Discount Offers on Tata Vehicles: భారతీయ మార్కెట్‌లో టాటా మోటార్స్‌కి మంచి క్రేజ్ ఉంది. అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీల్లో టాటా మోటర్స్ ముందు వరుసలో ఉంటుంది. ఈ కంపెనీ కొత్త కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి దించుతూ వాహన ప్రియులను అట్రాక్ట్ చేస్తుంది. అంతేకాకుండా తమ సేల్స్‌ను మరింత విస్తరించేందుకు రకరకాల ఆఫర్లను సైతం తీసుకొస్తూ ఉంటుంది. ఇప్పటికే తన మోడళ్లపై ఆఫర్లు అందించిన టాటా మోటార్స్ తాజాగా మరికొన్ని మోడల్స్ అయిన టాటా టిగోర్, టియాగో, నెక్సాన్, ఆల్ట్రోజ్, హారియర్, సఫారీ వంటి వాటిపై కళ్ళుచెదిరే డిస్కౌంట్లను ప్రకటించింది. అయితే ఇందులో ఒక్క క్యాష్ డిస్కౌంట్స్ మాత్రమే కాకుండా ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బోనస్ వంటివి లభిస్తాయి. అవేంటో తెలుసుకుందాం..
టాటా టిగోర్
టాటా టిగోర్ ధర రూ. 6.30 లక్షల నుంచి రూ. 9.55 లక్షల మధ్య ఉంది. అయితే ఈ నెలలో టిగోర్ పెట్రోల్ వెర్షన్ మీద రూ.50000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే CNG వేరియంట్ మీద రూ.45000 అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తున్నాయి.
టాటా టియాగో
టాటా మోటార్స్ తన మోడల్‌లోని Tata Tiago కొనుగోలుపై భారీ బెనిఫిట్స్ అందిస్తోంది. ప్రస్తుతం టాటా టియాగో ధర రూ.5.65 లక్షల నుంచి రూ.8.90 లక్షల మధ్య ఉంటుంది. అయితే ఇప్పుడు దీనిలోని పెట్రోల్ వేరియంట్స్‌పై ఏకంగా రూ.55,000 వరకు తగ్గింపు అందిస్తుంది. అందులో రూ.35000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 20000 ఎక్స్ఛేంజ్ / స్క్రాపేజ్ బోనస్ వంటివి పొందొచ్చు. ఇక పెట్రోల్ వేరియంట్‌తో పాటు CNG వేరియంట్ మీద రూ.45000 వరకు తగ్గింపులు లభిస్తాయి.
టాటా నెక్సాన్
Also Read: కెవ్ కేక.. టాటా కార్లపై రూ.1.25 లక్షల భారీ తగ్గింపు.. ఆఫర్లు ఎప్పటివరకంటే..?
నెక్సాన్‌కు సూపర్ డూపర్ క్రేజ్ ఉంది. టాటా నెక్సాన్ పెట్రోల్, డీజిల్ వెర్షన్లపై రూ. 20000 వరకు స్క్రాప్‌పేజ్ / ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లు లభిస్తున్నాయి. ఈ కాంపాక్ట్ SUV రూ. 8 లక్షల నుంచి రూ.15.80 లక్షల ధర మధ్య అందుబాటులో ఉంది.
టాటా హారియర్
ఈ నెలలో టాటా హారియర్‌లోని అన్ని వేరియంట్ల కొనుగోలు మీద రూ.30,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ కారు 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఈ కారు రూ.15.49 లక్షల నుంచి రూ.26.44 లక్షల మధ్య లభిస్తుంది.
టాటా ఆల్ట్రోజ్
టాటా ఆల్ట్రోజ్ సేల్ మార్కెట్‌లో మంచి స్పీడ్‌తో దూసుకుపోతుంది. అందువల్ల దీని సేల్స్ మరింత పెంచేందుకు ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. ఆల్ట్రోజ్ కొనుగోలు మీద టాటా మోటార్ ఈ నెలలో రూ.45000 తగ్గింపు అందిస్తోంది. దీంతోపాటు CNG వేరియంట్‌పై రూ.35000 విలువైన ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఈ కారులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా, ఆరు ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
టాటా సఫారీ
Also Read: విశాలవంతమైన కార్లు.. ఇంత తక్కువ ధరలో కూడా ఉంటాయా.. మీకు నచ్చింది ఏరుకోండి సామీ..!
వీటన్నింటితో పాటు టాటా సఫారీ కొనుగోలుపై కూడా మంచి డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఏకంగా రూ.30,000 డిస్కౌంట్ లభిస్తోంది. అప్పుడు మరింత తక్కువకే దీన్ని కొనుక్కోవచ్చు. ఈ కారు రూ.16.19 లక్షల ధర నుంచి రూ.27.34 లక్షల ధర మధ్య ఉంది. అయితే ఇక్కడ గుర్తించుకోవలసిన విషయం ఏంటంటే.. టాటా మోటార్స్ ప్రకటించిన తన మోడళ్లపై ఈ నెల చివరి వరకు మాత్రమే తగ్గింపులు లభిస్తాయి.