BigTV English

Vehicles: సొంత కార్లు ఆ దేశంలో ఎక్కువ..

Vehicles: సొంత కార్లు ఆ దేశంలో ఎక్కువ..

Own cars are more in that country: సొంత వాహనం ప్రతి ఒక్కరి కల. సైకిలో, స్కూటరో ఏదో ఒకటి లేనిదే బయటకు వెళ్లలేని స్థితి. భారత్‌ శరవేగంగా పురోగమిస్తున్న దేశం. అందుకు అనుగుణంగానే వాహనాల కొనుగోలు మార్కెట్ కూడా పుంజుకుంటోంది. సైకిలో, స్కూటర్, మోటార్ బైక్, కారు ఏదో ఒక సొంత వాహనం ఉన్నవారు దేశంలో 55% వరకు ఉన్నారు. సొంత వాహనాల విషయంలో టూ-వీలర్ మార్కెట్‌దే పైచేయి. ఇక ప్రతి వెయ్యి మందిలో 33 మందికి మాత్రమే సొంత కార్లు ఉండటం గమనార్హం.


read more: ఆపిల్ లాప్‌టాప్‌పై ఏకంగా రూ.22 వేల తగ్గింపు.. డోంట్ మిస్!

వాహనాల వార్షిక సగటు వృద్ధి రేటు పదిశాతంగా ఉంది. సొంత కార్లు అత్యధికంగా ఉన్న దేశం న్యూజిలాండ్. అక్కడ ప్రతి వెయ్యి మందిలో 869 మంది సొంత కార్లు కలిగిన వారే. 2020లో అమెరికాలో 289 మిలియన్ల వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఆ వాటా 18 శాతానికి సమానం. కార్ ఓనర్‌షిప్ అత్యధికంగా ఉన్న దేశాల్లో అగ్రరాజ్యం ఒకటి. అక్కడ ప్రతి 1000 మందికి 860 మంది తమ కార్లలోనే బయటకు వెళ్తారు.


యూరప్‌ దేశం పోలండ్‌లో వ్యక్తిగత కార్ల సంఖ్య ఎక్కువే. ప్రతి వెయ్యి మందిలో 761 మంది సొంత కార్లు కలిగిన వారే. ప్రపంచంలో ఆ దేశానిది మూడో స్థానం. ఇటలీ(756 కార్లు), ఆస్ట్రేలియా (737), కెనడా(707), ఫ్రాన్స్ (704), చెకియా(658), పోర్చుగల్(640), నార్వే(635 కార్లు) దేశాలు టాప్ టెన్‌లో ఉన్నాయి. సొంత కార్ల విషయానికి వస్తే మన దేశం 62వ స్థానంలో నిలిచింది.

Related News

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Big Stories

×