Big Stories

Bajaj Pulsar NS 125 Update Version: పల్సర్ NS 125 అప్‌డేట్ వెర్షన్.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే..!

 

- Advertisement -
2024 Bajaj Pulsar NS 125
2024 Bajaj Pulsar NS 125

2024 Bajaj Pulsar NS 125: దేశీయ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్. ఈ కంపెనీ నుంచి వచ్చిన బైకులకు మార్కెట్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. బాజాజ్ నుంచి వచ్చిన బైకులు ఎక్కువ మైలేజ్‌‌ను ఆఫర్ చేస్తాయి. ఇందులో బజాజ్ ప్లాటినా మైలేజ్‌లో రారాజుగా ఉంది. అలానే ఇందులో ఉన్న మరో బైక్ బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125. ఈ బైక్ యువత డ్రిమ్ బైకుల్లో ఒకటిగా ఉంటుంది. కాలేజీ యువత ఈ బైక్‌పై రైడ్ చేసేందుకు చాలా ఇంటెరెస్ట్ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది.

- Advertisement -

దీంతో కంపెనీ ఎన్ఎస్‌లో ఉన్న అనేక వేరియంట్లను అప్‌డేట్ చేసేందుకు సిద్ధమైంది. ఇందులో NS200,NS160 వంటి మోడళ్లను అప్‌‌గ్రేడ్ చేసి రిలీజ్ చేసింది. అమ్మాకాల్లో రికార్డులు స‌ృష్టించాయి. ఈ క్రమంలో మరో వేరియంట్ NS125‌ను కొత్త లుక్‌లతో తీసుకొచ్చింది. స్టైలిష్ లుక్‌తో రిలీజ్ అయిన ఈ బైక్.. యువతను అట్రాక్ట్ చేస్తుంది. కొత్త మోడల్‌కి పాత మోడల్‌కి ధరలో కూడా పెద్దగా తేడాలేదు. కేవలం రూ. 5వేలు మాత్రమే ఎక్కువ. రూ.1.05 లక్షలకే ఈ బైక్‌ను దక్కించుకోవచ్చు.

బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్ 125 డిజైన్‌లో పెద్దగా మార్పులు ఏమి చేయలేదు. ఇందులో సరికొత్త హ్యాండ్‌లాప్ సెటప్‌ను పొందుపరిచారు. అప్‌డేట్ వెర్షన్‌లో లైటింగ్ బోల్ట్‌ల ఆకారంలో ఉన్న DRLలతో పాటు LED హెడ్‌ల్యాంప్‌ను కూడా చూడొచ్చు. ఇది బైక్‌ను మంచి స్పోర్టీ లుక్ ఇస్తుంది. అయితే హెడ్‌ల్యాంప్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు.

Also Read: కియా సెల్టోస్ కొత్త ఆటోమేటిక్ వేరియంట్‌ లాంచ్!

బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్ 125 ఫీచర్లు చూసినట్లయితే.. ఇది పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కూడా ఉంది. దీనిద్వారా రైడింగ్ సమయంలో కాల్స్ మాట్లాడొచ్చు. అలానే ఇదే డిస్‌ప్లేలో ఫోన్ ఛార్జింగ్ పర్సెంటేజ్ కూడా చూడొచ్చు. USB ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. స్క్రీన్‌పై ఓడోమీటర్, రెవ్ కౌంటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ గేజ్ రీడింగ్‌లు కనిపిస్తాయి. బైక్‌లో ఏబీఎస్ మంచి బ్రేకింగ్ ఫీల్‌ని ఇస్తుంది.

అలానే బైక్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుకవైపు 5-స్టెప్ మోనోషాక్ సస్పెన్షన్. బ్రేకింగ్ సెటప్‌లో ముందు వైపు డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఈ ఈ బైక్ 17-అంగుళాల చక్రాల ట్యూబ్‌లెస్ టైర్‌లను కలిగి ఉంది. బైక్ బరువు 144 కిలోలు, గ్రౌండ్ క్లియరెన్స్ 179 మిమీగా ఉంది. దీనివల్ల బైక్ కంట్రోలింగ్ సులభంగా ఉంటుంది.

Also Read: సముద్రపు నీటితో నడిచే కారు.. ఎలానో చూడండి!

ఇక ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులో 125cc సింగిల్-సిలిండర్ 4-స్ట్రోక్, SOHC 4-వాల్వ్, ఎయిర్ కూల్డ్, DTS-i Ei ఇంజిన్ ఉంది. 5-స్పీడ్ గేర్ బాక్సును కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 11.80 హెచ్‌పి పవర్, 11 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఈ బైక్ 50-55 మధ్యలో మైలేజ్ ఇవ్వొచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News