Today Gold Rate: బంగారం ధరలు రెండు రోజులు తగ్గినట్టే తగ్గి మళ్లీ భారీగా పెరిగిపోతున్నాయి. ఆదివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,480 కాగా.. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,16,400 వద్ద పలుకుతోంది. అలాగే ఆదివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,05,850 ఉండగా.. సోమవారం రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,06,700 వద్ద ఉంది. అంటే ఒక్కరోజుకు రూ. 920 పెరిగిందని చెప్పవచ్చు.
పరుగులు పెడుతున్న బంగారం ధరలు..
గత వారం బంగారం ధరలు తగ్గడంతో పసిడి ప్రియులు చాలా సంతోషించారు. కానీ ఆ ఆనందం మున్నాళ్ల ముచ్చటే అన్నట్లుగా అయిపోయింది. తగ్గింది అని అనుకునేలోపే మళ్లీ పెరిగిపోయింది. దీంతో పాపం పసిడి ప్రియులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బంగారం ధరలు ఒక్కరోజూ తగ్గితే వారం రోజులు పెరుగుతూ పోతుంది. పసిడి ప్రియులకు బంగారంపై ఆశ చచ్చిపోకుండా మధ్యలో ఒక్కసారిగా తగ్గుతుంది. మళ్లీ ఏదావిధిగా పెరిగిపోతుంది. దీంతో బంగారం కొనాలని అనుకునేవారు బంగారం కొనాలా..? వద్దా..? ముందు ముందు తగ్గుతదా? లేదా ఇంకా పెరుగుతదా? అనే ఆలోచనలో ఉన్నారు.
బంగారం పెరుగుటకు అసలు కారణం..
అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అంతేకాకుండా బంగారం పెట్టుబడిగా పెట్టడం వల్ల పెట్టుబడిదారుల డిమాండ పెరిగి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య సుంకాల యుద్ధాలు బంగారం ధరలను పతనం చేస్తన్నాయి.
రాష్ట్రంలో బంగారు ధరలు..
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,16,400 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,06,700 వద్ద ఉంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,16,400 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,06,700 వద్ద కొనసాగుతుంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,16,400 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,06,700 వద్ద పలుకుతుంది.
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,16,550 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,06,850 వద్ద ఉంది.
Also Read: కడపలో గ్రూపు రాజకీయాలు.. ఈ వ్యవహారం వెనుక ఉన్నదెవరు?
నేటి సిల్వర్ ధరలు ఇలా..
బంగారం ధరల బాటలోనే సిల్వర్ కూడా నడుస్తోంది. వాటికి ఏమాత్రం తగ్గకుండా సమానంగా సిల్వర్ ధరలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. శనివారం కేజీ సిల్వర్ ధర రూ. 1,59,000 కాగా సోమవారం కేజీ సిల్వర్ ధర రూ.1,60,000 వద్ద కొనసాగుతుంది. అంటే ఒక్కరోజే సిల్వర్ ధరలు కేజీపై రూ. 1,000 పెరిగింది. అలాగే కలకత్తా, ముంబై, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధరలు రూ. 1,50,000 వద్ద కొనసాగుతోంది.