Big Stories

Suzuki V-Strom 800DE: మార్కెట్‌లోకి మరో కాస్ట్‌లీ బైక్.. ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే?

 Suzuki V-Strom 800DE
Suzuki V-Strom 800DE

Suzuki V-Strom 800DE: భారత మార్కెట్‌లో రకరకాల బైక్‌లు దర్శనమిస్తున్నాయి. కొత్త కొత్త అప్డేట్లతో.. రకరకాల వేరియంట్లలో అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి. లుక్, డిజైన్ పరంగానే కాకుండా ఫీచర్ల పరంగా కూడా వాహన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇప్పటికే ఎన్నో రకాల మోడళ్లకు సంబంధించిన బైక్‌లు మార్కెట్‌లో దర్శనమిచ్చాయి.

- Advertisement -

తాజాగా మరొక కాస్ట్‌లీ బైక్ భారత మార్కెట్‌లో విడుదలై ఆకట్టుకుంటోంది. అయితే మరి ఈ బైక్‌కి సంబంధించిన ఫీచర్లు, ధర వివరాలు తెలుసుకుందాం.. సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా భారతదేశంలో తన మిడిల్ వెయిట్ అడ్వెంచర్ బైక్ ‘సుజుకి V-Strom 800DE’ని ఈ రోజు విడుదల కానుంది.

- Advertisement -

ఈ సుజుకి బైక్‌ను తొలిసారిగా భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2024లో ప్రదర్శించారు. ఈ బైక్ అమ్మకం అంతర్జాతీయ స్థాయిలో ప్రారంభమైంది. ఇది సుజుకి V-Strom 650 XT స్థానంలో భారతదేశంలో ప్రారంభించబడుతోంది. దీని అమ్మకాలు కొన్ని సంవత్సరాల క్రితం మాత్రమే ప్రారంభమయ్యాయి.

Also Read: స్మార్ట్ ఫోన్ కన్నా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లు..!

ఫీచర్లు:

సుజుకి V-Strom 800DEలో నేక్డ్ బైక్‌లా స్టీల్ ఫ్రేమ్‌ను అందించారు. దీనికి 20 లీటర్ల ఇంధన ట్యాంక్ అందించబడింది. దీని బరువు దాదాపు 230 కిలోలు, ఎత్తు దాదాపు 155 మిమీ ఉంటుంది. ఇది 776 cc 270-క్రాంక్ సమాంతర-ట్విన్ ఇంజిన్‌ను కలిగి ఉంది. అలాగే 8,500 rpm వద్ద 83bhp, 6,800 rpm వద్ద 78 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

అలాగే, ముందు వైపున 6 స్పీడ్ గేర్ బాక్స్‌ అందించారు. అంతేకాకుండా ఈ బైక్‌కి అద్భుతమైన బ్రేకింగ్ సిస్టమ్‌ను అందించారు. ముందువైపు 310 mm డిస్క్, వెనుక 260 mm డిస్క్‌తో అందించబడింది. వీటితోపాటు నాలుగు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. డైరెక్షన్ క్విక్‌షిఫ్టర్, మూడు ట్రాక్షన్ కంట్రోల్ సెట్టింగ్‌లు వంటి అనేక ఎలక్ట్రిక్ స్టాండర్డ్ ఫీచర్లు కూడా ఇందులో అందించారు.

అలాగే ఈజీ స్టార్ట్ సిస్టమ్ కూడా ఈ బైక్‌లో ఉంది. ఇది ఒక్కసారి మాత్రమే స్టార్ట్ బటన్‌ను ప్రెస్ చేయడం ద్వారా బైక్‌ను స్టార్ట్ చేస్తుంది. దీనితో పాటు ఇంటెలిజెంట్ రైడ్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Also Read: పల్సర్ NS 125 అప్‌డేట్ వెర్షన్.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే!

అంచనా ధర:

సుజుకి ఇండియా ఇంకా ఈ బైక్ ధరను అఫీషియల్‌గా ప్రకటించలేదు. అయితే అంచనా ప్రకారం.. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 10 లక్షల నుంచి రూ.11 లక్షలు మధ్య ఉండవచ్చని అంటున్నారు. మరి ఈ రోజు రిలీజ్ కానున్న ఈ బైక్ ఎంత ధర ఉంటుందో కొద్ది గంటల్లో తేలిపోతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News