చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం OnePlus నెక్ట్స్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ OnePlus 15ను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ డిజైన్, పనితీరు, బ్యాటరీ మరింత అప్ గ్రేడ్ వెర్షన్ లో రానున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ ఫోన్ Samsung Galaxy S26 Ultra హోరిజోన్ లో ఉన్నప్పటికీ.. Samsung Galaxy S25 Ultraతో పోటీపడే అకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లలో ఎలాంటి తేడాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
OnePlus 15 ఫ్లాట్ ఫ్రంట్, బ్యాక్ ప్యానెల్స్, ఫ్లాట్ ఫ్రేమ్, Google Pixel ఫోల్డ్ సిరీస్ ను గుర్తుచేసే తయారయ్యింది. వెనుక కెమెరా మాడ్యూల్ విషయంలో కొత్త డిజైన్ కలిగి ఉంటుంది. ఏరోస్పేస్ గ్రేడ్ నానో సిరామిక్ మెటల్ ను ఉపయోగించి తయారు చేసినట్లు తెలుస్తోంది. ఇక Samsung Galaxy S25 Ultra రౌండ్ కార్నర్స్, ఫ్లాట్ ఫ్రంట్, బ్యాక్ ప్యానెల్ లతో కూడిన టైటానియం ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. ఇందులో Samsung ఫ్లాగ్ షిప్ ప్రత్యేక లక్షణం అయిన S పెన్ ఉంది. S25 Ultra IP68 వాటర్, డస్ట్ రెసిస్టెంన్స్ రేటింగ్‌ను కలిగి ఉండగా, OnePlus 15 IP69 సర్టిఫికేషన్ ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
రెండు స్మార్ట్ ఫోన్ల మధ్య కలర్ సెలెక్షన్ కూడా డిఫరెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. OnePlus 15 పర్పుల్, టైటానియం, నలుపు రంగులలో అందుబాటులో ఉంటుంది. అఉట Samsung Galaxy S25 Ultra టైటానియం సిల్వర్ బ్లూ, టైటానియం బ్లాక్, టైటానియం వైట్ సిల్వర్, టైటానియం గ్రే రంగులలో వస్తుంది.
OnePlus 15 BOE తయారు చేసిన 6.78 ఇంచుల డిస్ ప్లేను కలిగి ఉంటుంది. సన్నని బెజెల్స్, 1.5K రిజల్యూషన్ తో ఉంటుంది. ఈ ప్యానెల్ 1–165Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ వరకు సాధారణ బ్రైట్ నెస్ కు సపోర్ట్ చేస్తుంది. Samsung Galaxy S25 Ultra 6.9-అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్ ప్లే ను కలిగి ఉంది. ఇది 2,600 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ను కలిగి ఉంటుంది. దీని 1–120Hz రిఫ్రెష్ రేట్, యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ ఎక్కువ లైటింగ్ లోనూ చక్కటి విజువల్స్ ఎఫెక్ట్ ను కలిగి ఉంటుంది.
హుడ్ కింద Samsung Galaxy S25 Ultra స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్ ద్వారా పవర్ ను తీసుకుంటుంది. ఇది Samsung డివైజెస్ కోసం ఆప్టిమైజ్ చేయబడింది. అదే సమయంలో, OnePlus 15 స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ద్వారా పవర్ ను తీసుకుంటుంది. ఇది ప్రామాణిక 8 ఎలైట్ కంటే ఎక్కువ పనితీరును అందిస్తుంది. RAM, స్టోరేజ్ కూడా భిన్నంగా ఉంటాయి. OnePlus 15 16GB RAMని కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే Galaxy S25 Ultra 12GBతో వస్తుంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు 256GB నుంచి ప్రారంభమయ్యే స్టోరేజీలను కలిగి ఉన్నాయి. 512GB, 1TB వేరియంట్లలోనూ అందుబాటులో ఉన్నాయి. రెండు ఫోన్‌లు Android 16 తో నడుస్తాయి. Galaxy One UI 8.5, OnePlus OxygenOS 16 రన్ అవుతుంది. Samsung 7 సంవత్సరాల సాఫ్ట్ వేర్ సపోర్ట్ ను అందిస్తుండగా, OnePlus కనీసం నాలుగు సంవత్సరాల సపోర్ట్ అందిస్తుంది.
OnePlus 15 ట్రిపుల్ 50MP కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో 3.5X టెలిఫోటో లెన్స్ ఉంటుంది. Galaxy S25 Ultra 200MP ప్రధాన సెన్సార్, 50MP అల్ట్రావైడ్, 10MP 3X టెలిఫోటో, 50MP 5X పెరిస్కోప్‌తో సహా క్వాడ్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. వన్ ప్లస్ తో పోల్చితే Samsung సెటప్ బలమైనదిగా గుర్తింపు పొందింది.
Read Also: జియో దీపావళి ఆఫర్, జస్ట్ రూ. 199కే అన్ లిమిటెడ్ కాల్స్, 5G డేటా, ఎన్ని రోజులంటే?