Big Stories

2024 Triumph Tiger : ట్రయంఫ్ టైగర్ నుంచి రూ. 16 లక్షల బైక్.. ఒక్కసారి ఎక్కితే ఉంటది మామ!

2024 Triumph Tiger : ప్రపంచ వ్యాప్తంగా బైక్‌లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కుర్రకారుకు బైకులంటే విపరీతమైన మోజు. చెప్పాలంటే కార్లకన్నా కూడా బైక్ డ్రైవింగ్‌ను ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ఇక స్పోర్ట్స్ బైకులపై ఓ రైడ్ వేస్తే వచ్చే కిక్కు చెప్పలేనిది. ఈ క్రమంలోనే ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ట్రయంఫ్ టైగర్ రయ్యమని దూసుకుపోయే బైకులను మార్కెట్‌లోకి తీసుకొస్తుటుంది.

- Advertisement -

ఈ ఏడాది కంపెనీ భారత మార్కెట్‌లోకి కొత్త బైక్‌ను లాంచ్ చేయనుంది. ఇటీవల కంపెనీ ఈ బైక్‌కు సంబంధంచిన రేంజ్‌ అప్‌డేట్ చేసింది. 2024 ట్రయంఫ్ టైగర్ 900 జీటి, 900 ర్యాలీ ప్రో బైకులను విడుదల చేయనుంది. టైగర్ రేంజ్‌లోని ఏ బైక్‌లను ట్రయంఫ్ అప్‌డేట్ చేసింది? వీటిని ఏ ధరకు కొనుగోలు చేయవచ్చు? తదితర విషయాల గురించి తెలుసుకోండి.

- Advertisement -
2024 Triumph Tiger
2024 Triumph Tiger

ట్రయంఫ్ 2024 టైగర్ 900 మోడల్‌లో బ్రేక్ అప్‌గ్రేడ్‌లు, బెటర్ మార్కర్ లైట్లను అందిస్తోంది. ఆఫ్ రోడ్, స్పోర్ట్, రెయిన్ మోడ్‌లతో బైక్‌ను డ్రైవ్ చేయొచ్చు. రైడర్ ప్రోగ్రామబుల్ మరియు ఆఫ్ రోడ్ ప్రో మోడ్ కూడా ర్యాలీ ప్రో వేరియంట్‌లో ఇవ్వబడింది. అప్‌డేట్‌లలో బైక్ సీటు కూడా రీ డిజైన్ చేశారు. రైడ్ సమయంలో మరింత సౌకర్యం కోసం వాటర్‌తో కొత్త హ్యాండిల్ బార్ కూడా ఇచ్చారు.

Also Read : రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఆరు కొత్త బైకులు.. ఫీచర్లు ఇవే!

రెండు బైక్‌ల లుక్స్‌లో కూడా మార్పులు చేశారు. ఇప్పుడు ఈ రెండు బైక్‌లు గతంలో కంటే అట్రాక్ట్, స్టైలిష్ బాడీని కలిగి ఉన్నాయి. ఇవి మూడు కలర్స్‌లో అందుబాటులో ఉంటాయి. బైక్‌లకు ఏడు అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. దీనితో మై ట్రయంఫ్ కనెక్టివిటీ సిస్టమ్, కార్నరింగ్ ABS ఇవ్వబడుతోంది.

టైగర్ 900 సిరీస్‌లో కంపెనీ మూడు సిలిండర్ల ఇంజిన్‌ను మెయిన్ అప్‌డేట్‌గా తీసుకొచ్చింది. దీని వల్ల 13 శాతం ఎక్కువ శక్తి ఇంజిన్‌కు లభిస్తుంది. ఈ ఇంజిన్ నుంచి బైక్‌లు గరిష్టంగా 108 PS శక్తిని అందిస్తాయి. ఇది కాకుండా.. ఈ ఇంజిన్ కారణంగా బైక్‌లు తొమ్మిది శాతం ఎక్కువ మైలేజీని అందిస్తాయి. రెండు బైక్‌లు 888 cc లిక్విడ్ కూల్డ్ 12 వాల్వ్ DOHC ఇంజిన్‌ను కలిగి ఉన్నాయి.

Also Read : 9 సీట్లతో మహీంద్రా నుంచి కొత్త ఎస్‌యూవీ లాంచ్!

ఇది 106.5 bhp, 90 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనితో పాటు బైక్‌లలో ఆరు స్పీడ్ ట్రాన్స్‌మిషన్ ఇవ్వబడ్డాయి. ర్యాలీ ప్రో వేరియంట్‌లో క్విక్ షిఫ్టర్ ఉంది. ట్రయంఫ్ 2024 టైగర్ 900 సిరీస్ GT వేరియంట్‌ను రూ. 13.95 లక్షల ఎక్స్ షోరూమ్ ధర కాగా.. Rally ప్రో వేరియంట్‌ను రూ. 15.95 లక్షల ఎక్స్ షోరూమ్ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News