BigTV English
Advertisement

Prime Minister Modi: దేశమంతటా ఏఐ ఉండాలి.. బిల్ గేట్స్‌తో కలిసి టీ తాగుతూ ప్రధాని మోడీ కబుర్లు..

Prime Minister Modi: దేశమంతటా ఏఐ ఉండాలి.. బిల్ గేట్స్‌తో కలిసి టీ తాగుతూ ప్రధాని మోడీ కబుర్లు..
 Prime Minister Modi with billgates
Prime Minister Modi

Prime Minister Modi latest news(National news today India): ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. వీరిద్దరు కలిసి టీ తాగుతూ ప్రపంచానికి సంబంధించిన కబుర్లు చెప్పుకున్నారు. భారత్ పర్యటనలో ఉన్న బిల్ గేట్స్ ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా కొన్ని గంటలపాటు ఆయన కలిసి చాలా విషయాలను చర్చించారు. తాజాగా వీరిద్దరికి సంబంధించిన సంభాషణ వీడియోను విడుదల చేశారు. ఈ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు గంటల ప్రధాని, బిల్ గేట్స్ ఏం మాట్లాడుకున్నారో తెలుసుకుందాం.


ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తున్న ఏఐ టెక్సాలజీపై ప్రధాని మోడీ, బిల్ గేట్స్ చర్చించుకున్నారు. నమో యాప్ లో ఏఐ వాడకం గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. డిజిటలైజేషన్ తో భారత్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. మరోవైపు 2023లో భారత్ లో జరిగిన జీ20 సదస్సుపై కూడా మోడీ ప్రస్తావించారు.

జీ20 సమావేశంలో ఏఐ టెక్నాలజీ గురించి వివరించినట్లు తెలిపారు. మరోవైపు ఏఐతో మోడీపై డీప్ ఫేక్ వీడియోలు కూడా చేసినట్లు ఆయన బిల్ గేట్స్‌తో జరిగిన సంభాషణలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో మోడీ మాట్లాడుతూ.. ‘నేను కొత్త విషయాలు తెలుసుకోవడానికి చాలా ఇష్టపడతాను. అదేవిధంగా టెక్నాలజీని వాడడంలోను ముందుంటాను. అయితే ఇదే సమయంలో జీ20 సమావేశంలో ఏఐ టెక్నాలజీని అద్భుతంగా వాడుకున్నాం. ఏఐతో హిందీలో నేను చేసిన ప్రసంగాన్ని తమిళంలోకి ట్రాన్స్ లేట్ చేయించాం. అయితే ఇలా చేయడం బాగానే ఉంది. ఏఐ భారత దేశమంతటా ఉండాలి. ఏఐ చాలా శక్తివంతమైంది. దీన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి. దీనిని ఒక మ్యాజిక్ టైల్ లాగా ఉపయోగిస్తే అనేక సమస్యలు ఎదురవుతాయి. ఇది కనుక తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇప్పటికే డీప్ ఫేర్ తో నా గొంతును కూడా మార్చారు’ అని తెలిపారు.

Also Read: IRCTC టూర్ ప్యాకేజీ.. 6 రోజుల్లో ఈ అద్భుతమైన ప్రదేశాలను చుట్టేయండి.. ధర వివరాలిలా..

మోడీ వ్యాఖ్యలకు బిల్ గేట్స్ సమాధానం ఇచ్చారు. మనం ప్రస్తుతం ఏఐ వినియోగంలో ఫస్ట్ స్టెప్ లో మాత్రమే ఉన్నాం అన్నారు. టెక్నాలజీ అనేది చాలా పెద్దది. దాంతో ఎన్నో సమస్యలు, సొల్యూషన్స్ రెండు ఉంటాయి అని బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు.

Tags

Related News

Sabarimala Gold Theft: శబరిమల బంగారం వివాదంలో ట్విస్ట్.. 2019 లోనే రాగిగా మార్చేసి!! ఎంత చోరీ అయ్యిందంటే

PM Modi: ఛత్తీస్‌గఢ్ పర్యటనకు ప్రధాన మోదీ.. రూ.14,000 కోట్ల ప్రాజెక్టుల శంకుస్థాపన

Saudi Crime: ఎన్‌కౌంటర్లో చిక్కుకున్నాడు.. చనిపోయే ముందు భార్యకు వాయిస్ నోట్ పంపాడు!

ISIS terrorist confess: పాక్ బట్టలిప్పిన టెర్రరిస్ట్.. ఐసీస్ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారంటూ వాంగ్మూలం

Aadhaar Updates: ఇకపై ఆధార్ అప్డేట్ చాలా సింపుల్.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్

Mumbai Hostage: 5 రోజుల ప్లానింగ్, 3 గంటల భయం, ఒక్క బుల్లెట్‌కు హతం.. ఇది కిడ్నాపర్ కథ!

NDA Manifesto: యువతకు కోటి ఉద్యోగాల హామీ.. బీహార్ ఎన్డీయే మేనిఫెస్టో రిలీజ్

PM Modi: సర్దార్‌ వల్లభాయ్ పటేల్‌కు.. ప్రధానీ మోదీ నివాళి

Big Stories

×