Instant vs storage geyser: చలికాలం ప్రారంభమైందంటే చాలు, వేడి వేడి నీళ్లతో స్నానం చేయడం మన లైఫ్ స్టైల్‌లో భాగమైపోతుంది. ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లేవారికి, కాలేజీ విద్యార్థులకు వేడి నీరు క్షణాల్లో.. అందుబాటులో ఉండటం చాలా అవసరం. అందుకే గీజర్ కొనడం ప్రతి ఒక్కరి ఇళ్లలోనూ కామన్ అయిపోయింది. అయితే.. మార్కెట్లోకి వెళ్లగానే మన ముందుండే పెద్ద ప్రశ్న..’ఇన్‌స్టంట్ గీజరా లేక స్టోరేజ్ గీజరా?’ అనేదే. ఈ రెండింటిలో ఏది మీ అవసరాలకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం.
ఇన్‌స్టంట్ గీజర్లు పేరుకు తగ్గట్టుగానే నీటిని క్షణాల్లో వేడి చేస్తాయి. వీటిలో.. పెద్దగా వాటర్ ట్యాంక్ ఉండదు. మనం ఆన్ చేయగానే..లోపల ఉండే కాయిల్స్ నీటిని క్షణాల వ్యవధిలో వేడి చేసి బయటికి పంపిస్తాయి. సాధారణంగా ఇవి 1 లీటర్ నుంచి 3 లీటర్ల సైజులో లభిస్తాయి.చిన్న కుటుంబాలకు లేదా ఒంటరిగా ఉండేవారికి ఇవి పర్ఫెక్ట్. చిన్న బాత్‌రూమ్‌లు ఉన్నవారికి, సింగిల్ యూజర్స్‌కి, లేదా వంటగదిలో గిన్నెలు శుభ్రం చేయడానికి వేడి నీరు అవసరమయ్యే వారికి ఇది అద్భుతమైన ఛాయిస్.
స్టోరేజ్ గీజర్లలో నీటిని నిల్వ చేయడానికి ఒక పెద్ద ట్యాంక్ ఉంటుంది. ఇది ముందుగానే.. నీటిని వేడి చేసి ట్యాంక్‌లో స్టోర్ చేసుకుంటుంది. ట్యాంక్‌లో.. ఉండే ప్రత్యేక ఇన్సులేషన్ వల్ల నీరు చాలా సేపు వేడిగా ఉంటుంది. ఇవి 6 లీటర్ల నుంచి 25 లీటర్లు లేదా అంతకంటే.. ఎక్కువ సామర్థ్యంలో లభిస్తాయి. నలుగురు ఐదుగురు సభ్యులున్న ఫ్యామిలీకి ఇది బెస్ట్ ఆప్షన్. బాత్‌టబ్ వాడేవారు, ముగ్గురు అంతకంటే.. ఎక్కువ సభ్యులున్న ఫ్యామిలీలు, ఒకే సారి ఎక్కువ మంది వేడి నీటిని ఉపయోగించే ఇళ్లకి ఇది సరిగ్గా సరి పోతుంది.
చాలా మందికి ఉండే సందేహం కరెంట్ బిల్లు గురించే. ఇన్‌స్టంట్ గీజర్లు సాధారణంగా 3000 వాట్స్ పవర్ ఉపయోగిస్తాయి. అయితే.. ఇవి కేవలం నీరు వాడుతున్న క్షణాల వరకే ఆన్ లో ఉంటాయి కాబట్టి తక్కువ టైం రన్ అవుతాయి.మరో వైపు స్టోరేజ్ గీజర్లు 2000 వాట్స్ వాడినప్పటికీ.. నీటిని వేడి చేసి ఆ ఉష్ణోగ్రతను కాపాడుకోవడానికి ఆటోమే టిక్‌గా అప్పుడప్పుడు ఆన్ అవుతుంటాయి. మీరు గీజర్‌ను.. ఎక్కువ గంటలు ఆన్ చేసి ఉంచితే.. స్టోరేజ్ గీజర్ ద్వారా కరెంట్ బిల్లు కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అయితే మోడ్రన్ 5-స్టార్ రేటింగ్ గీజర్ల వల్ల కరెంట్ ఆదా చేసుకోవడం ఇప్పుడు చాలా ఈజీ అయింది.
Also Read: గేమ్స్,ఫోటో యాప్స్ మీ లొకేషన్ ట్రాక్ చేస్తున్నాయా? ఇలా వెంటనే ఆపేయండి!
ధరల విషయానికి వస్తే.. ఇన్‌స్టంట్ గీజర్లు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. ఇవి రూ 3,000 నుంచి రూ.6,000 లోపే లభిస్తాయి. స్థలం కూడా చాలా తక్కువ ఆక్రమిస్తాయి. అలాగే స్టోరేజ్ గీజర్లు వాటి సైజ్, కెపాసిటీని బట్టి రూ. 6,000 నుంచి రూ. 15,000 లేదా అంతకంటే ఎక్కువే ఉంటాయి. వీటిలో ..ఉండే ఇన్నర్ ట్యాంక్ క్వాలిటీ (గ్లాస్-లైన్డ్ లేదా కాపర్ ట్యాంక్) బట్టి ఇవి చాలా సంవత్సరాల పాటు పాడవకుండా ఉంటాయి.
మీ ఇల్లు చిన్నదైపోయి, తక్కువ నీరు అవసరమైతే..తక్కువ బడ్జెట్‌లో పని అయిపోవాలంటే ఇన్‌స్టంట్ గీజర్ బెస్ట్ ఛాయిస్. ఒకవేళ మీది పెద్ద కుటుంబం అయి, షవర్ ఉపయోగించే వారు, ఒకేసారి ఇంట్లో అందరూ వేడి నీరు వాడాలన్నా కచ్చితంగా స్టోరేజ్ గీజరే బెస్ట్. మీ అవసరాలు, మీ బాత్‌రూమ్ స్పేస్‌ని బట్టి సరైన గీజర్‌ను ఎంచుకుని ఈ చలి కాలంలో హాయిగా వేడి నీటి స్నానం ఎంజాయ్ చేయండి!