E-Paper
Advertisement

ఫ్లాట్ ఇవ్వడంలో ఆలస్యం.. బిల్డర్‌కు వినియోగదారుల కమిషన్ బిగ్ షాక్.. రూ.87 లక్షల ఫైన్!

ఫ్లాట్ ఇవ్వడంలో ఆలస్యం.. బిల్డర్‌కు వినియోగదారుల కమిషన్ బిగ్ షాక్.. రూ.87 లక్షల ఫైన్!
Advertisement

Flat Possession Delay: నిర్ణిత గడువు లోగా ఫ్లాట్ ను స్వాధీనం చేయకపోవడం ముమ్మాటికి బిల్డర్ తప్పేనని జిల్లా వినియోగదారుల కమిషన్ స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం చెప్పిన సమయానికి ఫ్లాట్ ఇవ్వనప్పుడు కొనుగోలుదారుడు నిరవధికంగా వేచి చూడాలని ఆశించలేమని పేర్కొంది. ముంబైలోని ములుండ్‌కు చెందిన తపన్ విసారియా దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కమిషన్.. పనువెల్‌లోని ‘సౌండ్ డిలైట్’ ప్రాజెక్ట్ డెవలపర్, దాని భాగస్వాములు కలిసి బాధితుడికి రూ. 86.37 లక్షలు (వడ్డీతో కలిపి) చెల్లించాలని ఆదేశించింది.

అసలేంటీ వివాదం?

రాయగఢ్ జిల్లా పనువెల్ తాలూకాలోని ఆష్టే గ్రామంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో బాధితుడు తపన్ విసారియా ఫ్లాట్ ను బుక్ చేసుకున్నాడు. 876 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన సదరు ఫ్లాట్‌ను రూ. 50.52 లక్షలకు కొనుగోలు చేసేలా డీల్ కుదుర్చుకున్నారు. దీనికి సంబంధించి 2015 ఆగస్టు 7న సేల్ అగ్రిమెంట్ చేసుకుని రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేశారు. 2016 డిసెంబర్ 31 నాటికి ఫ్లాట్ ఇస్తామని డెవలపర్ అగ్రిమెంట్‌లో హామీ ఇచ్చారు. దీంతో బాధితుడు ఫ్లాట్ కోసం రూ. 45.45 లక్షలు చెల్లించడమే కాకుండా.. వ్యాట్, జీఎస్టీ, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద ఇతర ఖర్చులు సైతం చేశారు. కానీ బిల్డర్ చెప్పిన సమయానికి ఫ్లాట్ ఇవ్వకపోగా, గడువు పొడిగిస్తూ వచ్చారు.

తీవ్రంగా తప్పుబట్టిన కమిషన్

Advertisement

ఈ క్రమంలోనే మహారాష్ట్ర రెరా (MahaRERA) వెబ్‌సైట్‌లో ఈ ప్రాజెక్ట్ గడువును 2026 సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు ప్రకటించడతో బాధితుడు వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించారు. ఫ్లాట్ కొనుగోలు సమయంలో చెప్పిన వాటర్‌ఫాల్, క్లబ్‌హౌస్, రూఫ్‌టాప్ షామియానా, ఆంఫిథియేటర్ వంటి సౌకర్యాలు కూడా కల్పించలేదని ఫిర్యాదులో స్పష్టం చేశారు. అయితే బాధితుడు అందించిన బ్యాంక్ స్టేట్‌మెంట్లు, డిమాండ్ లెటర్లు, ఈమెయిల్ ఆధారాలను పరిశీలించిన కమిషన్.. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది. నోటీసులు పంపినప్పటికీ బిల్డర్ కంపెనీ, దాని భాగస్వాములు కమిషన్ ముందు హాజరు కాకపోవడంతో 2024 ఏప్రిల్ 16న ఈ కేసును ‘ఏకపక్ష విచారణ’ (Ex-parte) గా స్వీకరించింది. సమయానికి ఇల్లు ఇవ్వకపోవడానికి డెవలపర్ ఎలాంటి సరైన కారణాన్ని చూపించలేదని ఇది స్పష్టంగా సేవల్లో లోపమేనని తీర్పునిచ్చింది.

Also Read: వీఐ యూజర్లకు ఊహించని షాక్.. 84 రోజుల ప్లాన్ ధర పెంపు.. కొత్త ధర, బెనిఫిట్స్ ఇవే!

బాధితుడికి న్యాయం చేస్తూ తీర్పు

Advertisement

బాధితుడికి న్యాయం చేస్తూ వినియోగదారుల కమిషన్ కీలక ఆదేశాలను జారీ చేసింది. కొనుగోలుదారుడు చెల్లించిన రూ. 45 లక్షల మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఫ్లాట్ ఇస్తామని చెప్పిన 2016 డిసెంబర్ 31 నుండి డబ్బులు తిరిగి చెల్లించే వరకు సంవత్సరానికి 9 శాతం వడ్డీని కలిపి ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. అంటే దాదాపు రూ. 86.37 లక్షలు బాధితులకు సదరు బిల్డర్ కంపెనీ ఇవ్వనుంది. అంతేకాకుండా కేసు నమోదు చేసినందుకు, పడిన మానసిక వేదనకు గాను అదనంగా రూ. 75,000 చెల్లించాలని ఆదేశించింది. అయితే ఫ్లాట్ కోసం బ్యాంక్ నుంచి తీసుకున్న వడ్డీ (రూ. 5.23 లక్షలు)ని సైతం ఇప్పించాలని బాధితుడు కోరగా.. ఈ అభ్యర్థనను కమిషన్ తిరస్కరించింది. కొనుగోలుదారుడు నిధుల కోసం రుణం తీసుకుని వడ్డీ చెల్లించినంత మాత్రాన ఆ వడ్డీ మొత్తాన్ని బిల్డర్ నుంచే వసూలు చేయాలని డిమాండ్ చేయలేరని కమిషన్ తన తీర్పులో పేర్కొంది.

Also Read:  మొబైల్ యూజర్లకు బిగ్ అలర్ట్.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్.. ఇది మీ మంచికే బాస్!

Tags

Related News

జియో లిస్టింగ్ అదుర్స్.. అనంత్ స్పీచ్ తో రిలయన్స్ అధినేత ముకేష్ కంటతడి

ఆఫీస్, షాపు లేకుండానే ఇతర రాష్ట్రాల్లో వ్యాపారం చేసుకోవచ్చు.. ఈ GST నిబంధన గురించి తెలుసా?

పాలు, పండ్లు, కూరగాయలు ఏదైనా 5 స్టార్ హోటల్స్‌కు నేరుగా విక్రయించండి.. రైతులకు మంచి అవకాశం

హోమ్ లోన్ టెన్యూర్ ఎంత ఉండాలి? తక్కువ ఈఎంఐ బెటరా? త్వరగా తీర్చేయడం మంచిదా?

దీపావళి వేళ గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఆభరణాలు కొనకుండానే.. పసిడిపై లాభాలు పొందే 5 మార్గాలు!

ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్.. దీపావళి కానుకగా కార్లు అందజేత.. ఈ కంపెనీకి హాట్సాఫ్ చెప్పాల్సిందే!

బంగారంలో అసలు పసుపు రంగే ఉండదా? మరి ఈ దగదగ మెరుపు వెనుక రహస్యం ఏంటి?

Big Stories

Advertisement
×