Dharmana Krishna Das: సాధారణ ఉద్యోగి అనతి కాలంలోనే కోట్లకు పడగలెత్తడం శ్రీకాకుళం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఐదేళ్ల వ్యవధిలోనే ఊహించని స్థాయిలో ఆస్తులు కూడబెట్టటం ప్రతి ఒక్కరినీ అశ్యర్యానికి గురిచేస్తుంది. అది కూడా ఒక డిప్యూటీ సీఎం దగ్గర పీఏగా పనిచేసిన మామూలు ఉద్యోగి.. కోట్లు సంపాదించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడా వ్యవహారం మాజీ ఉప ముఖ్యమంత్రికి తలనొప్పిగా మారిందంటున్నారు..
గుండా మురళి 2016 లో శ్రీకాకుళం జిల్లా బుడితి ప్రాధమిక ఆరోగ్యకేంద్రం లో ల్యాబ్ అసిస్టెంట్ గా ఉద్యోగo లో చేరాడు. మూడేళ్ళ తరువాత 2019 లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. .వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి నరసన్నపేట వైసీపీ శాసన సభ్యుడు, డిప్యూటీ సిఎం ధర్మాన కృష్ణదాస్ దగ్గర వ్యక్తిగత సహాయకుడి చేరాడు.. అప్పటి నుంచే మురళి వ్యవహార శైళి లో మార్పువచ్చిందనే వాదన వైసీపీ వర్గాల్లోనే వినిపిస్తుoది.
ధర్మాన కృష్ణదాస్ దగ్గర పీఏగా చేసినంత కాలం ఉద్యోగాల ఇప్పిస్తానని మురళి డబ్బులు వసూలు చేసేవాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఇసుక దందాలు, అభివృద్హి పనుల్లో కమీషన్లు వసూలు చేసేవాడని మురళి వైసీపీ నాయకులే ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరో వైవు వికలాంగుల పేరు మీద అనర్హులకు పింఛన్లు ఇప్పించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతటితో ఆగకుండా ఎంపీటీసీళు, పలు శాఖలకు చెందిన చైర్మన్లు వద్ద కూడా కమీషన్లు వసూలు చేసేవాడని సొంత పార్టీ వాల్లే ఆరోపిస్తున్నారు
ఐదేళ్ల లో అలా అడ్డుగోలుగా సంపాదించిన డబ్బుతోనే చిన్న ల్యాబ్ టెక్నీషియన్ నుంచి మురళి బిలియనీర్‌గా ఎదిగాడని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీకి చెందిన వాళ్ళు ఏదైనా పనిమీద ధర్మాన కృష్ణదాస్ దగ్గరకు వస్తే పీఏ చేయి తడిపితే తప్ప.. పెద్దాయనను కలవటం సాధ్యమయ్యేది కాదంట. ఈ విధంగా సంపాదించిన డబ్బుతోనే అనతి కాలంలోనే మురళి కుబేరుడిగా మారిన మురళి పాపాలు ఏసీబీ దాడులతో పండాయంటున్నారు.
తాజాగా మాజీ డిప్యూటీ సిఎం ధర్మాన కృష్ణదాస్ వద్ద గతంలో ప్రభుత్వ పీఏగా చేసిన గొండు మురళి ఆస్తులపై ఏసీబీ రైడ్స్ నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో శాఖ, శ్రీకాకుళం జిల్లాలో మొత్తం ఆరు చోట్ల సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. కృష్ణ దాసు ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో సుదీర్ఘకాలం ఆయన వద్ద మురళీ పీఏగా పని చేశారు. కృష్ణ దాస్‌కి సన్నిహితుడిగా మెలిగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు తన మాతృశాఖ అయిన వైద్య ఆరోగ్యశాఖలోకి వెళ్లిపోయారు.
Also Read: రూట్ మార్చిన ముద్రగడ.. అక్కడికి జంప్
ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలోని బుడితి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఓ సాధారణ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న మురళీ ఆస్తుల వివరాలు చూస్తే కళ్లు తిరిగాల్సిందే. గొండు మురళికి చెందిన 20 ఎకరాలకు పైగా భూమి, విశాఖ, శ్రీకాకుళం సహా పలు ప్రాంతాల్లో పలు ప్లాట్లు, ఫ్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు, కిలో బంగారు ఆభరణాలు, 11.36 కిలోల వెండి వస్తువులు తదితరాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి మార్కెట్ విలువ రూ.70 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేశారు.
అసలు ఐదేళ్లు పీఏగా తన దగ్గరే ఉన్న వ్యక్తి ఇలా అక్రమ మార్గంలో డబ్బులు సంపాదిస్తే..మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ కు తెలియకుండా ఎలా ఉంటుందన్న చర్చ శ్రీకాకుళం జిల్లాలో జోరుగా నడుస్తుంది. లేందంటే చూసి చూడనట్లు కృష్ణదాస్ వదిలేసారా..?.. అదీ కాకుంటే బినామీ వ్యవహారమా? అని సొంత పార్టీ వాళ్లే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇదంతా ధర్మాన కృష్ణదాస్‌కు తెలియకుండా జరిగిందంటే నమ్మలేకపోతున్నామంటున్నారు
ఇప్పుడు మురళి వ్యవహరంతో కృష్ణదాస్ తర్జన భర్జన పడుతున్నారంట.. మురళి ముడుపుల వ్యహారం ఆదిలోనే గుర్తించి కట్టడి చేసిఉంటే.. బాగుండేదని తన అనుయాయులు దగ్గర వాపోతున్నారంట .. మాజీ పీఏ వ్యవహారం చివరకి తనకే తల నొప్పిగా మారిందని మధనపడుతున్నారంట.. మురళీ దగ్గరే అన్ని కోట్ల ఆస్తులు గుర్తించడంతో కృష్ణదాస్‌పై కూడా ఏసీపీ దృష్టి సారించిందనే వార్తలు జిల్లాలో గుప్పు మంటున్నాయి… పీ ఎ కోట్లకు పడగెత్తితే ..అమాత్యుల సంగతి ఏంటా అన్న వాదనలు వినిపిస్తున్నాయి
ఆ క్రమంలో తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందేనని ధర్మాన కృష్ణదాస్ అంటున్నారు. కానీ ప్రభుత్వం కక్ష సాధింపుకు చర్యలకు దిగితే అది కరెక్ట్ కాదంట. ఈ రోజు మీరు కక్షసాధింపులకు దిగితే.. రేపు మా ప్రభుత్వం వస్తుందని ఆయన హెచ్చరిస్తుండటం విశేషం. ఏదేమైనా తన పై ఏసీబీ దాడులు చేసుకోవచ్చని అంటున్నారట..తన తాత ముత్తాతలు నుంచి తమకు ఆస్తులు ఉన్నాయని . ఉన్న ఫలంగా తాము ఆస్తులు కూడా బెట్టలేదని కృష్ణ దాస్ చెప్తున్నారంట. అయిత బయటకి గంభీరంగా ఉన్నా.. ధర్మాన కృష్ణ దాస్ భయపడుతున్నట్లే కనిపిస్తుందని సన్నిహితులు అంటున్నారు. మరి చూడాలి మాజీ పీఏ నిర్వాకం ఈ మాజీ మంత్రిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో?