BigTV English

సెకండ్ హ్యాండ్ కారు కొనేందుకు కార్ లోన్ తీసుకుంటున్నారా..అయితే మీరు చేస్తున్న అతి పెద్ద మిస్టేక్ ఇదే..

సెకండ్ హ్యాండ్ కారు కొనేందుకు కార్ లోన్ తీసుకుంటున్నారా..అయితే మీరు చేస్తున్న అతి పెద్ద మిస్టేక్ ఇదే..

మధ్య తరగతి ప్రజలకు కారు కొనడం అనేది ఒక జీవితాశయంగా భావిస్తారు. కారులో తమ కుటుంబంతో ప్రయాణించడం అనేది వారికి ఎంతో ఆత్మ గౌరవాన్ని అందిస్తుంది. తాము జీవితంలో ఒక గొప్ప మైలురాయిని తాకామని కారు కొనుగోలు చేసిన వారు భావిస్తుంటారు. దీనికి ప్రధాన కారణం భారతదేశంలో కారు అనేది ఒక లగ్జరీ వస్తువు. కారు కొనుగోలు చేయాలని చాలామంది కలలు కంటూ ఉంటారు. చాలామంది కార్ లోన్ తీసుకొని కొనుగోలు చేస్తుంటారు. బ్యాంకులు కార్ లోన్ ఆఫర్స్ పెద్ద మొత్తంలో అందిస్తుంటాయి. ఇతర లోన్లతో పోల్చి చూస్తే కారులోన్ వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. అయితే కొత్త కారు ధరలు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నాయి. . ఈ నేపథ్యంలో చాలా మంది సెకండ్ హ్యాండ్ కారుతో అయినా సంతతి పొందవచ్చని భావిస్తూ ఉంటారు. అయితే సెకండ్ హ్యాండ్ కార్లు కూడా సుమారు 50 నుంచి 60 శాతం ధరతో డిస్కౌంట్తో లభిస్తుంటాయి. కారు నడిచిన కండిషన్ను బట్టి ఒక్కోసారి కేవలం 20 నుంచి 30% మాత్రమే డిస్కౌంట్ లభించే అవకాశం ఉంటుంది. కానీ మార్కెట్లోని కొత్తకారులతో పోల్చి చూస్తే వీటి ధర తక్కువగా ఉంటుంది. దీంతోనే చాలామంది మధ్యతరగతి ప్రజలు సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే సెకండ్ సేల్స్ కారు విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మీ పెట్టుబడి మొత్తం నష్టపోయే అవకాశం ఉంటుంది.


సెకండ్ హ్యాండ్ కార్ విషయంలో చేసే తప్పులు ఇవే:
>> చాలామంది సెకండ్ హ్యాండ్ కారు కూడా కొనుగోలు చేయడానికి కార్ లోన్ అప్లై చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కొత్త కార్ తో పోల్చి చూస్తే పాత కారు కొనుగోలు చేసినట్లయితే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా కొత్త కారుకు వడ్డీ రేటు 8 శాతం నుంచి తొమ్మిది శాతం మధ్యలో ఉన్నట్లయితే. పాత కార్లకు 10% నుంచి 17% మధ్యలో వడ్డీ రేట్లు ఉంటాయి. అంతేకాదు మీకు కారు వేల్యూలో కేవలం 60 నుంచి 70 శాతం వరకు మాత్రమే లోన్ లభిస్తుంది. . దీనికి తోడు మీరు కేవలం గరిష్టంగా ఐదు సంవత్సరాలలోగా రుణం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అదే మీరు కొత్త కారు కొనుగోలు చేసినట్లయితే, ఏడు సంవత్సరాల వరకు రుణం తిరిగి చెల్లించేందుకు వ్యవధి ఉంటుంది. దీనికి తోడు కొత్త కారుకు కార్ వాల్యూ లో సుమారు 90 శాతం వరకు లోన్ లభించే అవకాశం ఉంది.

సెకండ్ హ్యాండ్ కారు లోన్లపై వడ్డీ రేటు ఎందుకు ఎక్కువగా ఉంటుంది..?
కారు అనేది స్థిరాస్తి లాంటిది కాదు. కారు విలువ అనేది కొన్న మొదటి రోజు నుంచి తగ్గడం ప్రారంభిస్తుంది. సాధారణంగా బ్యాంకులో మీ కారును గ్యారెంటీగా తీసుకొని లోన్ అందిస్తాయి మీరు, లోన్ చెల్లించలేని పక్షంలో కారును జప్తు చేసుకుంటాయి. అలాంటి సమయంలో కారు వేల్యూ అనేది తగ్గిపోవడంతో బ్యాంకుకు నష్టం వస్తుంది. అలాంటిది సెకండ్ హ్యాండ్ కార్ విషయంలో కూడా మరింత వేగంగా కారు వేల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధిక రిస్కు ఉన్న నేపథ్యంలో ఎక్కువ వడ్డీ రేటు వసూలు చేస్తూ బ్యాంకులు సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేసేందుకు లోన్ అందిస్తుంటాయి.


సెకండ్ హ్యాండ్ కారు ఒకవేళ కొనుగోలు చేయాలి అనుకున్నట్లయితే, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని నేరుగా క్యాష్ చెల్లించి కొనుగోలు చేస్తే మంచిది. లోన్ తీసుకొని సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేయడం అనేది ఫైనాన్షియల్ గా అంత తెలివైన నిర్ణయం కాదు. దానికన్నా గోల్డ్ లోన్ తీసుకొని సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేయడం ద్వారా తక్కువ వడ్డీ చెల్లించవచ్చు.

Related News

DMart Offer: డీమార్ట్ అద్భుతమైన ఆఫర్.. ఇవన్నీ సగం ధరకే.. ఇదే మంచి అవకాశం

Jio special offer: స్వాతంత్ర్య దినోత్సవ jio ఆఫర్ ఇదే.. ఈ ఛాన్స్ ఒక్కరోజు మాత్రమే.. డోంట్ మిస్!

Real Estate: ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఇరుక్కున్నారా…అయితే మార్ట్‌గేజ్ లోన్ ఎలా పొందాలి..? మీ సమస్యలకు ఇలా చెక్ పెట్టండి..

DMart Offers: డిమార్ట్‌లో ఆగస్టు నెలలో ఇన్ని ఆఫర్లా? వాటిపై ఏకంగా 70 శాతం డిస్కౌంట్

Offer to Google Chrome: గూగుల్ క్రోమ్‌పై కన్నేసిన పర్‌ప్లెక్సిటీ.. 34.5 బిలియన్ డాలర్ల ఆఫర్

Big Stories

×