BigTV English

Brahmanandam : బ్రహ్మానందంకు ఘోర అవమానం.. SKNపై మండిపడుతున్న ఫ్యాన్స్

Brahmanandam : బ్రహ్మానందంకు ఘోర అవమానం.. SKNపై మండిపడుతున్న ఫ్యాన్స్
Advertisement

Brahmanandam : సినిమా ఇండస్ట్రీలో బ్రహ్మానందంకి ఎంతటి గుర్తింపు ఉందో చెప్పనక్కర్లేదు. ఈయన్ని అందరూ కామెడీ బ్రహ్మా అని గొప్పగా, ప్రేమగా పిలుచుకుంటారు. అలాంటి బ్రహ్మానందం వెయ్యికి పైగా సినిమాల్లో నటించి స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే అలాంటి బ్రహ్మానందం ని నిర్మాత ఎస్కేఎన్ అవమానించారు. ఎస్కేఎన్ మాటలపై చాలామంది బ్రహ్మానందం ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.ఒక గౌరవ ప్రదమైన స్థానంలో ఉన్న నిర్మాత మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అంటూ మండి పడుతున్నారు. మరి ఇంతకీ ఎస్కేఎన్ మాట్లాడిన మాటలు ఏంటి? ఎందుకు బ్రహ్మానందం అభిమానులు ఆయనపై మండి పడుతున్నారు ? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..


ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ అంటే తెలియని వారు ఉండరు. అల్లు, మెగా ఫ్యామిలీకి సన్నిహితుడిగా ఉంటున్న ఎస్కేఎన్ పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే అలాంటి ఎస్కేఎన్ తాజాగా కిరణ్ అబ్బవరం నటించిన కే ర్యాంప్ మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. సక్సెస్ మీట్ లో పాల్గొంటే కచ్చితంగా సినిమా గురించి హీరో పడ్డ కష్టం గురించి, హీరోయిన్ గ్లామర్ గురించి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇలా ప్రతి ఒక్కరి గురించి పొగడాల్సి ఉంటుంది. అలా తాజాగా కే ర్యాంప్ సక్సెస్ మీట్ లో కిరణ్ అబ్బవరాన్ని పొగుడుతూ అందులోకి అల్లు అర్జున్, బ్రహ్మానందం ని కూడా లాగారు.

బ్రహ్మానందాన్ని అవమానించిన నిర్మాత..

అంతా బాగానే ఉన్నప్పటికీ బ్రహ్మానందాన్ని అవమానించేలా ఆయన మాట్లాడిన మాటలు మాత్రం చాలా మందికి నచ్చడం లేదు. ఆ సక్సెస్ మీట్ లో ఎస్ కే ఎన్ ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే చూద్దాం.. కిరణ్ అబ్బవరానికి ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేదు. కానీ ఆయన ఎక్కడ నిల్చొని ఉంటే అదే ఆయన బ్యాక్గ్రౌండ్.. అన్నా నేను సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేయాలి. అవి మంచి సినిమాలు అయితే చాలు అంటాడు. అంతేగానీ ఆ సినిమా అలా ఉండాలి.. ఇలా ఉండాలి ..కంఫర్ట్ గా ఉండాలని ఏ రోజు అడగడు. కిరణ్ లాంటి హీరోల గురించి చెప్పుకుంటే ఇలాంటి హీరోలు ఉండడం ఇండస్ట్రీకి ముఖ్యం. ఇలాంటి హీరోలు లేకనే ఇండస్ట్రీ వేరే లెవెల్ లో వెళ్తుంది. కానీ కిరణ్ అబ్బవరం లాంటి హీరోలు ఇండస్ట్రీకి చాలా ముఖ్యం.


ALSO READ:Dude Movie: ఒక్క సినిమాతో క్రష్ గా మారిన ఐశ్వర్య శర్మ.. బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్!

అసలేం జరిగిందంటే?

ఎందుకంటే కిరణ్ కాంబినేషన్లు చూసుకోవడం లేదు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ వస్తున్నాడా లేదా అని అడగడం లేదు. తన క్యారెక్టర్ ఏంటి అని కూడా అడగడు.కేవలం ఈ సినిమా వర్కౌట్ అవుతుందా ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తారా? ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మాత్రమే చూస్తాడు. ఇలాంటి ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ బాగుంటుందా లేదా అని చూసుకునే హీరోలు ఉన్నంతకాలం ఇండస్ట్రీ బాగుంటుంది. అల్లు అర్జున్ గారితో నేను చాలా సంవత్సరాల నుండి ట్రావెల్ చేస్తున్నాను. ఆయన నటించిన రేసుగుర్రం సినిమాలో చివర్లో బ్రహ్మానందం క్యారెక్టర్ ఉంటుంది. బ్రహ్మానందం క్యారెక్టర్ 15 నిమిషాలు ఉంటుందని చూసుకోలేదు. సినిమాకి అది వర్కౌట్ అవుతుందని మాత్రమే అల్లు అర్జున్ చూశారు.అందుకే ఆయన ఈరోజు మంచి పొజిషన్ లో ఉన్నారు అంటూ కామెంట్స్ చేశారు.

నిర్మాత పై ఫ్యాన్స్ మండిపాటు..

అయితే అంతా బాగానే ఉంది కానీ ఇందులో అల్లు అర్జున్ పక్కన గారు అని మెన్షన్ చేశారు. కానీ బ్రహ్మానందం లాంటి దిగ్గజ నటుడి పక్కన గారు అని మెన్షన్ చేయకుండానే బ్రహ్మానందం అని సాదాసీదా వ్యక్తి లాగే సంభోదిస్తూ మాట్లాడారు.ఇలా ఎస్కేఎన్ మాట్లాడిన మాటలు చాలామంది బ్రహ్మానందం అభిమానులకు నచ్చలేదు. బ్రహ్మానందం కంటే వయసులో, అనుభవంలో చిన్నవాడైన అల్లు అర్జున్ ని గారు అని సంబోధించి..అంత పెద్ద దిగ్గజ నటుడు అయినటువంటి బ్రహ్మానందం ని ఉత్తి బ్రహ్మానందం అని మాట్లాడడం ఆయన్ని అవమానించినట్లే అంటూ ఆయన ఫ్యాన్స్ మండి పడుతున్నారు. అంతేకాదు ఎస్కేఎన్ బ్రహ్మానందం గారికి క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి సోషల్ మీడియాలో ఎస్కేఎన్ పై వస్తున్న ఈ నెగెటివిటీ పై ఆయన ఏ విధంగా స్పందిస్తారు.. బ్రహ్మానందం కి క్షమాపణలు చెబుతారా? లేదా ? అనేది చూడాలి.

Related News

Prabhas Spirit :స్పిరిట్‌ మళ్లీ వాయిదా… తప్పు డార్లింగ్‌దా? సందీప్‌దా?

Nara Rohith: నారా వారింట మొదలైన పెళ్లి సందడి.. ఏ రోజు ఏం జరగనున్నాయంటే

Mass Jathara : ‘మాస్ జాతర’ స్టోరీని లీక్ చేసిన నిర్మాత.. మళ్లీ అదే చేస్తున్న నాగ వంశీ..

R Chandru: నా సినిమా స్ఫూర్తితోనే ఓజీ తీశారు.. డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్

Toxic: టాక్సిక్ నుంచి డైరెక్టర్ తప్పకుందా… అసలు ఏం జరుగుతుంది

Dude Movie: ఒక్క సినిమాతో క్రష్ గా మారిన ఐశ్వర్య శర్మ.. బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్!

Venkatesh : వెంకీకి జోడిగా స్టార్ హీరోయిన్… గురూజీ ప్లాన్ అదిరింది బాసూ..

Big Stories

×