Hyderabad News: విధి నిర్వహణలో వీర మరణం పొందిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. వారి కుటుంబానికి కోటి పరిహారం, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. అలాగే 300 గజాల స్థలం అందిస్తామని తెలిపారు. పోలీస్ భద్రత సంక్షేమం నుంచి రూ. 16 లక్షలు, పోలీస్ వెల్ఫేర్ నుంచి రూ.8 లక్షల పరిహారం చెల్లిస్తామన్నారు.
కానిస్టేబుల్ ప్రమోద్ ఫ్యామిలీకి ప్రభుత్వం అండ
దేశంలో తెలంగాణ పోలీస్ అగ్రగామిగా నిలబడడం గర్వంగా ఉందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. తీవ్రవాదం, సైబర్ నేరాలు, మాదక ద్రావ్యాలు రాష్టంలో పెరగకుండా అదుపులోకి తీసుకురావడంలో పోలీస్ శాఖ కృషి బాగుందన్నారు. డ్రగ్స్ నిర్ములన కోసం ‘ఈగల్’ను ఏర్పాటు చేస్తామన్నారు. నేటి ప్రపంచంలో సైబర్ నేరాలు, డిజిటల్ నేరాలు పెద్ద సవాల్‌గా మారుతున్నాయని అన్నారు.
గోషామహల్ పోలీసు గ్రౌండ్స్ లో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, సాంకేతికతతో నేరాలను అదుపు చెయ్యడంలో తెలంగాణ పోలీస్ శాఖ బెస్ట్ గా నిలిచిందన్నారు. 33 మంది పోలీసుల కుటుంబానికి గాజుల రామారంలో స్థలాన్ని కేటాయించామని తెలిపారు. మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలని అన్నారు.
దేశంలో అగ్రగామిగా తెలంగాణ
ఇటీవల చాలామంది మావోయిస్టులు లొంగిపోయారని, అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలని సూచన చేశారు. అంతేకాదు వారు దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వారి వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలన్నారు. మావోయిస్టు కార్యకలాపాలు కట్టడి చెయ్యడంలో పోలీసుల పనితీరు మరచిపోలేమని వివరించారు.
మహిళ ఐపీఎస్‌లు అనేక విభాగాల్లో పని చేసేలా చూస్తున్నామన్నారు. పోలీసుల సంక్షేమం కోసం మా ప్రభుత్వం నిబద్దతతో పని చేస్తుందన్నారు. పోలీస్ నియామకాలకు పెద్ద పీఠ వేస్తుందని గుర్తు చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు కుటుంబాలకు దేశంలో ఎక్కడ లేని విధంగా బెనిఫిట్స్ అందిస్తున్నట్లు తెలియజేశారు.
ALSO READ: పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన గోడౌన్
అంతేకాదు పోలీసుల పిల్లల విద్యకు రంగారెడ్డి జిల్లా మంచి రేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రారంభించామని వివరించారు. క్రీడాకారులకు పోలీస్ ఉద్యోగాలు ఇస్తున్నామని, పోలీసు శాఖ ఇదే పని తీరును కొనసాగించాలన్నారు. అటు డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడారు. విధి నిర్వహణలో ప్రాణ త్యాగానికి వెనుకంజ వేయరని పోలీసులు నిరూపించారని అన్నారు. బేసిక్, ఫెయిర్ పోలీసింగ్‌తో విధి నిర్వాహణ కొనసాగించాలన్నారు.
దేశంలో శాంతిభద్రతలు నిర్వాహణలో మంచి గుర్తింపు వచ్చిందన్నారు. నివాళులు అర్పించిన మాత్రాన కాదని, వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందినప్పుడే అసలైన నివాళులు అర్పించినట్లు అవుతుందన్నారు. 1959లో జరిగిన ఘటనలో 191 మంది మరణం పొందిన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ అమరవీరుల దినోత్సవం జరుగుతోందన్నారు.
విధి నిర్వహణలో వీర మరణం పొందిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: సీఎం రేవంత్ రెడ్డి
రూ.కోటి పరిహారం, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల స్థలం అందిస్తాం
పోలీస్ భద్రత సంక్షేమం నుంచి రూ.16 లక్షలు, పోలీస్ వెల్ఫేర్ నుంచి రూ.8 లక్షల పరిహారం… pic.twitter.com/AbP62sHY6y
— BIG TV Breaking News (@bigtvtelugu) October 21, 2025