BigTV English

Heart Attack: గుండె పోటు ప్రమాదాన్ని తగ్గించే.. అలవాట్లు ఏంటో తెలుసా ?

Heart Attack: గుండె పోటు ప్రమాదాన్ని తగ్గించే.. అలవాట్లు  ఏంటో తెలుసా ?
Advertisement

Heart Attack: ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో గుండెపోటు అనేది చాలా సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా.. యువతలో కూడా దీని ప్రమాదం పెరుగుతోంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటివి గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. గుండెపోటు అనేది గుండెకు రక్త ప్రవాహం ఆగిపోయినప్పుడు సంభవించే ప్రాణాంతక వైద్య అత్యవసర పరిస్థితి. అయితే.. మన రోజువారీ జీవితంలో కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా.. ఈ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.


1. ఆరోగ్యకరమైన ఆహారం: గుండె ఆరోగ్యానికి సరైన ఆహారం చాలా ముఖ్యం. ధమనులలో కొవ్వు పేరుకుపోకుండా (కొలెస్ట్రాల్) ఉండాలంటే.. సమతుల్య ఆహారం తీసుకోవాలి.

చేర్చాల్సినవి: పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్లు, బాదం, వాల్‌నట్స్ వంటి గింజలు, చియా గింజలు వంటివి గుండెకు మేలు చేస్తాయి. స్ట్రాబెర్రీలు, దానిమ్మ, టమాటో వంటి వాటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్త నాళాలను శుభ్రంగా ఉంచుతాయి.


తగ్గించాల్సినవి: అధిక ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వులు, ట్రాన్స్‌ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్, డీప్ ఫ్రై చేసిన ఆహారాలు, రెడ్ మీట్ వంటి వాటిని తగ్గించాలి. ముఖ్యంగా అధిక ఉప్పు రక్తపోటును పెంచి గుండెపై ఒత్తిడిని పెంచుతుంది.

2. క్రమం తప్పకుండా వ్యాయామం: శారీరక శ్రమ లేకపోవడం గుండెపోటుకు ప్రధాన కారణాలలో ఒకటి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వేగవంతమైన వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, యోగా లేదా డ్యాన్సింగ్ వంటివి చేయడం చాలా అవసరం. వ్యాయామం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. అంతే కాకుండా ఇది గుండె కండరాలను బలోపేతం చేస్తుంది. భోజనం చేసిన తర్వాత 10-15 నిమిషాల వాకింగ్‌తో కూడా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

3. చెడు అలవాట్లకు దూరం: ధూమపానం, మద్యపానం వంటివి గుండెకు అత్యంత హానికరం. ధూమపానం గుండె ధమనులు కుంచించుకుపోయేలా చేసి.. గుండెపోటు ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ అలవాట్లను పూర్తిగా మానుకోవడం గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మొదటి మెట్టు.

4. బరువు నియంత్రణ: అధిక బరువు లేదా ఊబకాయం రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం వంటి గుండెపోటు ప్రమాద కారకాలను పెంచుతుంది. సమతుల్య ఆహారం.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. కొద్దిగా బరువు తగ్గినా గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది.

5. ఒత్తిడి నిర్వహణ, నిద్ర: నిరంతర ఒత్తిడి , కార్టిసాల్ స్థాయిలను పెంచి, రక్తపోటు, గుండె జబ్బులకు కారణమవుతుంది. ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు, యోగా వంటి వాటితో ఒత్తిడిని తగ్గించుకోవాలి. అలాగే.. ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. మంచి నిద్ర గుండె సమస్యలు.. ఒత్తిడిని దూరం చేస్తుంది.

6. కొలెస్ట్రాల్, బీపీ నియంత్రణ: చెడు కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, మధుమేహం వంటివి గుండెకు ముప్పును పెంచుతాయి. వీటి స్థాయిలను ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ.. డాక్టర్  సలహా మేరకు మందులు వాడడం, ఉప్పు తక్కువగా తీసుకోవడం వంటివి తప్పనిసరి.

Related News

Boiled Peanuts Benefits: ఉడకబెట్టిన వేరుశనగలు తింటున్నారా? మీ ఆరోగ్యం ఇలా మారిపోతుంది..

Jeera water vs Chia seeds: జీరా వాటర్, చియా సీడ్స్.. బరువు తగ్గేందుకు ఏది బెస్ట్ అంటే?

Neck Pain: మెడ నొప్పి తగ్గాలంటే .. ఎలాంటి టిప్స్ పాటించాలి ?

Beauty Secret: అమ్మాయిలు ఈ సీక్రెట్ మీకోసమే.. ఇది తింటే మెరిసే చర్మం మీ సొంతం

Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయ్ !

Coconut Oil: కొబ్బరి నూనెను ఇలా కూడా వాడొచ్చా? ఇన్నాళ్లు తేలియలేదే ?

Karpooram: చిటికెడు పచ్చ కర్పూరం.. జీర్ణ సమస్యల నుండి కీళ్ల నొప్పుల వరకు ఉపశమనం

Big Stories

×