Jabardast : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న టాప్ కామెడీ షో జబర్దస్త్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎంతోమంది కమెడియన్లు ఈ షో ద్వారా సినిమాలలో నటించే అవకాశాలను అందుకొని స్టార్ కమెడియన్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. కామెడీ షో మాత్రమే కాదు జబర్దస్త్ ని సినిమా ప్రమోషన్లకు కూడా వాడుకుంటుంటారు. ఈమధ్య కొత్త సినిమాలు రిలీజ్ అయితే అందులో నటించిన హీరో హీరోయిన్లు డైరెక్టర్లు ఈ షోలో సందడి చేస్తుంటారు. ప్రతివారం ఏదో ఒకటి గెస్ట్లుగా వస్తుంటారు. తాజాగా దీపావళి కానుకగా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ డ్యూడ్ యూనిట్ సందడి చేసింది.. ఈ సినిమా హీరో ప్రదీప్ రంగనాథన్, సినిమాలో కీలక పాత్రలో నటించిన శరత్ కుమార్ ఈ షోలో సందడి చేశారు. హీరో కేవలం గెస్ట్ గా రావడం మాత్రమే కాదు ఒక స్కిట్లో కూడా నటించడంతో ఈ షో పై ఆసక్తి నెలకొంది. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ను జబర్దస్త్ టీం రిలీజ్ చేశారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
జబర్దస్త్ షో ప్రతి వారం ప్రసారం అవుతుంది. ఈ షో కి తమ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి సినీ తారలు వస్తుంటారు. ఈ వరం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ కి డ్యూడ్ మూవీ యాక్టర్స్ హీరో ప్రదీప్ రంగనాథన్, నటుడు శరత్ కుమార్ గెస్ట్లుగా వచ్చారు. జబర్దస్త్ లో వేస్తున్న స్కిట్లను చూసి కడుపు బా నవ్వుకున్నారు. రాకింగ్ రాకేష్, చలాకి చంటి తమ స్కిట్లతో కడుపుబ్బా నవ్వించారు. బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో వర్ష కు అన్నయ్యగా ప్రదీప్ రంగనాథన్ చేశారు. హీరోకి తెలుగు రాకపోయినప్పటికీ తన పర్ఫామెన్స్ స్కిట్ కి హైలైట్ గా నిలిచింది. ఈ ఎపిసోడ్కి ఈ స్కిట్టే హైలెట్ అవబోతుందని తెలుస్తుంది. ప్రోమో మొత్తంలో డ్యూడ్ మూవీ గురించి కమెడియన్లు ప్రమోట్ చేస్తారు.. మొత్తానికి ప్రోమో అయితే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
Also Read :వెంకీకి జోడిగా స్టార్ హీరోయిన్… గురూజీ ప్లాన్ అదిరింది బాసూ..
అలాగే ప్రోమో చివర్లో హీరో ప్రదీప్ రంగనాథన్ తో కలిసి శాంతి స్వరూప్ అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్ చేస్తారు. అంతే కాదు శాంతి స్వరూప్ తమిళంలో మాట్లాడి హీరోని మెప్పిస్తాడు. మన జంట ఎలా ఉంది చాలా బాగుంది కదా అంటూ అతను అన్న మాటలకి ప్రదీప్ షాక్ అవుతాడు. శరత్ కుమార్ ని కూడా శాంతి స్వరూప్ మా జంట ఎలా ఉంది సార్ అని అడుగుతాడు. ఇక ఆయన కూడా చాలా బాగుంది అనడంతో ప్రదీప్ కి ఫ్యూజుల్ అవుట్ అయినట్టు అయిపోతాడు. ఇక చివర్లో ఆటో రాంప్రసాద్ శరత్ కుమార్ తో సర్ మీరు ఈ వయసులో కూడా ఇంత ఫిట్గా ఉంటున్నారంటే గ్రేట్.. ఇప్పటికీ మీ వయసు 40 ఏళ్లు అంటే చాలామంది నమ్ముతారేమో అని అంటారు.. లేదబ్బా 35 ఏళ్ల అని చివర్లో శరత్ కుమార్ పంచ్ వేస్తాడు. మొత్తానికి ప్రోమో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ ఎపిసోడ్ అంతకుమించి ఉండబోతుందని తెలుస్తుంది. ఈ గురువారం ప్రసారం కాబోతున్న ఈ ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా చూసేయండి..