BigTV English

Eating Tips : మీరు టీవీ చూస్తూ తింటున్నారా..?

Eating Tips : మీరు టీవీ చూస్తూ తింటున్నారా..?

Watching Tv Effects : ఈ రోజుల్లో మల్టీ టాస్కింగ్ చేస్తే తప్ప జీవిత వేగాన్ని అందుకోవడం చాలా కష్టం. సమయంతో పోటీపడి జీవించే అలవాటు పెరిగిపోయింది. అందువల్ల ఇష్టమైన సినిమా లేదా వెబ్‌ సిరీస్ చూసేందుకు ప్రత్యేకంగా సమయం కేటాయించడం కష్టమైపోయింది. దీంతో వారికి ఇష్టమైన షోలను చూస్తూ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు.


కానీ ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతోందని అంటున్నారు నిపుణులు. మీరు మీ ఆనారోగ్యాన్ని ఏరికోని తెచ్చుకున్నట్లే అని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత 5జీ యుగంలో ప్రజలంతా బీజీ లైఫ్‌కు అలవాటుపడ్డారు. డబ్బు సంపాదన మీదపడి టైమ్‌కి తినడం మానేసి, రోడ్ సైడ్ ‌ఫుడ్‌కు అలవాటుపడ్డాడు. ఇంటి భోజనం చేసినా.. ఏదో హడావిడిగా టీవీ చూస్తూ తింటున్నారు. ఇలా తినడం వల్ల జరిగే ప్రమాదం ఏంటో తెలుసుకుందాం.

Read More : మార్చి 1 నుంచి ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. నెలరోజుల్లో ఫిట్ గా అవ్వడం ఖాయం


తింటూ టీవీ చూడటం వల్ల మనకు తిండిపై ఫోకస్ ఉండదు. దీనివల్ల ఎంత తింటున్నారు ? ఏం తింటున్నారు అనే దాన్ని గమనించలేరు. ఫలితంగా ఎక్కువ తినే ప్రమాదం ఉంది. మెదడు పనీతీరు మందగించి.. శరీరానికి ఎంత ఆహారం అవసరం అనే విషయాన్ని గుర్తించదు. కారణంగా అధిక బరువు పెరుగుతారు. పలు జీర్ణ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది.

టీవీ చూసే సమయంలో చాలా మంది తినేందుకు జంక్ ‌ఫుడ్‌ను ఎంచుకుంటారు. ప్యాక్ చేసిన ఆహారం తినడానికి ఇష్టపడతారు. ఇది అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా ఊబకాయం, జీర్ణ సంబంధిత సమస్యలు, గుండె ఆరోగ్యం దెబ్బ తింటుంది. అలానే అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.

తింటూ టీవీ చూసే అలవాటు ఎక్కువగా చిన్నపిల్లలకు ఉంటుంది. దీనివల్ల చిన్న వయసులోనే స్థూలకాయ సమస్యలను పిల్లలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. తింటూ టీవీ చూడటం వల్ల
జీవక్రియల రేటు మందగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read More : ఆడపిల్లలకు కచ్చితంగా పెట్టాల్సిన ఆహారాలు ఇవి.. ఎందుకో తెలుసుకోండి..

టీవీ చూస్తూ తినే అలవాటు ఉన్నవారు.. నాణ్యమైన ఆహారాన్ని ఎంచుకోరు. అలానే సంతృప్తి కలిగే స్థాయిని గుర్తించకపోవం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఇది అధిక బరువు పెరగడానికి కారణం అవుతుంది. ఎంత తిన్నప్పట్టికీ తింటున్న భావన కలగదని వైద్యులు చెబుతున్నారు. టీవీ చూస్తున్నపుడు తీసుకునే ఆహారం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు కొన్ని సూచలనలు చేస్తున్నారు.

  • తినే ముందు దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఏకాగ్రత పెరుగుతుంది. అందువల్ల ఏం తింటున్నామనే దాని మీద మీ ఫోకస్ ఉంటుంది.
  • తినే ముందు ఆహారం రంగు, స్వరూపాన్ని పూర్తి స్థాయిలో కళ్లతో చూసి ఆశ్వాదించాలి. ఇలా అన్ని ఇంద్రియాల అనుభవంతో తినడం మొదలుపెట్టాలి.
  • ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే తినాలి. కడుపు నిండిన భావన కలిగిన వెంటనే ఆపేయాలి.
  • నోటిలోకి తీసుకున్న ప్రతి ముద్దను నములుతూ.. నెమ్మదిగా తినాలి.
  • తినే సమయంలో టీవీ, ఫోన్, కంప్యూటర్ వంటివి మీ సమీపంలో లేకుండా చూసుకోవాలి.

Disclaimer : పలు అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ ఆధారంగా ఈ సమచారాన్ని సేకరించి మీ అవగాహన కోసం అందిస్తున్నాం.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×