఇవ్వమని దాదాపు చాలా సార్లు కోరినట్టు హర్భజన్ గుర్తు చేశాడు. కానీ దాదా మాత్రం ప‌ట్టించుకోలేద‌న్నాడు.

Advertisement

Faf du Plessis talks about Suryakumar Yadav catch of David Miller in T20 World Cup final: టీమిండియా ఛీటింగ్ చేసే గెలిచింది…సూర్య‌కుమార్ క్యాచ్ పై డుప్లెసిస్ సంచ‌ల‌నం!

రికీ పాంటింగ్ క్రీజులోకి రాగానే తనకు బౌలింగ్ ఇవ్వాలని సౌర‌వ్ గంగూలీని అడిగానని…అప్పటికే రెండు వికెట్లు పడగొట్టిలోకి వచ్చినట్టు హ‌ర్భజన్ సింగ్ గుర్తు చేశారు. దీనిపై చాలా సార్లు బతిలాడిన కూడా దాదా పట్టించుకోలేదని తెలిపారు. తనకు కాకుండా ఇతరులకు బౌలింగ్ ఇచ్చి, మ్యాచ్ చెడగొట్టాడని ఆగ్రహించారు. తనకే బౌలింగ్ ఇచ్చి ఉంటే రికీ పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసే వాడినని పేర్కొన్నారు.

Advertisement

గంగూలీ ప్లాన్ మొత్తం పాడు చేయడంతో రికీ పాంటింగ్ 140 పరుగులు సాధించాడని వివరించారు. దీంతో మ్యాచ్ మొత్తం పోయిందని ఎమోషనల్ అయ్యారు. కాగా ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి రెండు వికెట్ల నష్టానికి 359 పరుగులు సాధించింది. గిల్ క్రిస్ట్ 57 పరుగులు చేయగా హెడెన్ 37 పరుగులతో రాణించాడు. రికీ పాంటింగ్ 140 పరుగులు చేయగా మార్టిన్ 88 పరుగులతో రెచ్చిపోయాడు. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో టీమిండియా… 234 పరుగులకు కుప్పకూలింది. దీంతో 125 పరుగుల తేడాతో ఓడిపోయి వరల్డ్ కప్ పోగొట్టుకుంది భారత్.

Tilak Varma and Nitish Kumar Reddy Telugu conversation: తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, షాకింగ్ వీడియో వైర‌ల్

Related News

అభిషేక్, తిల‌క్ డేంజ‌ర‌స్ బ్యాట‌ర్లు..వాళ్లే లేక‌పోతే, టీమిండియా చిత్తుగా ఓడిపోతుంది

శుభమాన్ గిల్ త‌ల‌కు ఏమైంది? ఆ ఎల‌క్ట్రిక్ డివైజ్ ఎందుకు పెట్టుకున్నాడు

బంతులు వేస్తే, బ్యాట‌ర్ల ముక్కు, ద‌వ‌డ‌ల‌ నుంచి ర‌క్తం రావాలి…షోయ‌బ్ అక్తర్ సంచ‌ల‌నం !

కాళ్లు మొక్కినా ఆ జ‌ట్టులోకి వెళ్ల‌ను…హార్ధిక్ పాండ్యా సంచ‌ల‌నం !

పాకిస్తాన్ తిక్క కుదిర్చిన ఇంగ్లాండ్..ఐపీఎల్ ఆడేందుకు జై కొట్టిన ప్లేయ‌ర్లు

తెరపైకి శాండ్ పేపర్ వివాదం..బౌండరీ లైన్ దగ్గర నాథన్ లైయన్ ఆడుకున్న ఫ్యాన్స్

సంజీవ్ గోయెంకాకు బుర్రే లేదు..కెప్టెన్సీ పీకేసి ధోనిని అవమానించాడు!

Big Stories

Advertisement
×