Today Gold Rate: దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మంగళవారంతో పోలిస్తే ఈరోజు(డిసెంబర్-4)న గోల్డ్ రేట్స్‌లలో ఎలాంటి మార్పులు కనిపించలేదు. ఈ తరుణంలో ప్రస్తుతం బంగారం రేట్లు పరిశీలిస్తే.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 71,300 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం ధర రూ.77,780 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. ప్రధాన నగరాల్లో గోల్డ్, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
పట్టణ నగరాల్లో గోల్డ్ రేట్స్ ఇలా..
ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 71,450 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 77,930 పలుకుతుంది. ముంబైలో గోల్డ్ రేట్స్ చూస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.71,300 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,780 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో చూస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ, 71,300 పలుకుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,300 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. బెంగుళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 71,300 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,780 వద్ద స్థిరంగా ఉంది. కేరళలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.71,300 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,780 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
Also Read: బ్యాంక్‌లో ఎక్కువ క్యాష్ డిపాజిట్ చేస్తే ఫైన్.. పరిమితులు, నిబంధనలు ఇవే..
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఇలా..
హైదరాబాద్, తెలంగాణలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.71,300 చేరగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,780 వద్ద స్థిరంగా ఉంది. విజయవాడలో గోల్డ్ రేట్స్ చూస్తే.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.71,300 చేరగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,780 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.. విశాఖపట్నం, గుంటూరులో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.71,300 చేరగా..24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,780 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
వెండి ధరలు ఇలా..
దేశవ్యాప్తంగా వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు వెండి ధరలు పరిశీలిస్తే.. చెన్నై, హైదరాబాద్, విజయవాడ, కేరళలో కిలో వెండి ధర రూ.99,500 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీ, కోల్ కత్తా, ముంబై, పుణెలో కిలో వెండి ధర రూ.91,000 వద్ద కొనసాగుతోంది.