BSNL Rs. 174 Plan: దిగ్గజ టెలికాం సంస్థలు జియో, ఎయిర్ టెల్ కు గట్టి పోటీ ఇచ్చేలా ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL అదిరిపోయే ప్లాన్స్ ను పరిచయం చేస్తోంది. ఇప్పటికే పలు చౌక ప్లాన్స్ ను పరిచయం చేసిన ఈ సంస్థ తాజాగా మరో క్రేజీ ప్లాన్ ను తీసుకొచ్చింది. సామాన్యులను దృష్టిలో ఉంచుకుని కేవలం రూ. 147కే నెల రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ తో స్టార్ టెలికాం సంస్థలు అయిన జియో, ఎయిర్ టెల్ కు చుక్కలు చూపించబోతోంది.
30 రోజుల వ్యాలిడిటీ, 10 జీబీ డేటా
BSNL ప్రవేశ పెట్టిన రూ. 147 ప్లాన్ తక్కువ ధర మాత్రమే కాదు, క్రేజీ ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ ప్రకారం రీఛార్జ్ చేసుకునే వారిని నెల రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఏ నెట్ వర్క్ కు అయినా అపరిమితంగా కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, 10 జీబీ వరకు హైస్పీడ్ డేటా లభిస్తుంది. రోజుకు కేవలం రూ. 5 ఖర్చుతో వినియోగదారులను ఈ ప్రయోజనాలను పొందవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇతర టెలికాం సంస్థలతో పోల్చితే ఈ ప్లాన్ అత్యంత చౌకైనది కావడం విశేషం.
పరిమితంగా మొబైల్ వాడే వారికి ఉపయోగం
ఈ ప్లాన్ విద్యార్థులకు, వృద్ధులకు, పరిమితంగా మొబైల్ వాడే వారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఎక్కువ డేటా వినియోగించే వారికి మాత్రం సూట్ కాదు. ఎందుకంటే, ఈ ప్లాన్ ద్వారా నెలకు కేవలం 10 జీబీ మాత్రమే డేటా లభిస్తుంది. ఈ డేటా పూర్తి అయ్యాక ఇంటర్నెట్ స్పీడ్ 40 కేబీపీఎస్ కు పడిపోతుంది. అయితే, కాల్స్ ఎక్కువ మాట్లాడే వారికి, వాట్సాప్, ఈమెయిల్ లాంటి సేవలు పొందే వారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. చీప్ అండ్ బెస్ట్ లో ఈ ప్లాన్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు.
Read Also: నిద్రలో మాట్లాడ్డం ఓ లోపమా? షాకింగ్ విషయాలు వెల్లడించిన పరిశోధకులు!
గ్రామీణ ప్రాంతాల్లో BSNL సేవల వినియోగం
ప్రైవేట్ రంగ సంస్థలు అయిన ఎయిర్ టెల్, జియో దేశ వ్యాప్తంగా 4జీ, 5జీ సేవలను అందిస్తున్నాయి. అయితే, BSNL నెట్ వర్క్ ఇప్టపికీ గ్రామీణ ప్రాంతాల్లో బలంగానే ఉంది. చాలా మంది గ్రామీణ ప్రజలు ఈ సేవలను వినియోగిస్తున్నారు లాభాల కోసం మాత్రమే కాకుండా, ప్రజలకు సేవలు అందించాలనే లక్ష్యంగా BSNL తక్కువ ధరలకే చక్కటి ప్లాన్ అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా తీసుకొచ్చిన రూ. 147 ప్లాన్ తో BSNL తన వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు కొత్త స్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్లాన్ తో ప్రైవేట్ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వడంతో పాటు ఆ సంస్థలకు కూడా తక్కువ ధరలకే ప్లాన్స్ తీసుకొచ్చేలా ఒత్తడి పెరిగేలా చేయనుంది.
Read Also: నిద్రలో మాట్లాడ్డం ఓ లోపమా? షాకింగ్ విషయాలు వెల్లడించిన పరిశోధకులు!