R Chandru:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ఎన్ని రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుర్ర డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపించాడు. ఎన్నో అచనాల మధ్య సెప్టెంబర్ 25న రిలీజ్ అయిన ఓజీ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అని అభిమానులు చెప్పకు వచ్చారు. పవన్ అభిమానిగా సుజిత్ తన అభిమానాన్ని ఈ సినిమా ద్వారా నిరూపించుకున్నాడు. ఇక ఈ సినిమా దాదాపు 300 కోట్లకు పైనే వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. ఈ సినిమాపై అభిమానులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపించారు.
అయితే తాజాగా ఒక కన్నడ డైరెక్టర్ సినిమా తన సినిమా నుంచి స్ఫూర్తి పొంది తెరకెక్కించారని చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆ డైరెక్టర్ పేరు ఆర్ చంద్రు. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా నటించిన కబ్జా చిత్రానికి ఆర్ చంద్రు దర్శకత్వం వహించాడు. ఉపేంద్ర, శ్రీయ జంటగా సుదీప్, శివన్న లాంటి స్టార్ హీరోలందరూ నటించిన కబ్జా గతేడాది రిలీజ్ అయ్యి ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
కేజీఎఫ్ స్ఫూర్తితో కబ్జా సినిమాను తెరకెక్కించారని అందుకే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి .ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో చంద్రు.. కబ్జా సినిమా స్ఫూర్తితోనే ఓజీ సినిమాను తెరకెక్కించినట్లు చెప్పుకొచ్చాడు. ఒక గ్యాంగ్ స్టర్ జీవితంలో జరిగిన పరిణామాలను ఆధారంగా చేసుకొని కబ్జా సినిమా ఉంటుంది. సేమ్ ఓజీ కూడా అలాగే ఉండడంతో చంద్రు తన సినిమా నుంచే స్ఫూర్తి పొందినట్లు చెప్పుకొచ్చాడు.
ఇక ఆర్ చంద్రు వ్యాఖ్యలపై నెటిజన్స్ మండిపడుతున్నారు. కబ్జా ఎక్కడ.. ? ఓజీ ఎక్కడ.. ? యావరేజ్ సినిమాను ఎవరైనా స్ఫూర్తిగా తీసుకుంటారా.. ? గ్యాంగ్ స్టర్ ఒక్కటి కలిసింది అని అన్ని తన సినిమాల నుంచే తీసుకున్నారు అని అనుకోవడం అతని మూర్ఖత్వమని మండిపడుతున్నారు. రెండు సినిమాలు చూసి మాట్లాడాలని, నోటికి ఏది వస్తే అది మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మరి ఆర్ చంద్రు ఈ విషయాన్నీ గ్రహిస్తాడో లేదో చూడాలి.