BigTV English

7 Seater Cars Under Rs.10 Lakhs: విశాలవంతమైన కార్లు.. ఇంత తక్కువ ధరలో కూడా ఉంటాయా..? నచ్చింది ఏరుకోండి!

7 Seater Cars Under Rs.10 Lakhs: విశాలవంతమైన కార్లు.. ఇంత తక్కువ ధరలో కూడా ఉంటాయా..? నచ్చింది ఏరుకోండి!

7 Seater Cars Under Rs. 10 Lakh: చాలా మంది వాహన ప్రియులు తమ కుటుంబం కోసం అత్యంత తక్కువ ధరలో విశాలమైన, కంఫర్ట్‌గా ఉండే కారును కొనుక్కోవాలని ప్లాన్ చేస్తుంటారు. వాటికోసం తెగ సెర్చ్ చేస్తుంటారు. మరి మీరు కూడా అదే పనిలో ఉన్నట్లయితే ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ మేము భారతదేశంలో అందుబాటులో ఉన్న రూ.10 లక్షల లోపు లభిస్తున్న ది బెస్ట్ 7సీట్ల కార్ల లిస్ట్‌ను తీసుకొచ్చాం. ఇందులో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవచ్చు. ఇప్పుడు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..


Mahindra Bolero Neo

మహీంద్రా కార్లకు మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. అందులోనూ బొలెరో నియో కార్లు ఆధునిక ఫీచర్లతో విశాలవంతంగా ఉంటాయి. అందువల్ల పెద్ద కుటుంబం కలవారు ఈ కారునే ఎక్కువగా ఇష్టపడతారు. మహీంద్రా బొలెరో నియో ప్రారంభ ధర రూ. 9,89,601గా ఉంది. ఇది 1493 cc ఇంజిన్‌తో ఆధారితమైనది. ఈ మోడల్ నాలుగు వేరియంట్‌లలో ఆరు కలర్‌ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ వేరియంట్లన్నీ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఉంటాయి. Mahindra Bolero Neo 17.2 kmpl మైలేజీని అందిస్తుంది.


Mahindra Bolero

మహీంద్రా బొలెరో దృఢమైన బాడీని కలిగి ఉండటం చేత బాగా ప్రసిద్ధి చెందింది. ఇది 7-సీటర్‌లో వచ్చి అందరినీ ఆకట్టుకుంది. దీని ధర రూ. 9,89,600 గా ఉంది. ఇది కూడా 1493 cc ఇంజిన్‌తో అమర్చబడి ఉంటుంది. మూడు వేరియంట్‌లను కలిగి మూడు కలర్ ఆప్షన్లలో వస్తుంది. అన్నీ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటాయి. Mahindra Bolero మైలేజ్ సుమారు 16 kmpl ఇస్తుంది. మంచి మన్నిక, పనితీరు కలిగిన కారు కోసం వెతుకుతున్న వారికి ఇది బెస్ట్ ఎంపిక.

Also Read: ADAS ఫీచర్ ఉన్న కార్లు.. ఈ సేఫ్టీ ఫీచర్ ఉంటే ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేనట్లే!

Maruti Suzuki Ertiga

మారుతి సుజుకి ఎర్టిగా దాని విశాలమైన స్థలంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. రూ.8,64,000 ఎక్స్-షోరూమ్ ధరతో ప్రారంభమయ్యే ఎర్టిగా 1462 సిసి ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈ Maruti Suzuki Ertiga
తొమ్మిది వేరియంట్లు, ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో వస్తుంది. 20.3 నుండి 26.11 kmpl వరకు మైలేజీని అందిస్తుంది.

Renault Triber

రెనాల్ట్ ట్రైబర్ అనేది సాధారణ కుటుంబాలకు మంచి ఎంపిక. దీని ధరలు రూ. 5,99,500గా ఉంది. ఇది 999 cc ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ Renault Triber ఎనిమిది వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అలాగే ఇది పది కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ట్రైబర్ 18.2 నుండి 19 kmpl మైలేజీతో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లను అందిస్తుంది.

Also Read: లక్షకు పైగా డిస్కౌంట్స్.. టాటా ఆఫర్లు భలే ముద్దొస్తున్నాయ్..!

Maruti Suzuki Eeco

మారుతీ సుజుకి ఈకో కార్ బడ్జెట్ ధరలో కొనుక్కునే వారికి ది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. Maruti Suzuki Eeco రూ.4,29,819 ధర నుండి అందుబాటులో ఉంది. ఈ 5-7 సీటర్ 1197 cc ఇంజన్‌తో ఆధారితమైనది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో నాలుగు వేరియంట్‌లు.. ఐదు కలర్‌లలో వస్తుంది. Eeco 19.71, 26.78 kmpl మధ్య మైలేజీని అందిస్తుంది.

Related News

BSNL Best Plan: రూ.225 ప్లాన్‌లో దుమ్మురేపే ఆఫర్లు.. డేటా, కాల్స్, SMSలతో ఫుల్ ఎంజాయ్

WiFi Calling: షాకింగ్ ట్రిక్..! మీ ఫోన్‌లోనే దాగి ఉన్న వైఫై కాలింగ్ ఫీచర్ గురించి తెలుసా?

EPFO Withdraw: ఈపీఎఫ్ఓ ​పొదుపును ఇష్టం వచ్చినట్లు వాడేస్తున్నారా?.. అకాల విత్ డ్రాపై ఛార్జీల గురించి తెలుసా?

RBI new rules 2025: RBI షాకింగ్ అప్‌డేట్.. అక్టోబర్ 1 నుంచి మీ బ్యాంక్ ఖాతాలో ఇవన్నీ తప్పనిసరి!

BSNL Offers: జియో, ఎయిర్‌టెల్ ప్లాన్‌లకు షాక్.. BSNL రూ.485లో 72 రోజుల మాస్ ఆఫర్

Jio Offers: 3 నెలల ప్యాక్ ఇంత చౌకా? జియో వినియోగదారులకి గుడ్ న్యూస్

Amazon Prime 2025: అమెజాన్ ప్రైమ్ ఫెస్టివల్ డీల్.. రూ.399 నుండి రూ.1499 వరకు డిస్కౌంట్లు, ఏది బెస్ట్?

TVS Bikes Price Cut: బైక్స్, స్కూటర్ల ధరలు తగ్గించిన టీవీఎస్.. కొత్త ధరల లిస్ట్ ఇదే!

Big Stories

×