BigTV English

Best Selling MVP: అగ్రస్థానంలో మారుతి ఎర్టిగా.. బెస్ట్ సెల్లింగ్ ఎమ్‌విపిగా రికార్డ్.. ఫీచర్లు, ధర ఇవే!

Best Selling MVP: అగ్రస్థానంలో మారుతి ఎర్టిగా.. బెస్ట్ సెల్లింగ్ ఎమ్‌విపిగా రికార్డ్.. ఫీచర్లు, ధర ఇవే!

Best Selling MVP: మల్టీ పర్పస్ వెహికల్ (MPV) సెగ్మెంట్ గత కొన్ని సంవత్సరాలుగా స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది. ఈ విభాగంలో మారుతీ సుజుకి ఎర్టిగా, టయోటా ఇన్నోవా హైక్రాస్, కియా కేరెన్స్, రెనాల్ట్ ట్రైబర్, టయోటా రూమియన్ వంటి కార్లు బాగా ఫేమప్ అయ్యాయి. గత నెలలో ఈ సెగ్మెంట్ సేల్స్‌లో మరోసారి మారుతి సుజుకి ఎర్టిగా మొదటి స్థానం సాధించింది.


గత నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 కార్ల జాబితాలో మారుతి సుజుకి ఎర్టిగా కూడా ఉంది.2024 మే నెలలో మారుతి సుజుకి ఎర్టిగా మొత్తం 13,893 యూనిట్ల MVPలను సేల్ చేసింది.  మారుతి సుజుకి ఎర్టిగా గత FY24లో దేశంలో మొత్తం 1,49,757 యూనిట్లు విక్రయించింది. గత నెలలో ఈ సెగ్మెంట్ విక్రయాల గురించి వివరంగా తెలుసుకుందాం.

Also Read: దెబ్బ అదుర్స్.. మహీంద్రా నుంచి బొలెరో, స్కార్పియో EV వేరియంట్స్!


టయోటా ఇన్నోవా (క్రిస్టా, హైక్రాస్) రెండవ స్థానంలో ఉంది. టయోటా ఇన్నోవా మొత్తం 8,548 యూనిట్ల ఎమ్‌పివిలను విక్రయించింది. అదే సమయంలో కియా కేరెన్స్ ఈ విక్రయాల జాబితాలో మూడవ స్థానంలో ఉంది. ఈ కాలంలో కియా కేరెన్స్ మొత్తం 5,316 యూనిట్ల ఎమ్‌పివిలను విక్రయించింది. మరోవైపు, ఈ విక్రయాల జాబితాలో మారుతి సుజుకి XL6 నాల్గవ స్థానంలో ఉంది.

మారుతి సుజుకి Xl6 మొత్తం 3,241 యూనిట్ల MPVలను విక్రయించింది. ఇది కాకుండా ఈ విక్రయాల జాబితాలో రెనాల్ట్ ట్రివర్ ఐదవ స్థానంలో ఉంది. ఈ కాలంలో Renault Triver మొత్తం 2,116 యూనిట్ల MPVలను విక్రయించింది. కాగా ఈ జాబితాలో టయోటా రూమియన్ ఆరో స్థానంలో ఉంది. టయోటా రూమియన్ మొత్తం 1,919 యూనిట్ల సేల్స్ నమోదు చేసింది.

మారుతి ఎర్టిగా పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడితే మారుతి సుజుకి ఎర్టిగాలో మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 1.5-లీటర్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజన్ ఉంది. కారు ఇంజన్ 103బిహెచ్‌పి పవర్ అవుట్‌పుట్, 136.8ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మారుతి ఎర్టిగా పెట్రోల్ మాన్యువల్ వేరియంట్‌లో 20.51kmpl, పెట్రోల్ ఆటోమేటిక్‌లో 20.3kmpl, CNG పవర్‌ట్రైన్‌తో 26.1kmpl మైలేజీని అందిస్తుంది.  CNG కిట్‌తో ఇది 88bhp పవర్, 121.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Also Read: కార్లపై రూ.3 లక్షల డిస్కౌంట్.. ఫుల్ డీటైల్స్‌పై ఓ లుక్కేయండి..!

మారుతి సుజుకి ఎర్టిగా ధర, ఫీచర్ల గురించి మాట్లాడితే ఇది ఆండ్రాయిడ్ ఆటో,ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీకి సపోర్ట్ ఇచ్చే 7-అంగుళాల స్మార్ట్‌ప్లే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్‌తో కూడిన ఆటో AC వంటివి కలిగి ఉంది. ఇది కాకుండా సేఫ్టీ కోసం కారులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS టెక్నాలజీ, బ్రేక్ అసిస్ట్, బ్యాక్ పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. మారుతి ఎర్టిగా టయోటా ఇన్నోవా క్రిస్టా మరియు మహీంద్రా మరాజోలతో మార్కెట్‌లో పోటీ పడుతోంది. మారుతి ఎర్టిగా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్  రూ. 8.69 లక్షల నుండి రూ. 13.03 లక్షల వరకు ఉంది.

Tags

Related News

RBI New Rules: RBI కొత్త రూల్స్..! ఆ ఖాతాలకు సెటిల్‌మెంట్‌కి 15 రోజుల గడువు

Credit Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి? లోన్ ఇవ్వాలా వద్దా అని బ్యాంకు ఎలా నిర్ణయిస్తుంది ?

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులు బంద్.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే!

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Big Stories

×