Mumbai: దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో అక్టోబర్ 28 ఓ కీలక ఘట్టం. జియో ప్లాట్‌ఫామ్స్ కంపెనీ స్టాక్ మార్కెట్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. 21 శాతానికి పైగానే ప్రీమియంతో రూ. 1358 వద్ద లిస్టయ్యింది. ఆ కంపెనీ షేర్లు దక్కించుకున్న ఇన్వెస్టర్లకు ఊహించని విధంగా లిస్టింగ్ గెయిన్స్ అందించింది. గతంలో భారీగా లిస్టయిన కంపెనీలు షేర్లు పతనం అవుతూ వచ్చాయి. జియోకు అన్నీ కూలించడంతో పెట్టుబడుదారులు ఫుల్ ఎంజాయ్‌లో ఉన్నారు. బుధవారం మార్కెట్ భారీగా పతనమైనా జియో లిస్టింగ్‌తో మార్కెట్ గాడిలో పడింది.
ముంబైలో జియో ప్లాట్‌ఫామ్స్ స్టాక్ మార్కెట్‌లో ఐపీఓ లిస్టింగ్ నేపథ్యంలో అంబానీ కుటుంబం ఓ కార్యక్రమం నిర్వహించింది. వేదికపై కొడుకు అనంత్ ప్రసంగిస్తున్న వేళ ఆయన తండ్రి, రిలయన్స్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఆనందం రెట్టింపు అయ్యింది. రిలయన్స్ జియో మేనేజింగ్ డైరెక్టర్, జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాశ్ అంబానీ మాట్లాడుతున్న సమయంలో ముకేశ్ అంబానీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
కాస్త ఎమోషనల్ అయి కంటతడి పెట్టారు. జియో ప్రయాణం, ప్రస్థానం, లిస్టింగ్, ముకేశ్ అంబానీ పాత్ర గురించి మాట్లాడారు. అంబానీ చాలాసేపు కంట నీరు ఆపుకోలేకపోయారు. జియో ప్రస్థానం, తాత ధీరూభాయ్ అంబానీ ఆశయాలు గుర్తు చేసుకుంటూ మాట్లాడిన సమయంలో ముకేష్ కళ్ల వెంట నీరు తిరిగాయి. వాటికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జియో తమకు ఒక వ్యాపారం కాదన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ డిజిటల్‌గా అనుసంధానించే పూజ లాంటిదని చెప్పుకొచ్చారు. స్టాక్ ఎక్స్చేంజీలో మోగే గంట తనకు ఆలయ గంటలా అనిపిస్తుందని మనసులోని మాట బయటపెట్టారు.
దీని తర్వాత జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్లలోకి ఎంట్రీ ఇచ్చింది. జియో కంపెనీ షేర్లు 21.36 శాతం ప్రీమియంతో మార్కెట్లో లిస్టయ్యాయి. షేరు ఇష్యూ ధర రూ.1,119 ఉండగా, బీఎస్‌ఈ-ఎన్‌ఎస్‌ఈలో రూ.1358 వద్ద నమోదు అయ్యింది. ఆ తర్వాత ట్రేడింగ్ లావాదేవీలు మొదలయ్యాయి. ఒక్కో షేరుపై రూ.239 మేరా పెట్టుబడుదారులకు దక్కింది. లిస్టింగ్ కార్యక్రమానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఫ్యామిలీతో హాజరయ్యారు. జియో ప్లాట్‌ఫామ్స్ ఎండీ ఆకాశ్, ఈశా అంబానీ కలిసి గంట మోగించడంతో లిస్టింగ్ మొదలైంది.
ALSO READ: ఫ్లాట్ ఇవ్వడంలో ఆలస్యం.. బిల్డర్‌కు వినియోగదారుల కమిషన్ బిగ్ షాక్.. రూ.87 లక్షల ఫైన్!
తాజాగా లిస్టింగ్‌తో జియో మార్కెట్ విలువ సుమారు రూ.12.50 లక్షల కోట్లు చేరింది. దేశంలో అత్యధిక మార్కెట్ విలువ కలిగిన సెకండ్ సంస్థగా నిలిచింది. రూ.16.24 లక్షల కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, సెకండ్ ప్లేస్ జియోదే. జియో లిస్టింగ్ ద్వారా సుమారు 27 కోట్ల షేర్ల జారీ అయ్యాయి. రూ.30,213 కోట్ల సమీకరణతో పబ్లిక్ ఇష్యూకు వచ్చింది జియో. కంపెనీ ఆఫర్ చేసిన షేర్లకు 22.19 రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయి. 1.39 కోట్లకు పైగా దరఖాస్తులు రాగా ఇష్యూ ధరను రూ.1,065-రూ.1119గా నిర్ణయించింది.
Speech by Shri Anant Ambani, Director, Jio Platforms, at the listing ceremony of JPL IPO pic.twitter.com/KiShhOhJnV
— Reliance Industries Limited (@RIL_Updates) October 28, 2026