BigTV English

PM Modi On Gst: ఎర్రకోట నుంచి సామాన్యులకు మోదీ శుభవార్త .. దీపావళి గిఫ్ట్, పన్ను రేట్ల తగ్గింపు

PM Modi On Gst: ఎర్రకోట నుంచి సామాన్యులకు మోదీ శుభవార్త .. దీపావళి గిఫ్ట్, పన్ను రేట్ల తగ్గింపు

PM Modi On Gst: సామాన్యులకు శుభవార్త చెప్పారు ప్రధాని నరేంద్రమోదీ. దీపావళిలోపు జీఎస్టీ పన్నుల విధానంలో సంస్కరణలు చేస్తామని వెల్లడించారు. రోజువారీగా వినియోగించే వస్తువులపై పన్ను రేటు తగ్గిస్తామని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఏయే రేట్లు తగ్గుతాయి? అన్నదానిపై అప్పుడే చర్చ మొదలైంది.


79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు ప్రధాని నరేంద్రమోదీ. ఈ క్రమంలో సామాన్యులకు తీపి కబురు చెప్పారు. దీపావళి లోపు సామాన్యులకు గిఫ్ట్ ఇవ్వనున్నట్లు ప్రకటన చేశారు. కొత్త తరం జీఎస్టీ సంస్కరణలు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. రోజువారీగా వినియోగించే రకరకాల వస్తువులపై పన్ను రేట్లు తగ్గిస్తామని వెల్లడించారు.

దీనిపై అన్ని రాష్ట్రాలతో చర్చించిన తర్వాత జీఎస్టీ విధానంలో మార్పులు చేస్తున్నట్లు వెల్లడించారు.  గడిచిన ఎనిమిదేళ్లుగా జీఎస్టీలో ఎన్నో సంస్కరణలు చేశామన్న ప్రధాని మోడీ, ఇప్పుడు దాన్ని సమీక్షించాల్సి ఉందన్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాలతో మాట్లాడామని, కొత్త తరం జీఎస్టీ సంస్కరణలు వస్తాయన్నారు.


దీనివల్ల పౌరులు కొనుగోలు చేసే వస్తువుల  పన్ను రేట్లు గణనీయంగా తగ్గుతాయన్నారు. చిన్న పరిశ్రమలు, MSME లకు గణనీయ ప్రయోజనం కలుగుతుందన్నారు. అలాగే రోజు వారీగా వినియోగించే వస్తువులు చౌకగా అందుబాటులోకి రానున్నాయి.

ALSO READ: డీమార్ట్ అద్భుతమైన ఆఫర్.. ఇవన్నీ సగం ధరకే

ముఖ్యమైన వస్తువులకు అధిక పన్నులు ఎందుకు వసూలు చేస్తున్నారని చాలాకాలంగా వినియోగదారులు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు.  టైర్-2, టైర్-3 నగరాల్లో ఈ ప్రక్రియను నిర్వహించడంలో చిన్న వ్యాపారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇటీవలికాలంలో GST నిర్మాణంలో ముఖ్యమైన మార్పుల్లో ఒకదాన్ని ప్రభుత్వం ఇప్పుడు పరిశీలిస్తోందని తెలుస్తోంది.

12 శాతం శ్లాబ్‌ను రద్దు చేసే అవకాశం ఉన్నట్లు వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. అది తొలగిస్తే నిత్యం ఉపయోగించే నెయ్యి, సబ్బులు, స్నాక్స్, గృహోపకరణాలు వంటి వస్తువులు 5 శాతం పరిధిలోకి రానున్నట్లు అంచనా వేస్తున్నారు. దీనివల్ల వినియోగదారులకు ఆయా వస్తువులు చౌకగా లభిస్తాయి.

ఈ నెల చివరలో జరగనున్న జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం జరగనుంది. అందులో నిర్ణయాలు తీసుకోనున్నారు. దీపావళికి ముందు కొత్త రేట్లు అమలులోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల మాట. ఉన్నట్లుండి ప్రధాని మోదీ ప్రకటన వెనుక కారణాలు చాలానే ఉన్నాయి.

ట్రంప్ టారిఫ్ బెదిరింపుల నేపథ్యంలో విదేశాలకు ఎగుమతి అయ్యే వస్త్రాలు తోపాటు కొన్ని వస్తువులపై ట్రంప్ డబుల్ టారిఫ్ విధించారు. దీంతో ఆయా పరిశ్రమలు కాస్త ఒడుదుడుకులకు లోనవుతున్నాయి. దీన్ని గమనించి ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.  నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసి ప్రపంచ మార్కెట్‌లో మన సామర్థ్యం నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

ప్రపంచ మార్కెట్‌ను మనం పాలించాలన్నారు. తక్కువ ధర, అధిక నాణ్యత లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. తొలుత మనల్ని మనం బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్లాలన్నారు. దేశంలోని వ్యాపారులు, దుకాణదారులు స్వదేశీ ఉత్పత్తుల అమ్మకాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ తరహా విధానం చైనాలో ఎప్పటి నుంచో అమల్లో ఉంది. అదే కాన్సెప్ట్ ను ప్రధాని మోదీ దృష్టి సారించినట్టు కొందరు రాజకీయ నేతల మాట.

 

 

Related News

DMart Offer: డీమార్ట్ అద్భుతమైన ఆఫర్.. ఇవన్నీ సగం ధరకే.. ఇదే మంచి అవకాశం

సెకండ్ హ్యాండ్ కారు కొనేందుకు కార్ లోన్ తీసుకుంటున్నారా..అయితే మీరు చేస్తున్న అతి పెద్ద మిస్టేక్ ఇదే..

Jio special offer: స్వాతంత్ర్య దినోత్సవ jio ఆఫర్ ఇదే.. ఈ ఛాన్స్ ఒక్కరోజు మాత్రమే.. డోంట్ మిస్!

Real Estate: ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఇరుక్కున్నారా…అయితే మార్ట్‌గేజ్ లోన్ ఎలా పొందాలి..? మీ సమస్యలకు ఇలా చెక్ పెట్టండి..

DMart Offers: డిమార్ట్‌లో ఆగస్టు నెలలో ఇన్ని ఆఫర్లా? వాటిపై ఏకంగా 70 శాతం డిస్కౌంట్

Big Stories

×