Rashmika:కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి రష్మిక మందన్న (Rashmika Mandanna) తెలుగులో వరుస సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ అందుకుంది. ముఖ్యంగా నేషనల్ క్రష్ గా పేరు దక్కించుకున్న ఈమె.. ఇప్పుడు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అంటూ భాషతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా గోల్డెన్ లెగ్ అని నిరూపించుకున్న రష్మిక.. ప్రతి సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటున్న విషయం తెలిసిందే.
ఇకపోతే సినిమాల ద్వారా భారీ సక్సెస్ అందుకున్న ఈమె వ్యక్తిగతంగా గత కొంతకాలంగా రూమర్లు ఎదుర్కొంటోంది. ఇదిలా ఉండగా మరోవైపు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తో రిలేషన్ లో ఉన్న ఈమె.. ఎట్టకేలకు ఇటీవల నిశ్చితార్థం చేసుకొని ఒక అడుగు ముందుకు వేసిన విషయం తెలిసిందే. అయినా సరే ఈమె పాత జ్ఞాపకాలు ఈమెను వెంటాడుతూనే ఉన్నాయి. విషయంలోకి వెళ్తే.. ఈమె కన్నడ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొత్తలో తన తొలి చిత్రం ‘కిరిక్ పార్టీ’ హీరో రక్షిత్ శెట్టి (Rakshith Shetty) తో ప్రేమలో పడి నిశ్చితార్థం కూడా చేసుకుంది. కానీ కొన్ని కారణాలవల్ల ఆ నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకోవడం గమనార్హం. ఇక అప్పటినుంచి వ్యక్తిగతంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొంటుంది ఈ ముద్దుగుమ్మ. కానీ దీనిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
ఇప్పుడు తాజాగా అసలు బ్రేకప్ వెనుక కారణాలు చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం రష్మిక వరుస పెట్టి సినిమాలను ప్రకటిస్తూ.. ఇటు విడుదల చేస్తూ బిజీగా మారిపోయిన ఈమె.. అందులో భాగంగానే ఈరోజు ఆయుష్మాన్ ఖురానా (Ayushman Khurana) తో కలిసి నటించిన థామా సినిమా థియేటర్లలోకి వచ్చింది. మరొకవైపు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా కూడా నవంబర్లో విడుదల కాబోతోంది.
ALSO READ:Annapurne Sadhapurne: ఘనంగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్.. అతిథులు వీరే
ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న రష్మిక.. బ్రేకప్ గురించి మాట్లాడుతూ.. “రిలేషన్ షిప్ బ్రేకప్ అయితే ఆ బాధ అమ్మాయిలకే ఎక్కువగా ఉంటుంది అంటూ తెలిపింది. అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలే ఎక్కువ బాధపడతారనే ప్రచారాన్ని నేను అంగీకరించను. బాధను వ్యక్తపరిచేందుకు మేము మీలాగా గడ్డం పెంచలేము.. మందు తాగలేము.. లోలోపల అమ్మాయిలకే బాధ ఎక్కువగా ఉంటుంది. కానీ బయటకు చూపించలేరు” అంటూ రష్మిక కామెంట్లు చేసింది.
ఇకపోతే రష్మిక చేసిన ఈ కామెంట్లు తన మొదటి బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ గురించే అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా రక్షిత్ శెట్టి నుండి విడిపోయినప్పుడు తాను కూడా నరకం అనుభవించానని.. అయితే ఆ బాధను బయటకు వ్యక్తపరచలేదు అంటూ ఇండైరెక్టుగా కామెంట్లు చేసింది రష్మిక. ప్రస్తుతం రష్మిక చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
రష్మిక సినిమాల విషయానికి వస్తే మైసా, కాంచన 4 , రెయిన్బో వంటి చిత్రాలను లైన్ లో ఉంచింది ఈ ముద్దుగుమ్మ.