E-Paper
Advertisement

RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. లోన్లు తీసుకునేవారికి తీపి కబురు, కొత్త మార్గదర్శకాలు జారీ!

RBI:  ఆర్బీఐ కీలక నిర్ణయం.. లోన్లు తీసుకునేవారికి తీపి కబురు, కొత్త మార్గదర్శకాలు జారీ!
Advertisement

RBI:  అవసరాల నిమిత్తం బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నవారి సంఖ్య ప్రతీ ఏటా పెరుగుతోంది. అందులో రకరకాల లోన్లు ఉన్నాయి. వాటిలో పర్సనల్, వాహనాలు, హోమ్ లోన్లు వంటివి ఉన్నాయి. వీటికి సంబంధించి ప్రతీ నెలా వాయిదాలు పద్దతిలో చెల్లిస్తుంటారు సామాన్యులు. అయితే కొన్నిసార్లు ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. ఆ క్రమంలో లోన్ తిరిగి చెల్లించలేని పరిస్థితి సామాన్యుడికి ఎదురవుతోంది.

ఆర్బీఐ కీలక నిర్ణయం.. కొత్త మార్గదర్శకాలు జారీ!

Advertisement

ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇబ్బంది పడుతున్న రుణ గ్రహీతలకు అండగా నిలిచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ఆర్‌బీఐ. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండ చరియలు వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు సంబంధిత రుణగ్రహీతలకు ఉపశమనం అందించాలని బ్యాంకులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో డిజాస్టర్ రిలీఫ్ చర్యలను పక్కాగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

కొత్త నిబంధనల వల్ల రుణాలు తీసుకున్నవారికి నాలుగు రకాలుగా ప్రయోజనాలు కలుగనుంది. మొదటిది.. వైపరీత్యాల వల్ల ఆదాయం కోల్పోయిన తరుణంలో పాత రుణాల చెల్లింపు గడువు పెంచుకోవచ్చు. లేకుంటే ఈఎంఐలను రీషెడ్యూల్ చేయవచ్చు. దీనివల్ల తక్షణం డబ్బు కట్టకపోయినా డిఫాల్టర్‌గా ముద్ర పడకుండా ఉండవచ్చు.

Advertisement

లోన్లు తీసుకునేవారికి తీపి కబురు

ఇక రెండో విషయానికి వద్దాం. మొరటోరియం సౌకర్యం అనేది మరొకటి ఉంది. రుణ గ్రహీణ పరిస్థితులు చక్కబడే వరకు కొన్నినెలల పాటు అసలు, వడ్డీ చెల్లింపులపై విరామం పొందే వెసులుబాటు ఉంది. ఆ సమయంలో ఈఎంఐలు కట్టాల్సిన పని లేదు. ఆ తర్వాత మాత్రం చెల్లించాల్సి ఉంటుంది.

ఇక మూడో పాయింట్ విషయానికి వద్దాం. అదనపు రుణాల మంజూరు విషయం. ఉన్న అప్పులతో సంబంధం లేకుండా వ్యాపారాన్ని మళ్లీ ప్రారంభించడానికి తక్షణమే ఫ్రెష్ లోన్స్ అదనపు క్రెడిట్ సదుపాయాలు బ్యాంకులు కల్పించాలి. విపత్తు సమయాల్లో ఇచ్చే సహాయక రుణాలపై తక్కువ వడ్డీని వసూలు చేసేలా ప్రోత్సహిస్తోంది ఆర్‌బీఐ. బ్యాంకులు నిబంధనలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది.

ALSO READ: కిరాక్ పెరిగిన పసిడి ధరలు.. రేటు చూస్తే గుండె జారినట్టే!

ప్రతి జిల్లాలో ఒక లీడ్ బ్యాంక్ మేనేజర్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలి. విపత్తు సమయంలో బాధిత వినియోగదారులు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని రుణ సడలింపుల గురించి మాట్లాడాలి. నష్టం జరిగిన మూడు నుంచి 6 నెలల లోపు క్లెయిమ్‌ల ప్రక్రియను పూర్తి చేయాలని బ్యాంకులను అందులో ప్రస్తావించింది.

Related News

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

Big Stories

Advertisement
×