BigTV English

TVS iQube ST Delivery Starts: టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ డెలివరీలు స్టార్ట్.. వారికి రూ.10,000 బోనస్.. దేశంలోనే అతి పెద్ద బ్యాటరీ ఆప్షన్‌ దీని సొంతం!

TVS iQube ST Delivery Starts: టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ డెలివరీలు స్టార్ట్.. వారికి రూ.10,000 బోనస్.. దేశంలోనే అతి పెద్ద బ్యాటరీ ఆప్షన్‌ దీని సొంతం!

TVS iQube ST Top Variant Delivery Starts Rs 10K Loyalty Discount: ప్రముఖ టూ వీలర్ తయారీ కంపెనీ టీవీఎస్‌కు మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈ కంపెనీ తన టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టీ వేరియంట్‌ను ఆవిష్కరించిన రెండేళ్ల తర్వాత ఇప్పుడు డెలివరీలను ప్రారంభించింది. ఈ ఐక్యూబ్ సిరీస్‌లలో ఎస్టీ వేరియంట్ టాప్‌లో ఉంది. ఇది అన్ని ఐక్యూబ్ వేరియంట్ల కంటే ఎక్కువ పరిధిని అందిస్తుంది. అయితే ఈ స్కూటర్‌ను కొనుగోలు చేసే వారికి టీవీఎస్ కంపెనీ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. జూలై 15,2022 లోపు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది.


ఇందులో భాగంగానే మొదటి 100 మంది కస్టమర్లకు రూ.10000 లాయల్టీ బోనస్ అందిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అప్పుడు దీన్ని బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు ఇదొక శుభవార్త అని చెప్పాలి. ప్రస్తుతం టీవీఎస్ కంపెనీ ఈ ఐక్యూబ్ ఈవీలను దేశ వ్యాప్తంగా విక్రయిస్తుంది. కాగా భారతదేశంలో టీవీఎస్ నుంచి వచ్చిన ఏకైక ఎలక్ట్రిక్ టూ వీలర్ వెహికల్ ఇది. ఇది భారత మార్కెట్‌లో ఎక్కువగా సేల్ అవుతున్న ఈవీలలో టాప్ ప్లేస్‌లో ఉంది.

తాజాగా రిలీజ్ అయిన స్కూటర్‌తో ఈ కంపెనీ సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎస్టీ వేరియంట్‌ను టీవీఎస్ కంపెనీ అత్యద్భుతమైన అప్‌డేట్‌లతో తీసుకువచ్చింది. ఈ తాజా స్కూటర్‌తో టీవీఎస్ మొత్తం 5 వేరియంట్‌లలో లభిస్తుంది. TVS iQube (2.2 kWh), TVS iQube (3.4 kWh), TVS iQube S (3.4 kWh), TVS iQube ST (3.4 kWh), TVS iQube ST (5.1 kWh) వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ హై ఎండ్ ఐక్యూబ్ ఎస్టీ వేరియంట్ రెండు బ్యాటరీ సామర్థ్యాలు కలిగిన ఆప్షన్లలో లభిస్తుంది. ఐక్యూబ్ ST వేరియంట్‌లోని 5.1 కిలో వాట్ల బ్యాటరీ ప్యాక్ భారత్‌లోనే అతిపెద్ద బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌గా అందుబాటులో ఉంది.


Also Read: బడ్జెట్ ధరలో టీవీఎస్ క్యూబ్ నుంచి మరో మూడు కొత్త వేరియంట్లు.. ఫీచర్లు మాత్రం అదుర్స్..!

TVS iQube 2.2 kWh వేరియంట్ రూ.97,307గా కంపెనీ నిర్ణయించింది. TVS iQube 3.4 kWh వేరియంట్‌ను రూ.1.19 లక్షలుగా నిర్ణయించింది. TVS iQube S 3.4 kWh వేరియంట్ రూ.1.29 లక్షలుగా ఉంది. TVS iQube ST 3.4 kWh వేరియంట్ రూ.1.56 లక్షలుగా నిర్ణయించబడింది. అలాగే దీని టాప్ లెవెల్ వేరియంట్ TVS iQube ST 5.1 kWh రూ.1.86 లక్షలుగా ఉంది. అయితే ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలే. కాగా ఈ టాప్ లెవెల్ వేరియంట్ iQube ST 5.1 kWhను ఒక్క సారి ఛార్జింగ్ పెడితే 150 కి.మీ పరుగులు పెడుతుంది.

అలాగే S 3.4 kWh వేరియంట్‌ ఒక్క ఛార్జింగ్‌తో 100 కి.మీ మైలేజీ ఇస్తుంది. ఇందులో మరెన్నో ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. సైడ్ స్టాండ్ ఇండికేషన్, పార్క్ అసిస్ట్, మ్యూజిక్ కంట్రోల్, యాంటీ థెఫ్ట్ టెక్నాలజీతో సహా మరెన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.

Tags

Related News

E20 Petrol: E20 పెట్రోల్ అంటే ఏంటి? దానివల్ల వాహనాలకు లాభమా? నష్టమా?

Income Tax Bill: ఇన్ కమ్ ట్యాక్స్ బిల్-2025 మనకు ఒరిగేదేంటి? తరిగేదేంటి?

Minimum Balance Account: బ్యాంకు మినిమమ్ బ్యాలెన్స్ కొత్త నియమాలు.. పెనాల్టీ తప్పదా?

Trump On Gold: దిగొచ్చిన పసిడి.. ‘బంగారు’ మాట చెప్పిన ట్రంప్, ఏమన్నారు?

PM-KMY Scheme: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ స్కీంలో నెలకు రూ. 55 కడితే చాలు..ఉద్యోగం చేయకపోయినా పెన్షన్ గ్యారంటీ..

BSNLలో 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్ ఇవే…ఏకంగా 600 జీబీ డేటా పొందే ఛాన్స్…ఎంత రీచార్జ్ చేయాలంటే..?

Big Stories

×