Emmanuel vs Thanuja:బిగ్ బాస్.. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మళ్లీ కొత్త సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 9వ సీజన్ చాలా గ్రాండ్గా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో ఆరు వారాలు పూర్తికాగా.. ఏడవ వారం కూడా మొదలయ్యింది. ముఖ్యంగా వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎవరి స్వభావం ఎలాంటిదో అన్ని బట్టబయలు అవుతున్నాయని చెప్పవచ్చు. మొన్నటి వరకు ప్రేమ పక్షుల్లా తిరిగిన తనూజ (Thanuja ) ఇమ్మానుయేల్ (Emmanuel) మధ్య కూడా ఇప్పుడు గొడవ జరగడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ముఖ్యంగా కళ్యాణ్ తనూజను నామినేట్ చేయడానికి తన వద్ద పాయింట్స్ ఉన్నాయని చెప్పినప్పుడు.. ఇమ్మానుయేల్ ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అనే విషయంపై బాధ పడిపోయిన తనూజ.. చేసిన కామెంట్స్ కి.. “ఇది సార్ మీ అసలు రంగు.. ఇప్పటివరకు మీరు చేసిందంతా నాటకమేనా?” అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
తాజా ఎపిసోడ్లో “స్వీట్ పాయిజన్ అంటారు చూడు.. అది నువ్వే ” అంటూ ఇమ్మానుయేల్ తో తనూజ మాట్లాడుతూ గొడవ పడడం స్టార్ట్ చేసింది. అటు ఇమ్మానుయేల్ కూడా ఆ స్వీట్ పాయిజన్ నేను కాదు నువ్వు అంటూ ఆయన కూడా ఏం తగ్గలేదు. ఇటీవల కొంతమంది ఇమ్మానుయేల్ తో తనూజ సీరియల్ యాక్టింగ్ లా అనిపిస్తోంది కదా అని అడిగితే.. అవును నాకు కూడా సీరియల్ యాక్టింగ్ లాగే ఎక్కడో కొడుతోంది అంటూ వాళ్లతో చెప్పాడు. ఇది అసలు యాక్టింగ్ కాదా అని తనూజ ప్రశ్నించగా .. ఇమ్మానుయేల్ ప్లేట్ మారుస్తూ అవును నాన్న నాన్న అని మాట్లాడడం అది సీరియల్ యాక్టింగ్ కాదా అంటూ తనలో ఉన్న స్వార్ధాన్ని బయటపెట్టాడు.
వీరిద్దరి బంధానికి సీరియల్ అని పేరు పెట్టాలని నేనే చెప్పాను. అని ఇమ్మానుయేల్ చెబుతుండగానే.. తనూజ ముందు ఒకలాగా వెనక ఒకలాగా మాట్లాడతారు.. నేనేమో గుడ్డిగా నమ్మేసాను అని ఆమె తన బాధను ఎక్స్ప్రెస్ చేస్తుండగానే.. ఇమ్మానుయేల్ నీలాగా యాక్టింగ్ నాకు రాదు అంటూ కామెంట్లు చేశారు. ఇకపోతే నామినేషన్స్ లో భాగంగానే వీరిద్దరి మధ్య గొడవ మొదలైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ వారం వెళ్లిపోకుండా ఇక్కడే హౌస్ లో ఉంటే ఈ వారం నామినేట్ చేసుకోండి అని తనూజ అనడం.. ఇమ్మానుయేల్ కూడా నన్ను కూడా నామినేట్ చేసుకో అని చెప్పడం కాస్త వ్యతిరేకతను తెలియజేస్తోంది.
ALSO READ:Rashmika: బ్రేకప్ పై తొలిసారి స్పందించిన రష్మిక.. నరకం అనుభవించానంటూ?
మొత్తం చెప్పినా వినని ఒక పర్సన్ పదినిమిషాల్లో నిర్ణయం తీసుకుంది అంటే ఇది సేఫ్ గేమ్ అనిపిస్తుంది కదా అంటూ ఇమ్మానుయేల్ తన వెర్షన్ వినిపించారు. వారం మొత్తం అన్ని గేమ్స్ లో నీకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చాను. కానీ ఇతడు నా గురించి స్టాండ్ తీసుకోడు అని అంటే నాకు బాధ అనిపించదా అంటూ తెలిపాడు. అందుకే ఇలాంటి పర్సన్ కోసం ఎందుకు స్టాండ్ తీసుకోవాలి అనిపించింది నాకు అంటూ ఇమ్మానియేల్ తన బాధను వ్యక్తపరిచారు. మొత్తానికైతే ఇన్ని రోజులు ప్రేమ పక్షులుగా.. హౌస్ లో మంచి ఎంటర్టైన్మెంట్ అందించిన ఈ ఇద్దరి మధ్య గొడవలు ఊహించని ట్విస్ట్ అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.. ఇంకొంతమంది ఇదే అసలైన రణరంగం అంటూ కూడా కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం.