BigTV English

Train Ticket Booking: దీపావళికి ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా? ట్రైన్ టికెట్లు సింపుల్ గా ఇలా బుక్ చేసుకోండి!

Train Ticket Booking: దీపావళికి ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా? ట్రైన్ టికెట్లు సింపుల్ గా ఇలా బుక్ చేసుకోండి!

Train Ticket Booking Tips: భారతీయులు ఘనంగా నిర్వహించుకునే పండుగలలో దీపావళి ఒకటి. ఉత్తరం, దక్షిణం అనే తేడా లేకుండా అన్ని రాష్ట్రాలో దీపాల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులంతా ఒక్క చోట చేరి సంతోషంగా గడుపుతారు. ఆయా ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకునే వాళ్లు తమ సొంతూళ్లకు వెళ్తారు. ముఖ్యంగా నార్త్ ప్రజలు ఎక్కువగా రైలు ద్వారా తమ రాష్ట్రాలకు వెళ్లేందుకు మొగ్గుచూపుతారు. అయితే, పండుగల వేళ టికెట్ల బుకింగ్ అనేది అంత ఈజీ కాదు. కొంత మంది చాలా రోజుల ముందే టికెట్లు బుక్ చేసుకుంటారు. కానీ, కొంత మందికి ఉద్యోగం, చదువుల కారణంగా టికెట్ల బుకింగ్ ఆలస్యం అవుతుంది. ఆ తర్వాత తత్కాల్ లో టికెట్లు బుక్ చేసుకోవాలనుకున్నా సాధ్యం కాదు. ముఖ్యంగా యూపీ, బీహార లాంటి రద్దీగా ఉండే రూట్లలో టికెట్లు దొరకడం చాలా కష్టం. అలాంటి పరిస్థితులతో కొన్ని సింపుల్ టిప్స్ పాటించడం వల్ల కన్ఫర్మ్ అయిన టికెట్లను పొందే అవకాశం ఉంటుంది. ఎలాగో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


IRCTC యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

పండుగలకు సొంతూరికి వెళ్లాలి అనుకునే వాళ్లు ముందుగానే IRCTC యాప్‌ని డౌన్‌ లోడ్ చేసుకోవాలి. కొద్ది రోజుల ముందే లాగిన్ కావాలి. ప్రయాణించాల్సిన రూట్ తో పాటు రైళ్ల నంబర్లు సహా పూర్తి సమాచారాన్ని ముందుగానే సేవ్ చేసి పెట్టుకోవాలి. అత్యవసర సమయంలో మళ్లీ పూర్తి సమాచారాన్ని ఫిల్ చేయాల్సిన అవసరం ఉండదు. తిరిగి సమాచారాన్ని వెతకాల్సిన పని ఉండదు. టికెట్ బుకింగ్ ప్రక్రియ ఫాస్ట్ గా అయిపోతుంది.


మాస్టర్ జాబితాను రూపొందించండి

రైలు ప్రయాణానికి సంబంధించి ఎవరెవరు వెళ్తారో.. ముందుగానే నిర్ణయించుకోండి. మీ కుటుంబం లేదంటే ఫ్రెండ్స్ తో ప్రయాణించే ముందు మాస్టర్ లిస్టును రెడీ చేసుకోండి. అందులో జర్నీ చేయాలి అనుకునే వారందరి పేర్లు, బెర్తులు, ఆర్డర్ చేసే ఫుడ్ వివరాల లిస్టును ప్రిపేర్ చేసుకోవాలి. IRCTCలో మై ప్రొఫైల్ విభాగంలోకి వెళ్లి మీ మాస్టర్ లిస్టును ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా మాస్టర్ లిస్టును ముందుగానే రెడీ చేసుకోవడం వల్ల టికెట్ల బుకింగ్ సమయంలో టైమ్ చాలా సేవ్ అవుతుంది. మళ్లీ మళ్లీ మీరు మీ డీటైల్స్ ను ఫిల్ చేయాల్సిన అవసరం ఉండదు.

ఇ-వాలెట్ ఉపయోగించండి

ట్రైన్ టికెట్లు బుక్ చేసేటప్పుడు వీలైనంత వరకు UPI వాలెట్ లేదంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ను ఉపయోగించండి. UPI వాలెట్ తో డబ్బులు చెల్లించడం చాలా ఈజీగా ఉంటుంది. తక్కువ సమయం తీసుకుంటుంది. టికెట్ బుకింగ్ ప్రక్రియ ఈజీగా అయిపోతుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ వల్ల లాగిన్, పాస్ వర్డ్, ఓటీపీ ఎంటర్ చేయడం కారణంగా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. వీలుంటే IRCTC  ఇ-వాలెట్‌లో బ్యాలెన్స్ ఉంచుకోవచ్చు. IRCTC బ్యాలెన్స్ తో టికెట్ బుక్ చేసుకోవడం వల్ల మరింత ఈజీగా టికెట్లు బుక్ అయ్యే అవకాశం ఉంటుంది.

Read Also:టిక్కెట్ లేని రైలు ప్రయాణం.. ఫైన్ కడితే బెర్త్ దొరుకుతుందా? జైలు శిక్ష ఎప్పుడు విధిస్తారంటే?

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×