BigTV English

TVS Jupiter 110 Facelift: జూపిటర్ నుంచి కొత్త స్కూటీ.. కాలేజీ పోరగాళ్లకు పర్ఫెక్ట్ బండి ఇది!

TVS Jupiter 110 Facelift: జూపిటర్ నుంచి కొత్త స్కూటీ.. కాలేజీ పోరగాళ్లకు పర్ఫెక్ట్ బండి ఇది!

TVS Jupiter 110 Facelift: టీవీఎస్ మోటార్ కంపెనీ భారత మార్కెట్‌లోకి అప్‌డేటెడ్ జూపిటర్ 110ని విడుదల చేయాలని చూస్తోంది. ఇప్పటికే టెస్టింగ్ సమయంలో కనిపించింది. టీవీఎస్ జూపిటర్ 110 ప్రస్తుతం మోడల్ కంటే చాలా స్పోర్టియర్‌గా ఉంటుంది. ఇందులో కొత్త లుక్‌తో టెయిల్ ల్యాంప్ ఉంటుంది. బ్రేకింగ్ కోసం ఇది ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది. టాప్-స్పెక్ వేరియంట్  డిస్క్ బ్రేక్‌లతో రావచ్చు. ప్రస్తుత జూపిటర్ 110 ప్రారంభ ధర రూ.73340గా ఉంది.


జూపిటర్ 110 డిజైన్ గురించి చెప్పాలంటే చాలా కొత్త అప్‌డేట్ టెయిల్ ల్యాంప్ ఉండొచ్చు. స్కూటర్ విజువల్ అప్పీల్‌ని బెటర్ చేయడానికి TVS LED సెటప్‌ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా కంపెనీ కొత్త TVS జూపిటర్ 110 కోసం డిఫరెంట్ కలర్ వేరియంట్లను తీసుకురానుంది. హార్డ్‌వేర్‌లో ఎటువంటి మార్పు ఉండదు. ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక మోనోషాక్ యూనిట్ సస్పెన్షన్ ఉంటాయి.

Also Read: సిట్రోయెన్ నుంచి అదిరిపోయే SUV.. లాంచ్ ఎప్పుడంటే?


బ్రేకింగ్ కోసం ఇది ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి. టాప్-స్పెక్ వేరియంట్ డిస్క్ బ్రేక్‌ల ఆప్షన్‌తో వస్తుంది. అప్‌డేట్ చేయబడిన TVS జూపిటర్ 110 109.7cc ఎయిర్-కూల్డ్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది గరిష్టంగా 7.77 bhp పవర్, 8.8 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లింక్ అయి ఉంటుంది.

ప్రస్తుత జూపిటర్ 110 స్కూటర్‌లో ముందు భాగంలో USB ఛార్జింగ్ పోర్ట్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ (ZX వేరియంట్‌లో అందుబాటులో ఉంది). TVS SmartXonnect టెక్నాలజీ, ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్, ఎస్‌ఎమ్‌ఎస్ అలర్ట్, వాయిస్ నావిగేషన్‌ను అందిస్తుంది.

Also Read: అగ్రస్థానంలో మారుతి ఎర్టిగా.. బెస్ట్ సెల్లింగ్ ఎమ్‌విపిగా రికార్డ్.. ఫీచర్లు, ధర ఇవే!

ప్రస్తుత జనరేషన్ TVS జూపిటర్ 110 డిజైన్‌లో కొన్ని మార్పులు ఉంటాయి. ఈ స్కూటర్ భారత మార్కెట్‌లో హోండా యాక్టివా 6Gకి పోటీగా ఉంది. కొత్త జూపిటర్ 110తో ఈ స్కూటర్ సెగ్మెంట్‌లో TVS తన మార్కెట్ వాటాను పెంచుకుంటుంది. జూపిటర్ 110 ప్రారంభ ధర రూ. 73,340  డిజైన్ అప్‌గ్రేడ్‌లు, కొత్త కలర్ ఆప్షన్‌ల దృష్ట్యా అప్‌డేట్ చేయబడిన TVS జూపిటర్ 110 స్కూటర్ ప్రస్తుత మోడల్ కంటే కొంచెం ధర ఎక్కువగా ఉంటుంది.

Tags

Related News

BSNL Offer: రోజూ 3 జీబీ డేటా, 84 రోజుల వ్యాలిడిటీ.. BSNL క్రేజీ ప్లాన్..

Jio Special Offer: జియో సరికొత్త రీఛార్జ్ ప్లాన్.. జస్ట్ రూ.91కే వాలిడిటీ అన్ని రోజులా!

Jan Dhan Yojana: జన్‌ధన్ ఖాతాల్లో నిధుల వెల్లువ.. 10 ఏళ్లలో భారీగా పెరిగిన డిపాజిట్లు

GST on Cable TV: 18 నుంచి 5 శాతం జీఎస్టీ.. నెలవారీ టీవీ బిల్లులకు భారీ ఊరట!

Gold Rate Hikes: పసిడి ప్రియులకు షాక్! మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

BSNL vs JIo Airtel: BSNL నుంచి అదిరిపోయే ప్లాన్.. జస్ట్ రూ. 147కే నెల రోజుల వ్యాలిడిటీ!

Big Stories

×