BSNL Recharge Plans: బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ క్రమంలోనే తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కోరుకునే వారి కోసం రూ. 1,499, రూ. 1,999 ధరల్లో రెండు ప్రీపెయిడ్ ప్లాన్లు తీసుకొచ్చింది. ఈ రెండు ప్లాన్ల వ్యాలిడిటీ దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ ధర, బెనిఫిట్స్ పరంగా ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు ప్లాన్ల వివరాలు, రెండింటిలో దేనివల్ల యూజర్లకు ఎక్కువ లాభం అన్నది చూద్దాం.
బీఎస్ఎన్ఎల్ ఈ రూ. 1,999 ప్లాన్ 330 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వారికి అపరిమిత ఫ్రీ కాల్స్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు లభించనున్నాయి. అలాగే ప్రతీ రోజూ 1.5GB హైస్పీడ్ డేటాతో పాటు మొత్తం వ్యాలిడిటీ కాలానికి అదనంగా మరొక 10GB డేటా అందనుంది. రోజువారీ డేటా లిమిట్ పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 40 Kbps కి తగ్గుతుందని బీఎస్ఎన్ఎల్ వర్గాలు తెలిపాయి. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా రోజుకు సగటున రూ. 6.05 యూజర్ కు ఖర్చు కానుంది.
ఈ ప్లాన్ ను 300 రోజుల వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తోంది. ఇందులో కూడా అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు యూజర్లకు లభించనున్నాయి. అయితే ఈ ప్లాన్‌లో మొత్తం వ్యాలిడిటీ కాలానికిగాను ఒకేసారి (Lump-sum) 32GB డేటా మాత్రమే ఇవ్వనున్నారు. ఈ 32GB డేటాను వినియోగదారుడు తన అవసరాన్ని బట్టి ఒక్క రోజులో లేదా 300 రోజుల్లో ఎప్పుడైనా వాడుకోవచ్చు. డేటా పరిమితి ముగిసిన తర్వాత స్పీడ్ 40 Kbps కి తగ్గనుంది. ఈ ప్లాన్ పై రోజుకు రూ. 4.99 గా ఖర్చుకానుంది.
Also Read: రూ. 15,000 లోపే బెస్ట్ మినీ ఫ్రిజ్‌లు.. హాస్టలర్స్, బ్యాచిలర్స్కి సూపర్ ఛాయిస్!
రోజువారీ ఖర్చు పరంగా చూస్తే రూ. 1,499 ప్లాన్ చౌకైనది. డేటా వినియోగం చాలా తక్కువగా ఉండి కేవలం కాల్స్, సిమ్ యాక్టివ్ కోసం మాత్రమే రీఛార్జ్ సరిపోతుందని భావిస్తే.. ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్. అలా కాకుండా రోజూ డేటాతో అవసరం ఉందని భావిస్తే రోజుకు 1.5GB డేటాను అందించే రూ. 1,999 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు.
Also Read: చెవులకు క్లిప్‌లా ఫిట్ చేసుకోవచ్చు.. 32 గంటల బ్యాటరీతో రెడ్మీ కొత్త ఇయర్‌బడ్స్ లాంచ్!