Aishwarya Rajesh:ప్రతి ఒక్క నటీనటులకు ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది. ఫలానా పాత్రలో నటించాలనే కోరికను అప్పుడప్పుడు వ్యక్తపరుస్తూ ఉంటారు. అయితే దర్శకులు వారి మొరను ఆలకించి అవకాశాలు కల్పించడం అనేది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక నటి మొరను డైరెక్టర్ ఆలకించారేమో అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా బాలయ్య మూవీలో ఆమె అనుకున్న క్రేజీ రోల్ లభించింది అంటూ వస్తున్న వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది ..ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం దర్శకుడికి ఆమె కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే అనే కామెంట్లు కూడా వినిపిస్తూ ఉండడం గమనాభం. మరి ఆమె ఎవరు ? ఆమె కోరుకున్న పాత్ర ఏంటి? ఏ సినిమాలో.. ఎలాంటి పాత్రలో అవకాశం లభించింది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
ఆమె ఎవరో కాదు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ మొదలుపెట్టిన ఐశ్వర్య రాజేష్. కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో నటిగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది .ఆ తర్వాత టక్ జగదీష్, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి ఎన్నో చిత్రాలు చేసింది. కానీ తెలుగులో ఈమెకు సరైన సక్సెస్ లభించలేదు. కానీ వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది ఐశ్వర్య రాజేష్. ఈ సినిమా చేసిన ఏడాది తర్వాత మళ్లీ ఇప్పుడు తిరువీర్ తో కలిసి ఓ సుకుమారి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె చేసిన కామెంట్లు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ..” ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి లైఫ్ టైం తక్కువ అని నాతో చాలామంది చెప్పారు. ఆ భయంతోనే ఏకంగా 36 చిత్రాలు చేసేసాను. అయితే నాకు నచ్చిన పాత్ర మాత్రం ఇప్పటివరకు లభించలేదు. నాకు రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి లాంటి విలన్ పాత్ర పోషించడం చాలా ఇష్టం. అలాంటి పాత్ర కావాలి” అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది.
also read:నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!
అయితే ఆమె అలా తన అభిప్రాయాన్ని చెప్పిందో లేదో అప్పుడే ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మేరకు తాజాగా వినిపిస్తున్న న్యూస్ ప్రకారం.. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఎన్బికె 111 అనే టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మరో చిత్రాన్ని చేయనున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్టు ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో మోస్ట్ టాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రలో నటించిన ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా హీరోయిన్ గా కాకుండా పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి.. ప్రేక్షకులను మెప్పించిన ఐశ్వర్య రాజేష్..
ఇప్పుడు బాలయ్య సినిమా కోసం ఏకంగా విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే బాలకృష్ణ లాంటి మాస్ హీరో చిత్రంలో ఐశ్వర్య రాజేష్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తే అది ఈమె కెరియర్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. ఇకపోతే ఇప్పటివరకు రమ్యకృష్ణ, వరలక్ష్మి శరత్ కుమార్, శ్రియా రెడ్డి లాంటి తారలు తెరపై ప్రతినాయికగా సత్తా చాటుతుంటే.. ఈ జాబితాలోకి ఐశ్వర్య రాజేష్ చేరుతుందో లేదో చూడాలి.