E-Paper
Advertisement

Vikram: సినిమా కోసం.. చచ్చిపోతావా అన్నా.. నీ డెడికేషన్ కి హాట్సాఫ్

Vikram: సినిమా కోసం.. చచ్చిపోతావా అన్నా.. నీ డెడికేషన్ కి హాట్సాఫ్
Advertisement

Vikram: సినిమా హీరోలకు ఏంటి కోట్లు కోట్లు సంపాదిస్తారు.. వారు ఏదైనా చేసేస్తారు.. ? జస్ట్ అలా కనిపించి ఇలా వెళ్ళిపోతారు.. ? ఇదే హీరోల గురించి బయట జనాలు అనుకొనే మాటలు. కానీ, ఆ కోట్లు తీసుకోవడం వెనుక ఉన్న కష్టం, డెడికేషన్ వాళ్లకు మాత్రమే తెలుస్తోంది. ఒక్కో సినిమా కోసం వాళ్లు పడే కష్టం చూస్తే .. సినిమా కోసం వీళ్లు చచ్చిపోతారా.. ? అనే అనుమానం కూడా వస్తుంది. ఇక అలాంటి హీరోల లిస్ట్ లో టాప్ 5 లో ఉంటాడు విక్రమ్.

చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోగా మారిన విక్రమ్.. వైవిధ్యమైన కథలను ఎంచుకొని చియాన్ విక్రమ్ గా మారాడు. ఒక సినిమా విక్రమ్ చేస్తున్నాడు అంటే అందులో అతని లుక్, పాత్ర ఎంత కష్టమైనా అసలు వెనక్కి తగ్గడు. అమ్మాయిగా చేయాలి అంటే మొహమాటం కూడా లేకుండా చేస్తాడు.. హెయిర్ పెంచమన్నా.. బాడీ పెంచమన్నా.. బాడీ తగ్గించమన్న కాదనకుండా పాత్రకు తగ్గట్టు మారిపోతాడు. తాజాగా తంగలాన్ సినిమా కోసం విక్రమ్ పడిన కష్టం అంతా ఇంతా కావు. పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.

Advertisement

ఇక ఈ సినిమా కోసం విక్రమ్ బరువు తగ్గాడు. నేడు విక్రమ్ బర్త్ డే సందర్భంగా ఈ లుక్ కోసం విక్రమ్ ఎంత కష్టపడ్డాడు అనేది ఒక మేకింగ్ వీడియో ద్వారా మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో విక్రమ్ పూర్తిగా బక్కచిక్కి కనిపించాడు. వేషం, భాష అన్ని మార్చేసి.. ఒళ్లంతా బురద పూసుకొని ఎంతో కష్టపడ్డాడు. ఈ వీడియో చూసిన అభిమానులు సినిమా కోసం.. చచ్చిపోతావా అన్నా.. నీ డెడికేషన్ కి హాట్సాఫ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో విక్రమ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×