BigTV English

Xiaomi SU7 : Xiaomi నుంచి స్టైలిష్ ఎలక్ట్రిక్ కార్.. సింగిల్ ఛార్జ్‌తో 1200 కిమీ రేంజ్..?

Xiaomi SU7 : Xiaomi నుంచి స్టైలిష్ ఎలక్ట్రిక్ కార్.. సింగిల్ ఛార్జ్‌తో 1200 కిమీ రేంజ్..?
Xiaomi SU7
Xiaomi SU7

Xiaomi SU7 : ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు పెరుగుతుంది. చిన్న ఎలక్ట్రిక్ వాహనాల తయారీతో మార్కెట్‌లోకి అడుగుపెట్టిన కంపెనీలు నేడు భారీ స్థాయి ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ Xiaomi స్టెలిష్ లుక్‌తో స్పోర్టీ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. ఇప్పటికే చైనా మార్కెట్‌లో ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ కారు గట్టిపోటి ఇవ్వనుంది. ఈ కారు హైలెట్స్ చూద్దాం.


Xiaomi లాంచ్ చేసిన SU7 EV మోడల్‌ రెండు వేరియంట్‌లలో రానుంది. ఇందులో ఒకటి ప్రో వెర్షన్ కాగా దీని ధర రూ. రూ. 28,35,934 గా ఉండనుంది. రెండోది మాక్స్ వెర్షన్. దీని ధర రూ.34,58,709 గా ఉండుదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కారు లాంచ్ చేసిన మొదటి 27 నిమిషాల్లోనే 50,000 ఆర్డర్లు అందాయని వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి చైనాలోని 39 నగరాల్లోని 211 స్టోర్లలో SU7 అమ్మకాలు ప్రారంభిచనున్నారు.

Also Read :  కియా నుంచి మరో సూపర్ స్టైలిష్ కారు


SU7 మ్యాక్స్ వేరియంట్ గరిష్టంగా 265 kmphవేగాన్ని కేవలం 2.78 సెకన్లలో 0-100 kmph నుండి వేగాన్ని అందుకోగలదు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 810 kms వరకు అద్భుతమైన రేంజ్‌ను అందిస్తుంది. ఇందులో డ్యాయల్ మోటర్ ఉంటుంది. ఫోర్ వీల్ డ్రైవ్ పవర్‌ట్రెయిన్‌తో దాదాపు 986 bhp శక్తిని రిలీజ్ చేస్తుంది. కేవలం 1.98 సెకన్లలో 0-100 kmph వేగంతో దూసుకుపోతుంది.

SU7 రెండు బ్యాటరీ వేరింయట్‌లో కంపెనీ తీసుకురానుంది. ఎంట్రీ-లెవల్ వేరియంట్‌‌కు 73.6 kWh ప్యాక్ ఉంటుంది. టాప్ఆఫ్ ది లైన్ మోడల్ కోసం పెద్ద 101 kWh ప్యాక్. ఈ బ్యాటరీలు ఒక్కసారి ఛార్జ్ చేస్తే కనీసం 700 కిమీల పరిధిని అందించగలవని సమాచారం. అదనంగా Xiaomi 150 kWh బ్యాటరీ ప్యాక్‌ను కూడా తీసుకురావాలని ప్రయత్నిస్తుంది. ఇది 1200 కిమీ రేంజ్ ఇస్తుంది. Xiaomi SU7 అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో 350 కిమీలు, 510 కిమీలు ప్రయాణించేంత శక్తిని కలిగి ఉంటుంది. ఈ కారు ఎలక్ట్రిక్ వాహనాల లవర్స్‌కు మంచి ఎంపికగా నిలవనుంది.

Related News

Jio Recharge Offers: జియో బంపర్ ఆఫర్.. రీచార్జ్ చేసుకుంటే వెంటనే క్యాష్‌బ్యాక్!

BSNL Sim Post Office: పోస్టాఫీసులో BSNL సిమ్.. ఇక గ్రామాలకూ విస్తరించనున్న సేవలు

Jio Mart Offers: రూ.6,099 నుంచే స్మార్ట్‌ఫోన్లు.. జియోమార్ట్ సంచలన ఆఫర్లు

Gold Mining: స్వర్ణాంధ్రలో భారీగా గోల్డ్ మైన్స్.. త్వరలోనే రూ.లక్షల కోట్ల విలువైన బంగారం వెలికితీత

EPFO Passbook Lite: EPFO కీలక నిర్ణయం, ఒకే క్లిక్ తో పీఎఫ్ సెటిల్మెంట్!

Gold Rate: తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా..?

GST Reforms Benefits: GST 2.O మనకు నెలవారీ ఖర్చులు ఎంత తగ్గుతాయంటే?

Vivo New Mobile Launch: ఈ ఫోన్ ఫ్యూచర్లు చూస్తే మతిపోవాల్సిందే.. వివో ఎస్ 19 ప్రో 5జీ రివ్యూ

Big Stories

×